
prabhas : దటీజ్ ప్రభాస్.. వయానాడ్ బాధితుల కోసం ఏకంగా రూ.2 కోట్ల విరాళం
prabhas : కేరళలోని వయనాడ్ వరదల కారణంగా ఎంతో మంది నిరాశ్రయులు అయిన విషయం తెలిసిందే. ఆ భీభత్సం దేశాన్ని మొత్తాన్ని కలచివేసింది. కొండ చరియలు విరిగిపడిన ఘటనలో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవటం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరి హృదయాలను ద్రవించేలా చేసింది. జులై 26వ తేదీన వయనాడ్ లో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటనలో ఇప్పటివరకు 335 మందికిపైగా ప్రాణాలను కోల్పోయినట్టు తెలుస్తుండగా, వందలాది మంది ప్రజలు గాయపడ్డారు. ప్రస్తుతం అక్కడ ఇంకా సహాయకచర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
కేరళలో జరిగిన ప్రకృతి ప్రకోపం సృష్టించిన విషాదం ఎన్నో జీవితాలను చిద్రం చేసింది. బురద తొలగిస్తున్నకొద్దీ మృతదేహాలు బయటపడుతున్న హృదయ విదారక పరిస్థితి ఉంది. అయితే కేరళ వయనాడ్ బాధితుల కోసం దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి తమవంతుగా సహాయాన్ని సెలబ్రిటీలు అందిస్తున్నారు. బాధిత కుటుంబాలకు సహాయాన్ని అందించడానికి సినీ ప్రముఖులు ముందు వరుసలో నిలిచారు. ఇప్పటికే కేరళ వయనాడ్ బాధితులకు రష్మిక మందన్న, సూర్య, జ్యోతిక, సహా పలువురు ప్రముఖులు కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి తమ విరాళాన్ని అందించారు. సూర్య, జ్యోతిక, కార్తీ లు కలిసి వయనాడ్ బాధిత కుటుంబాలకి 50 లక్షల రూపాయిల ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు.
prabhas : దటీజ్ ప్రభాస్.. వయానాడ్ బాధితుల కోసం ఏకంగా రూ.2 కోట్ల విరాళం
చిరంజీవి, రాం చరణ్, అల్లు అర్జున్ కూడా తమ వంతుగా సహాయం అందించారు. అల్లు అర్జున్ వయనాడ్ బాధిత కుటుంబాలకు 25 లక్షలు విరాళం ఇవ్వగా, చిరంజీవి, రాం చరణ్ ఇద్దరూ కలిపి కోటి రూపాయలు విరాళం అందించారు.ఇక వీరందరికంటే ప్రభాస్ దాతృత్వం లో తన గొప్ప మనసు చాటుకున్నారు. ప్రభాస్ వయనాడ్ బాధితుల కోసం ఏకంగా 2 కోట్ల రూపాయల భారీ విరాళం అందించారు. ఈ డబ్బును సీఎం సహాయ నిధికి పంపించారు డార్లింగ్ ప్రభాస్. ప్రభాస్ గొప్ప మనసును ప్రభాస్ ఫ్యాన్స్ తెగ మెచ్చుకుంటున్నారు. ప్రభాస్ మంచి మనసుకి ఇంత కన్నా గొప్ప ఉదాహరణ ఏం కావాలని ఫ్యాన్స్ అంటున్నారు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.