Srikalahasti Temple : శ్రీకాళహస్తి ఆలయంలో రాహుకేతుల పూజ సరికొత్త రికార్డు… ఒక్కరోజులో కోట్ల ఆదాయం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Srikalahasti Temple : శ్రీకాళహస్తి ఆలయంలో రాహుకేతుల పూజ సరికొత్త రికార్డు… ఒక్కరోజులో కోట్ల ఆదాయం…!

Srikalahasti Temple  : హిందూ పురాణాలలో శ్రీకాళహస్తి ఆలయానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే పంచభూత క్షేత్రాల్లో వాయు క్షేత్రం శ్రీకాళ హస్తీశ్వర క్షేత్రం. లింగానికెదురుగా ఉండే దీపం లింగము నుంచి వచ్చే గాలికి రెపరెపలాడడం ఇక్కడ ప్రత్యేకత. అదేవిధంగా శ్రీకాళహస్తిలో శివుడు రాహుకేతువులు , జ్ఞాన ప్రసూనాంబికలు వెలిసినట్లు భక్తులు భావిస్తారు. అలాగే ఇక్కడ రాహు కేతు దోష నివారణ పూజకు ప్రసిద్ది చెందినది. దీంతో చాలామంది జాతకాలలో రాహు కేతు దోషా నివారణ పూజ […]

 Authored By ramu | The Telugu News | Updated on :7 August 2024,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Srikalahasti Temple : శ్రీకాళహస్తి ఆలయంలో రాహుకేతుల పూజ సరికొత్త రికార్డు... ఒక్కరోజులో కోట్ల ఆదాయం...!

Srikalahasti Temple  : హిందూ పురాణాలలో శ్రీకాళహస్తి ఆలయానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే పంచభూత క్షేత్రాల్లో వాయు క్షేత్రం శ్రీకాళ హస్తీశ్వర క్షేత్రం. లింగానికెదురుగా ఉండే దీపం లింగము నుంచి వచ్చే గాలికి రెపరెపలాడడం ఇక్కడ ప్రత్యేకత. అదేవిధంగా శ్రీకాళహస్తిలో శివుడు రాహుకేతువులు , జ్ఞాన ప్రసూనాంబికలు వెలిసినట్లు భక్తులు భావిస్తారు. అలాగే ఇక్కడ రాహు కేతు దోష నివారణ పూజకు ప్రసిద్ది చెందినది. దీంతో చాలామంది జాతకాలలో రాహు కేతు దోషా నివారణ పూజ కోసం భక్తులు భారీ సంఖ్యలో ఇక్కడికి వస్తారు. తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆషాడం మాసం ఆదివారం అమావాస్య కావడంతో భక్తులు రాహుకేతు పూజలు నిర్వహించేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు భారీ సంఖ్యలో రావడంతో శ్రీకాళహస్తి రికార్డులను బద్దలు కొట్టింది. ఆదివారం అమావాస్య కావడంతో అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయానికి భారీగా తరలివచ్చారని ఆలయ అధికారి ఈ సందర్భంగా తెలియజేశారు.

అయితే ఆదివారం రోజు ఆలయంలో రాహుకేతు పూజల్లో 9,168 మంది భక్తులు పాల్గొన్నారు. అలాగే గత ఏడాది జూన్ 18న 7,597 మంది రాహుకేతు పూజల్లో పాల్గొని రికార్డును సృష్టించారు. అయితే ఇప్పుడు ఆ రికార్డు ని బీట్ చేసి కొత్త రికార్డు సృష్టించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవాలయం ఐకానోగ్రఫీ ద్వారా వచ్చింది. ఇక్కడ 5 తలల పాము ప్రసిద్ధి. దీనిని కేతువు అంటారు. కేతువు శివుని తలపై అలంకరించబడి ఉంటుంది. ఒక తల పాము రాహువు అంటారు. అమ్మవారు నడుమును చుట్టి ఉంటుంది. అలాగే రాహు కేతు పూజలో శివపార్వతులకు పూజ చేసే అత్యంత ఫలితం ఉంటుంది.
జాతకంలో దోషం లేదా ప్రతికూల ప్రభావాలను రాహుకేతుల పూజ ద్వారా తగ్గించగలమని భక్తులు నమ్మకం. రాహుకాలం పవిత్రమైనదిగా భావిస్తారు. దీంతో ఆ సమయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది.

Srikalahasti Temple శ్రీకాళహస్తి ఆలయంలో రాహుకేతుల పూజ సరికొత్త రికార్డు ఒక్కరోజులో కోట్ల ఆదాయం

Srikalahasti Temple : శ్రీకాళహస్తి ఆలయంలో రాహుకేతుల పూజ సరికొత్త రికార్డు… ఒక్కరోజులో కోట్ల ఆదాయం…!

రాహుకేతు పూజల కోసం దాదాపు 5,183 మంది భక్తులు రూ. 500 టిక్కెట్లు కొనుగోలు చేశారు. అలాగే 2,288 మంది భక్తులు రూ. 750 టిక్కెట్ల కొనుగోలు చేశారని దేవస్థాన అధికారులు తెలపడం జరిగింది. అదేవిధంగా రూ 1,500ల టికెట్ ను 933 మంది రూ. 2,500 టికెట్ ధర 610 మంది కొనుగోలు చేశారు. అలాగే 154 మంది భక్తులు రూ. 5,000 టిక్కెట్ల ను కొనుగోలు చేసి రాహు కేతు పూజ చేసినట్లు వెల్లడించారు. రాహుకేతు పూజలతో పాటు శీఘ్ర దర్శనం ప్రత్యేక ప్రవేశం కోసం 8,162 టిక్కెట్ల అమ్మకం జరిగిందని వెల్లడించింది. మరో వైపు ఆదివారం ఒక్క రోజే 29,505 వివిధ ప్రసాదాల ప్యాకెట్ల విక్రయం జరిగింది. దీంతో కాళహస్తి ఆలయానికి ఒక్కరోజులో కోటి రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. ఇక్కడ స్వయం భూలింగముగా వెలసిన శివలింగాన్ని సాలెపురుగు, పాము, ఏనుగు అర్చించడమే కాదు. తమ భక్తీ నిరుపించుకోవడంలో పోటాపోటీగా నిలిచి చివరకు మోక్షాన్ని పొందినట్లు . అప్పటి నుంచి ఇక్కడ ఉన్న స్వామిని కాళహస్తీశ్వరుడు అని పిలుస్తారని పురాణం లో చెప్పబడింది. శ్రీ అనగా సాలెపురుగు, కాళము అనగా పాము, హస్తి అనగా ఏనుగు. అంతేకాదు భక్తిలోని గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిన కన్నప్ప కూడా ఇక్కడ ఉన్న శివయ్యనే పుజించాడని నమ్మకం.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది