Shri krishna Janmashtami : శ్రీకృష్ణ జన్మాష్టమిని ఎప్పుడు జరుపుకోవాలి..? పూజా విధానం ఏంటి..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Shri krishna Janmashtami : శ్రీకృష్ణ జన్మాష్టమిని ఎప్పుడు జరుపుకోవాలి..? పూజా విధానం ఏంటి..?

Shri krishna Janmashtami : కృష్ణాష్టమి పండుగను హిందువులు మాత్రమే కాకుండా విదేశీయులు కూడా ఘనంగా జరుపుకుంటారు. శ్రీకృష్ణుడు జన్మించిన రోజుకి కృష్ణాష్టమి గోకులాష్టమి అనే పేర్లు కూడా ఉన్నాయి. శ్రీమహావిష్ణువు వివిధ అవతారాలను దాల్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ దశావతారాలలో ఎనిమిదో అవతారమే శ్రీకృష్ణ పరమాత్ముడని అందరి నమ్మకం. పురాణాలలో ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా మహావిష్ణువు జన్మించాడని చెప్పబడింది. అయితే దేవి వాసుదేవుల 8వ సంతానంగా శ్రావణ మాస కృష్ణపక్షంలోని అష్టమి తిథి, రోహిణి […]

 Authored By ramu | The Telugu News | Updated on :26 August 2024,6:00 am

ప్రధానాంశాలు:

  •  Shri krishna Janmashtami : శ్రీకృష్ణ జన్మాష్టమిని ఎప్పుడు జరుపుకోవాలి..? పూజా విధానం ఏంటి..?

Shri krishna Janmashtami : కృష్ణాష్టమి పండుగను హిందువులు మాత్రమే కాకుండా విదేశీయులు కూడా ఘనంగా జరుపుకుంటారు. శ్రీకృష్ణుడు జన్మించిన రోజుకి కృష్ణాష్టమి గోకులాష్టమి అనే పేర్లు కూడా ఉన్నాయి. శ్రీమహావిష్ణువు వివిధ అవతారాలను దాల్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ దశావతారాలలో ఎనిమిదో అవతారమే శ్రీకృష్ణ పరమాత్ముడని అందరి నమ్మకం. పురాణాలలో ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా మహావిష్ణువు జన్మించాడని చెప్పబడింది. అయితే దేవి వాసుదేవుల 8వ సంతానంగా శ్రావణ మాస కృష్ణపక్షంలోని అష్టమి తిథి, రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి సమయంలో గోపాలుడు జన్మించాడు. అయితే ప్రతి సంవత్సరం శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను ఈ తిథిలో అత్యంత వైభవంగా జరుపుకుంటారు. మరి ఈ ఏడాది కృష్ణాష్టమి ఏ రోజున జరుపుకోవాలి. శుభముహూర్తం ఎప్పుడు..? అనే విషయంలో అందరూ సతమతమై పోతున్నారు. ఎందుకంటే ఈసారి అష్టమ తిధి మిగులు తగులుగా వచ్చాయి. మరి శ్రీ కృష్ణాష్టమిని ఎప్పుడు జరుపుకోవలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…

Shri krishna Janmashtami 2024 జన్మాష్టమి ఎప్పుడంటే..

వేద పంచాంగం ప్రకారం శ్రావణమాస కృష్ణపక్ష అష్టమి తిధి ఆగస్టు 26వ తేదీ సోమవారం రోజున తెల్లవారుజామున 3 :39 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే ఆగస్టు 27వ తేదీ మంగళవారం తెల్లవారు జామున 2 :19 కు ముగుస్తుంది. ఇక ఆగస్టు 26వ తేదీన మధ్యాహ్నం 3:55 గంటలకు మొదలవుతుంది. అదేవిధంగా ఆగస్టు 27 వ తేదీన మధ్యాహ్నం 3:30 గంటలకు ముగుస్తుంది. దీంతో ఈ ఏడాది ఆగస్టు 26 మరియు ఆగస్టు 27 ఈ రెండిటిలో ఏ రోజున జరుపుకోవాలి అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. అయితే ఈ విషయాలకు పండితులు సమాధానం ఇస్తూ… కృష్ణాష్టమిని స్మర్త కృష్ణాష్టమి వైష్ణవ కృష్ణాష్టమిగా జరుపుకుంటారు. అయితే కొందరు ఈ పర్వదినాన్ని రెండు రోజులు జరుపుకుంటారని పండితులు చెబుతున్నారు.

Shri krishna Janmashtami స్మార్త కృష్ణాష్టమి లో ఎప్పుడు పూజ చేయాలంటే..

స్మార్త కృష్ణాష్టమి అంటే శివకేశవులను పూజించే వారిని స్మార్తులు అంటారు. అదేవిధంగా ఆదిశంకరాచార్యులను ఆరాధించే వారిని స్మార్తులు అంటారు. ఆగస్టు 26వ తేదీ సోమవారం నాడు కృష్ణాష్టమి పండుగ జరుపుకోవాలని చెబుతున్నారు. ఎందుకంటే వీరికి శ్రీకృష్ణాష్టమి జరుపుకోవడానికి రోహిణి నక్షత్రం సూర్యోదయం ఉండాలి అనే నియమం లేదు. కాబట్టి వీరు రోహిణి నక్షత్రం ఉన్న ఈ వేడుకను జరుపుకోవచ్చు.

Shri krishna Janmashtami శ్రీకృష్ణ జన్మాష్టమిని ఎప్పుడు జరుపుకోవాలి పూజా విధానం ఏంటి

Shri krishna Janmashtami : శ్రీకృష్ణ జన్మాష్టమిని ఎప్పుడు జరుపుకోవాలి..? పూజా విధానం ఏంటి..?

Shri krishna Janmashtami వైష్ణవ కృష్ణాష్టమి జరుపుకునే సాంప్రదాయం ఏమిటంటే…

వైష్ణవ సాంప్రదాయాన్ని పాటించేవారు కేవలం ఆగస్టు 27 మంగళవారం రోజున శ్రీకృష్ణాష్టమి వేడుకలను జరుపుకోవాలి.ఎందుకంటే వీరు కృష్ణుడిని పూజించాలంటే అష్టమతిది సూర్యోదయ సమయానికి రోహిణి నక్షత్రం తప్పకుండా ఉండాలి.కాబట్టి వైష్ణవులు విష్ణువుని మాత్రమే పూజిస్తారు కనుక కృష్ణాష్టమిని ఆగస్టు 27వ తేదీ మంగళవారం నాడు జరుపుకోవాలి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది