Lord Shani : శని దేవుడు అంటే భయమా… ఆయన నేర్పించిన జీవిత పాఠాలు ఉండగా భయమెందుకు…?
ప్రధానాంశాలు:
Lord Shani : శని దేవుడు అంటే భయమా... ఆయన నేర్పించిన జీవిత పాఠాలు ఉండగా భయమెందుకు...?
Lord Shsni : జ్యోతిష్య శాస్త్రాలలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే, అందులో శనీశ్వరుడు కి ఎంతో ప్రాధాన్యత ఉంది. శనీశ్వరుడు కర్మ ప్రదాత. శనీశ్వరుడు, సూర్యుడు ఛాయాదేవిలా తనయుడు. అంతే కాదు న్యాయ దేవుడు, కర్మ ప్రదాత అని కూడా నమ్ముతారు. శనీశ్వరుడు మనిషి చేసిన కర్మల ఆధారంగా ఫలితాలను ఇస్తాడు. మనిషి జీవితంలో చేసే మంచి, చెడు కర్మలను అనుసరించి ఫలితాలను ఇస్తుంటాడు. చాలామంది కూడా శనీశ్వరుడు అంటేనే భయపడిపోతుంటారు. కానీ, ఈ కర్మ ప్రధాన నుంచి ప్రతి మనిషి నేర్చుకోవలసిన జీవిత పాఠాలు కూడా చాలా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. ఈ దేవుడు కర్మ ప్రదాత, న్యాయ దేవుడు, శనీశ్వరుడు ఎల్లప్పుడూ కర్మలను ఆధారంగా తగిన ఫలితాలను ఇస్తుంటాడు.శని శ్వరుడు ఆగ్రహానికి గురైతే జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.ఆయన అనుగ్రహం ఎవరికైతే ఉంటుందో.వారికి విజయం నెమ్మదిగా సొంతమవుతుంది. అయితే,శనీశ్వరుడు అనుగ్రహం ఎన్ని కష్టాలు తెస్తుందో, ఆయన అనుగ్రహం కూడా అంతే గొప్పగా ఉంటుంది.ఇక శనీశ్వరుల్లోని కొన్ని విషయాలను నేర్చుకోవాలి.వాటిని జీవితానికి అనువదింప చేసుకోవడం వల్ల మంచి జీవితం లభిస్తుంది.

Lord Shani : శని దేవుడు అంటే భయమా… ఆయన నేర్పించిన జీవిత పాఠాలు ఉండగా భయమెందుకు…?
Lord Shani శనీశ్వరుడు నుంచి నేర్చుకోవలసిన జీవిత పాఠాలు ఏమిటి
కష్టాలను ఎదుర్కోవడం : కోన్నిసార్లు శనీశ్వరుడు వలన ఇబ్బందులు తలెత్తవచ్చు. ఆ కష్టాలు గత కర్మ ఫలాలు కావచ్చు. ఆ కష్టాలను ఎలా ఎదుర్కోవాలో శనీశ్వరుడు మనకు నేర్పుతాడు. అందువలన కష్టాలను ఎదుర్కునే కళ మనకు తెలిస్తే మనం బలంగా మారవచ్చు.
క్రమశిక్షణ : శనీశ్వరుడు క్రమశిక్షణను కూడా బోధిస్తాడు. ఎక్కడ ఉండాలి,ఎలా ఉండాలి సమయానికి అనుగుణంగా ఏ పనులు చేయాలో శనీశ్వరుడు క్రమశిక్షణ ద్వారా జీవిత పాఠాలను నేర్పిస్తాడు.
సహనం : మనం శనీశ్వరుడు నుంచి సహనం పట్టుదల వంటి గుణాలను నేర్చుకోవచ్చు. అదేవిధంగా, శని దేవుని నుంచి పట్టుదలను పాఠంగా నేర్చుకోవచ్చు.అలాగే సవాళ్లు ఎదుర్కోవటం కూడా మనం సహనంతో పాటు బాధ్యతను నేర్చుకోవచ్చు.
బాధ్యత : జీవితంలో బాధ్యత తీసుకోవడం కూడా చాలా ముఖ్యం.శనీశ్వరుడు నుండి మనం బాధ్యతయుతంగా ఎలా వ్యవహరించాలో, నిర్ణయాలు ఎలా తీసుకోవాలో నేర్పిస్తాడు.
ఆత్మ పరిశీలన :
శని శ్వరుడు ఒక వ్యక్తికి తన తప్పులను లోపాలను గుర్తించి, ఆ తప్పులను సరిదిద్దుకొని సానుకూలంగా జీవించే అవకాశాలను ఇస్తాడు. అలాగే మనం సరైన మార్గాన్ని అనుసరించాలని, సరైన మార్గాన్ని అనుసరిస్తే జీవితంలో మంచి జరుగుతుందని,శని నుండి జీవిత పాఠం నేర్చుకోవచ్చు.
కర్మ పాఠాలు :
శనీశ్వరుడు కర్మకు సంబంధించిన వాడు.కనుక,శనీశ్వరుని కోసం చర్యలు పరిణామాలను హైలెట్ చేస్తుంది..మనం మంచి చేస్తే మనకు మంచి వస్తుంది.మనం ఎవరికైనా చెడు చేస్తే చెడు వస్తుంది.మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు వస్తుంది. కర్మ ఫలాలను బట్టి ఫలితాన్ని అనుభవించవలసి వస్తుందని శనీశ్వరుడు నేర్పించే పాఠం.