Somnath Jyotirlinga Temple : సోమనాథ జ్యోతిర్లింగం ప్రాశస్త్యం ఇదే ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Somnath Jyotirlinga Temple : సోమనాథ జ్యోతిర్లింగం ప్రాశస్త్యం ఇదే !

 Authored By keshava | The Telugu News | Updated on :5 March 2021,7:59 am

Somnath Jyotirlinga Temple : శివోహం… మాఘమాసం అనగానే అందరికీ గుర్తుకువచ్చేది మహాశివరాత్రి. శివరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ప్రధాన శైవాలయాలలో ప్రారంభమయ్యాయి. ఈ పవిత్రమైన సందర్భంలో శివుడి ధ్యానం, శివ క్షేత్రాల గురించి తెలుసుకోవడం, శివుడి పంచాక్షరీ జపించండం చేస్తే విశేష ఫలితాలు వస్తాయి. ఈ పరంపరలో దేశంలోని అత్యంత పవిత్రమైన ద్వాదశజ్యోతిర్లింగాల గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం.. మహాదేవుడిని స్మరించుకుందాం.. ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిదైన సోమనాథేశ్వరుడి గురించి తెలుసుకుందాం.. ‘‘సౌరాష్టే సోమనాథంచ’’ అని అందరికీ తెలుసు.. స్వామి సోమనాథునిగా వెలసిన కథ స్కాంద పురాణంలో ఉంది. ఆ కథ వివరాలలోకి వెళితే… బ్రహ్మదేవుని మానసపుత్రుడైన దక్షప్రజాపతికి అశ్విని నుంచి రేవతి వరకు 27 కుమార్తెలున్నారు.

తన కుమార్తెలను చంద్రునికి ఇచ్చి ఘనంగా అం జరిపించాడు దక్షుడు. అయితే చంద్రుడు రోహిణిని మాత్రం అనురాగంతో చూస్తూ, మిగిలినవారిని అలక్ష్యం చేయసాగాడు. మిగిలినవారు తండ్రితో ఈ విషయాన్ని మొరపెట్టుకోగా, దక్షుడు అల్లుడైన చంద్రుడిని మందలిస్తాడు. అయినప్పటికీ, చంద్రుని ప్రవర్తనలో మార్పురాకపోవడంతో, క్షయరోగగ్రస్తుడవు కమ్మని చంద్రుని శపిస్తాడు దక్షుడు. ఫలితంగా చంద్రుడు క్షీణించ సాగాడు.

Somnath Jyotirlinga Temple History

Somnath Jyotirlinga Temple History

చంద్రకాంతి లేకపోవడంతో ఔషధాలు, పుష్పాలు ఫలించలేదు. ఈ పరిస్థితిని చూసిన సమస్తలోకవాసులు, తమ కష్టాలు తీరేమార్గం చూపమని బ్రహ్మ దేవుని ప్రార్థించారు. బ్రహ్మ ఆదేశాన్ననుసరించి ప్రభాసక్షేత్రంలో మహామృత్యుంజయ మంత్రానుష్ఠానంగా శంకరుని అస్థరాధించిన చంద్రుదు, పార్థివలింగాన్ని ప్రతిష్టించి పూజించగా, శంకరుడు ప్రత్యక్షమై, చంద్రుని రోగ విముక్తుని గావించి, కృష్ణపక్షంలో చంద్రకళలు రోజు రోజుకీ తగ్గుతాయనీ, శుక్లపక్షంలో దిన మొకకళ చొప్పున పెరుగుతుందని అను గ్రహించాడు. ఆనాటి నుండి చంద్రుని కోరిక మేర, అతని కీర్తిదశదిశలా వ్యాపించేందుకై చంద్రుని పేరుతో సోమనాథునిగా, కుష్టు వంటి మహా రోగాలను తగ్గించే సోమనాథ జ్యోతిర్లింగరూపునిగా పార్వతీదేవి సమేతంగా వెలసి భక్తులను కరుణిస్తున్నాడు. ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంది. అన్ని ప్రముఖ పట్టణాల నుంచి ఇక్కడికి చేరుకోవచ్చు.

keshava

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది