Sheikh Hasina : ఢాకా : షేక్ హసీనా రాజీనామా తర్వాత బంగ్లాదేశ్‌లో పరిస్థితి మరింత అస్థిరంగా మారింది. మాజీ ప్రధాని, ఆమె సోదరి షేక్ రెహానాను అరెస్టు చేసి బంగ్లాదేశ్‌కు తిరిగి పంపాలని ఆ దేశ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (SCBA) అధ్యక్షుడు ఏఎం మహబూబ్ ఉద్దీన్ ఖోకాన్ భారత్‌ను కోరారు. బంగ్లాదేశ్ మీడియా సంస్థ ఢాకా ట్రిబ్యూన్ తెలిపిన వివరాల ప్రకారం.. SCBA ఆడిటోరియంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఖోకాన్ మాట్లాడుతూ.. తాము భారత ప్రజలతో సానుకూల సంబంధాన్ని కొనసాగించాలనుకుంటున్నట్లు వెల్లడించిన ఆయన దేశం విడిచి పారిపోయిన షేక్ హసీనా, షేక్ రెహానాలను అరెస్టు చేసి, వారిని తిరిగి బంగ్లాదేశ్‌కు పంపాల్సిందిగా పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో అనేక మరణాలకు హసీనా కారణమైందని ఆయన ఆరోపించారు,
బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) జాయింట్ సెక్రటరీ జనరల్ అయిన ఖోకాన్, అత్యవసర పరిస్థితిని ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ, రాజకీయ కార్యకలాపాలు మరియు అవినీతికి పాల్పడిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వారంలోగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హసీనా నేతృత్వంలోని అటార్నీ జనరల్ AM అమీన్ ఉద్దీన్‌తో సహా రాష్ట్ర న్యాయ అధికారులు, అవినీతి నిరోధక కమిషన్ (ACC) మరియు జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) అధిపతులు, అధికారులు రాజీనామా చేయాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. అలాగే రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
బంగ్లాదేశ్‌లో పెరుగుతున్న నిరసనల నేపథ్యంలో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగాల కోటా విధానాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ప్రధానంగా విద్యార్థులు తలపెట్టిన నిరసనలు ప్రభుత్వ వ్యతిరేక నిరసనల రూపాన్ని సంతరించుకున్నాయి. ఆందోళనలు హింసాత్మక రూపు దాల్చడంతో హసీనా గడిచిన సోమవారం సాయంత్రం భారత్‌కు చేకుంది. ఈ నేపథ్యంలో హసీనాను, ఆమె సోదరి రెహానాను అరెస్ట్ చేసి అప్పగించాల్సిందిగా ఖోకాన్ భారత్‌ను కోరారు.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.