Lord Shani | సెప్టెంబర్ 7, 2025 .. శనిదేవుని రాశిలో చంద్రగ్రహణం ..ఈ రాశుల వారికి ప్రత్యేక ఫలితాలు!
Lord Shani | 2025 సెప్టెంబర్ 7వ తేదీకి విస్తారమైన జ్యోతిష్య ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు భాద్రపద మాస పౌర్ణమి తిథి కాగా, అదే రోజున ఈ సంవత్సరంలోని రెండవ చంద్రగ్రహణం ఏర్పడనుంది.ప్రతి సంవత్సరం పితృ పక్షం భాద్రపద పౌర్ణమి తిథినే ప్రారంభమవుతుంది. అయితే ఈసారి ఈ పవిత్ర రోజున చంద్రగ్రహణం కుంభ రాశిలో ఏర్పడనుండడం విశేషం. కుంభ రాశి అధిపతి శనిదేవుడు, న్యాయానికి, కర్మ ఫలితాలకు నిలయంగా భావించబడతాడు. ఈ గ్రహణం సమయంలో కొన్ని రాశులపై ఆయన ఆశీస్సులు కురుస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

#image_title
వృషభ రాశి
ఈ రోజున వృషభ రాశివారు బాధల నుంచి విముక్తి, వ్యాపారంలో లాభం, మరియు కష్టానికి తగిన ఫలితం పొందగలుగుతారు. శనిదేవుడి కృప వర్షించనుంది. శుభ ఫలితాల కోసం ఇనుము దానం చేయండి, శివలింగానికి నీటిని సమర్పించి పూజ చేయండి.
మిథున రాశి
ఈ రాశివారికి ఆర్థిక లాభాలు, కొత్త ఒప్పందాలు, పాత పనుల పూర్తి వంటి అనేక శుభ ఫలితాలు లభించగలవు. శనిదేవుని అనుగ్రహం కోసం నల్ల నువ్వులు, మినప పప్పు దానం చేయడం మంచిది.
తులా రాశి
కుంభ రాశిలో ఏర్పడే గ్రహణం వల్ల తులా రాశి వారికి కెరీర్ పురోగతి, ఆర్థిక అభివృద్ధి, కుటుంబ బంధాల బలపాటు వంటి లాభాలు లభిస్తాయి. శనిదేవుని కృప పొందాలంటే శని ఆలయంలో ఆయన పాదాలకు ఆవు నూనె సమర్పించి, శని మంత్రాన్ని జపించండి.
మకర రాశి
మకర రాశి అధిపతి కూడా శనిదేవుడే. కాబట్టి ఈ గ్రహణం వారికి అనుకూలంగా ఉంటుంది. కోర్టు కేసుల్లో విజయం, ఉద్యోగ భద్రత, మానసిక శాంతి లభించగలవు. శుభ ఫలితాల కోసం రావి చెట్టు వద్ద నూనె దీపం వెలిగించండి.
ఈ గ్రహణం రోజున శనిదేవుడి రాశిలో చంద్రుడు ఉండడం వల్ల కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు దక్కే అవకాశముంది. తమకు అనుకూల ఫలితాల కోసం జ్యోతిష్య సూచనల ప్రకారం దానం, పూజలు, మంత్ర జపం చేయడం మంచిదని పండితులు చెబుతున్నారు.