Srikalahasti Temple : హిందూ పురాణాలలో శ్రీకాళహస్తి ఆలయానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే పంచభూత క్షేత్రాల్లో వాయు క్షేత్రం శ్రీకాళ హస్తీశ్వర క్షేత్రం. లింగానికెదురుగా ఉండే దీపం లింగము నుంచి వచ్చే గాలికి రెపరెపలాడడం ఇక్కడ ప్రత్యేకత. అదేవిధంగా శ్రీకాళహస్తిలో శివుడు రాహుకేతువులు , జ్ఞాన ప్రసూనాంబికలు వెలిసినట్లు భక్తులు భావిస్తారు. అలాగే ఇక్కడ రాహు కేతు దోష నివారణ పూజకు ప్రసిద్ది చెందినది. దీంతో చాలామంది జాతకాలలో రాహు కేతు దోషా నివారణ పూజ కోసం భక్తులు భారీ సంఖ్యలో ఇక్కడికి వస్తారు. తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆషాడం మాసం ఆదివారం అమావాస్య కావడంతో భక్తులు రాహుకేతు పూజలు నిర్వహించేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు భారీ సంఖ్యలో రావడంతో శ్రీకాళహస్తి రికార్డులను బద్దలు కొట్టింది. ఆదివారం అమావాస్య కావడంతో అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయానికి భారీగా తరలివచ్చారని ఆలయ అధికారి ఈ సందర్భంగా తెలియజేశారు.
అయితే ఆదివారం రోజు ఆలయంలో రాహుకేతు పూజల్లో 9,168 మంది భక్తులు పాల్గొన్నారు. అలాగే గత ఏడాది జూన్ 18న 7,597 మంది రాహుకేతు పూజల్లో పాల్గొని రికార్డును సృష్టించారు. అయితే ఇప్పుడు ఆ రికార్డు ని బీట్ చేసి కొత్త రికార్డు సృష్టించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవాలయం ఐకానోగ్రఫీ ద్వారా వచ్చింది. ఇక్కడ 5 తలల పాము ప్రసిద్ధి. దీనిని కేతువు అంటారు. కేతువు శివుని తలపై అలంకరించబడి ఉంటుంది. ఒక తల పాము రాహువు అంటారు. అమ్మవారు నడుమును చుట్టి ఉంటుంది. అలాగే రాహు కేతు పూజలో శివపార్వతులకు పూజ చేసే అత్యంత ఫలితం ఉంటుంది.
జాతకంలో దోషం లేదా ప్రతికూల ప్రభావాలను రాహుకేతుల పూజ ద్వారా తగ్గించగలమని భక్తులు నమ్మకం. రాహుకాలం పవిత్రమైనదిగా భావిస్తారు. దీంతో ఆ సమయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది.
రాహుకేతు పూజల కోసం దాదాపు 5,183 మంది భక్తులు రూ. 500 టిక్కెట్లు కొనుగోలు చేశారు. అలాగే 2,288 మంది భక్తులు రూ. 750 టిక్కెట్ల కొనుగోలు చేశారని దేవస్థాన అధికారులు తెలపడం జరిగింది. అదేవిధంగా రూ 1,500ల టికెట్ ను 933 మంది రూ. 2,500 టికెట్ ధర 610 మంది కొనుగోలు చేశారు. అలాగే 154 మంది భక్తులు రూ. 5,000 టిక్కెట్ల ను కొనుగోలు చేసి రాహు కేతు పూజ చేసినట్లు వెల్లడించారు. రాహుకేతు పూజలతో పాటు శీఘ్ర దర్శనం ప్రత్యేక ప్రవేశం కోసం 8,162 టిక్కెట్ల అమ్మకం జరిగిందని వెల్లడించింది. మరో వైపు ఆదివారం ఒక్క రోజే 29,505 వివిధ ప్రసాదాల ప్యాకెట్ల విక్రయం జరిగింది. దీంతో కాళహస్తి ఆలయానికి ఒక్కరోజులో కోటి రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. ఇక్కడ స్వయం భూలింగముగా వెలసిన శివలింగాన్ని సాలెపురుగు, పాము, ఏనుగు అర్చించడమే కాదు. తమ భక్తీ నిరుపించుకోవడంలో పోటాపోటీగా నిలిచి చివరకు మోక్షాన్ని పొందినట్లు . అప్పటి నుంచి ఇక్కడ ఉన్న స్వామిని కాళహస్తీశ్వరుడు అని పిలుస్తారని పురాణం లో చెప్పబడింది. శ్రీ అనగా సాలెపురుగు, కాళము అనగా పాము, హస్తి అనగా ఏనుగు. అంతేకాదు భక్తిలోని గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిన కన్నప్ప కూడా ఇక్కడ ఉన్న శివయ్యనే పుజించాడని నమ్మకం.
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
This website uses cookies.