Maha Shivaratri : బిల్వపత్రం శివునికి ఎందుకు ఇష్టం…? అసలు వీటి గురించి పురాణాలు ఏం చెబుతున్నాయి..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Maha Shivaratri : బిల్వపత్రం శివునికి ఎందుకు ఇష్టం…? అసలు వీటి గురించి పురాణాలు ఏం చెబుతున్నాయి..?

 Authored By ramu | The Telugu News | Updated on :27 February 2025,6:00 am

ప్రధానాంశాలు:

  •  Maha Shivaratri : బిల్వపత్రం శివునికి ఎందుకు ఇష్టం...? అసలు వీటి గురించి పురాణాలు ఏం చెబుతున్నాయి..?

Maha Shivaratri  : మన తెలుగు సాంప్రదాయాలలో మహాశివరాత్రి పండుగ హిందూ ధర్మంలో ముఖ్యమైన పండుగ. ఈ మహాశివరాత్రి రోజున భక్తులు విశేషంగా శివునికి భక్తితో పూజలు చేస్తారు. ఇంకా శివయ్యకు వివిధ రకాల సమర్పణలు కూడా చేస్తారు. అందులో ముఖ్యమైనది మారేడు ఆకులు ( బిల్వపత్రాలు) శివుని పూజలో విటికీ ప్రత్యేక స్థానం ఉంది. ఇంకా శివునికి ఎంతో ప్రీతికరమైన పత్రాలు. అయితే పురాణాలు తెలిపేది ఏమిటంటే మారేడు ఆకులను సమర్పించడం శుభప్రదం అని, పాపా విమోచనానికి దారితీస్తుందని నమ్ముతారు. మన హిందూ ధర్మంలో మారేడు వృక్షం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దీనికి గల పవిత్రత కారణంగా శివుని పూజలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఆకులు బత్తిని సూచిస్తాయి మరియు శివుడు వాటిని ఎంతో ప్రీతితో స్వీకరిస్తాడని ఏ భక్తులు ప్రగాఢ విశ్వాసంతో నమ్ముతారు.

Maha Shivaratri బిల్వపత్రం శివునికి ఎందుకు ఇష్టం అసలు వీటి గురించి పురాణాలు ఏం చెబుతున్నాయి

Maha Shivaratri : బిల్వపత్రం శివునికి ఎందుకు ఇష్టం…? అసలు వీటి గురించి పురాణాలు ఏం చెబుతున్నాయి..?

Maha Shivaratri  త్రిఫల ప్రతీక

బిల్వపత్రమునకు ఆ పేరు మూడు ఆకులను కలిగి ఉండడం వలన బిల్వపత్రం లేదా త్రీఫల పత్రం అని కూడా అంటారు. ఈ మూడు ఆకులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సూచిస్తాయని హిందూ ధర్మం చెబుతుంది. ఈ సమతుల్యత శివుని అనుగ్రహం పొందేందుకు సహాయపడుతుందని భక్తులు విశ్వాసం.

లక్ష్మీదేవి, మారేడు వృక్షం :  పురాణాలలో, స్కంద పురాణం, శివపురాణం వంటి ప్రాచీన గ్రంధాలు మారేడు ఆకులు ప్రాముఖ్యతను సూచిస్తుంది. భక్తితో సమర్పించిన ఒక్క బిల్వపత్రం కూడా అపారమైన శుభ ఫలితాలను ఇస్తుందని చెబుతున్నాయి పురాణాలు. శివునికి ఏది లేకపోయినా ఒక్క మారేడు పత్రం సమర్పించినా చాలు శివయ్య కటాక్షంతో విశేష ఫలితాలను భక్తులకు ఇస్తాడు అని పురాణాలు తెలియజేస్తున్నాయి.

ఆధ్యాత్మిక శక్తి : ఈ త్రిఫల పత్రాలు ఆధ్యాత్మిక శక్తిని మన జీవితంలో ప్రతికూలశక్తులను కూడా తొలగిస్తుందని నమ్ముతారు. వీటిని సమర్పించడం వల్ల పాప క్షయానికి దారితీస్తుందని పురాణాలు తెలియజేస్తున్నాయి. ఈ బిల్వపత్రాలు సమర్పించడం వల్ల భక్తులకు మోక్షమార్గం సులభం అవుతుందని విశ్వసిస్తారు.

ఆరోగ్య ప్రయోజనాలు : మరి ఆరోగ్యపరంగా చూస్తే విలువ వృక్షం ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఈ చెట్టు ఆకులు, గింజలు ఆయుర్వేదంలో విస్తృతంగా ఉపయోగిస్తారు. శరీరంలోని మలిన పదార్థాలను తొలగించడానికి లేదా విశాలను తొలగించడానికి సహాయపడుతుంది. విలువ ఆకులు శరీరాన్ని శుభ్రపరచడమే కాదు మానసిక శాంతిని కూడా ఇస్తుంది.

శివరాత్రికి ప్రత్యేకత : మహాశివరాత్రి రోజున ముఖ్యంగా మారేడు ఆకులు అనగా విలువ పత్రాలను శివునికి సమర్పించితే సంతోషిస్తాడు అని పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్రమైన రోజున శివునికి మారేడు ఆకులు భక్తిశ్రద్ధలతో సమర్పిస్తే భక్తులకు ఇష్టకార్యాలు నెరవేరుతాయి అని నమ్ముతారు. భక్తులకూ తమ కుటుంబంలో, ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి విముక్తిని పొందే ఎందుకో శివున్ని ఆరాధిస్తారు.
అయితే మారేడు ఆకులతో శివుడిని పూజలో అత్యంత ముఖ్యమైన సమర్పణలో ఒకటిగా మారాయి. మత్తులో మహాశివరాత్రి రోజున ప్రత్యేక పూజలు నిర్వహించడం, మారేడు ఆకులను సమర్పించడం టీవీ చేయడం వల్ల శివుని యొక్క అనుగ్రహం పొందుతారు. శివునికి మారేడు దళం అంటే చాలా ఇష్టం. ఒక్క మారేడు దళాన్ని శివునికి సమర్పిస్తే మీ కోరికలన్నీ సిద్ధిస్తాయి.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది