Shri krishna Janmashtami : కృష్ణాష్టమి పండుగను హిందువులు మాత్రమే కాకుండా విదేశీయులు కూడా ఘనంగా జరుపుకుంటారు. శ్రీకృష్ణుడు జన్మించిన రోజుకి కృష్ణాష్టమి గోకులాష్టమి అనే పేర్లు కూడా ఉన్నాయి. శ్రీమహావిష్ణువు వివిధ అవతారాలను దాల్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ దశావతారాలలో ఎనిమిదో అవతారమే శ్రీకృష్ణ పరమాత్ముడని అందరి నమ్మకం. పురాణాలలో ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా మహావిష్ణువు జన్మించాడని చెప్పబడింది. అయితే దేవి వాసుదేవుల 8వ సంతానంగా శ్రావణ మాస కృష్ణపక్షంలోని అష్టమి తిథి, రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి సమయంలో గోపాలుడు జన్మించాడు. అయితే ప్రతి సంవత్సరం శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను ఈ తిథిలో అత్యంత వైభవంగా జరుపుకుంటారు. మరి ఈ ఏడాది కృష్ణాష్టమి ఏ రోజున జరుపుకోవాలి. శుభముహూర్తం ఎప్పుడు..? అనే విషయంలో అందరూ సతమతమై పోతున్నారు. ఎందుకంటే ఈసారి అష్టమ తిధి మిగులు తగులుగా వచ్చాయి. మరి శ్రీ కృష్ణాష్టమిని ఎప్పుడు జరుపుకోవలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
వేద పంచాంగం ప్రకారం శ్రావణమాస కృష్ణపక్ష అష్టమి తిధి ఆగస్టు 26వ తేదీ సోమవారం రోజున తెల్లవారుజామున 3 :39 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే ఆగస్టు 27వ తేదీ మంగళవారం తెల్లవారు జామున 2 :19 కు ముగుస్తుంది. ఇక ఆగస్టు 26వ తేదీన మధ్యాహ్నం 3:55 గంటలకు మొదలవుతుంది. అదేవిధంగా ఆగస్టు 27 వ తేదీన మధ్యాహ్నం 3:30 గంటలకు ముగుస్తుంది. దీంతో ఈ ఏడాది ఆగస్టు 26 మరియు ఆగస్టు 27 ఈ రెండిటిలో ఏ రోజున జరుపుకోవాలి అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. అయితే ఈ విషయాలకు పండితులు సమాధానం ఇస్తూ… కృష్ణాష్టమిని స్మర్త కృష్ణాష్టమి వైష్ణవ కృష్ణాష్టమిగా జరుపుకుంటారు. అయితే కొందరు ఈ పర్వదినాన్ని రెండు రోజులు జరుపుకుంటారని పండితులు చెబుతున్నారు.
స్మార్త కృష్ణాష్టమి అంటే శివకేశవులను పూజించే వారిని స్మార్తులు అంటారు. అదేవిధంగా ఆదిశంకరాచార్యులను ఆరాధించే వారిని స్మార్తులు అంటారు. ఆగస్టు 26వ తేదీ సోమవారం నాడు కృష్ణాష్టమి పండుగ జరుపుకోవాలని చెబుతున్నారు. ఎందుకంటే వీరికి శ్రీకృష్ణాష్టమి జరుపుకోవడానికి రోహిణి నక్షత్రం సూర్యోదయం ఉండాలి అనే నియమం లేదు. కాబట్టి వీరు రోహిణి నక్షత్రం ఉన్న ఈ వేడుకను జరుపుకోవచ్చు.
వైష్ణవ సాంప్రదాయాన్ని పాటించేవారు కేవలం ఆగస్టు 27 మంగళవారం రోజున శ్రీకృష్ణాష్టమి వేడుకలను జరుపుకోవాలి.ఎందుకంటే వీరు కృష్ణుడిని పూజించాలంటే అష్టమతిది సూర్యోదయ సమయానికి రోహిణి నక్షత్రం తప్పకుండా ఉండాలి.కాబట్టి వైష్ణవులు విష్ణువుని మాత్రమే పూజిస్తారు కనుక కృష్ణాష్టమిని ఆగస్టు 27వ తేదీ మంగళవారం నాడు జరుపుకోవాలి.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.