Makar Sankranti : మకర సంక్రాంతి నుంచి ఈ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం.. కోటీశ్వరులు అవ్వడం ఖాయం..!
ప్రధానాంశాలు:
Makar Sankranti : మకర సంక్రాంతి నుంచి ఈ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం.. కోటీశ్వరులు అవ్వడం ఖాయం..!
Makar Sankranti : హిందూ సాంప్రదాయాలలో అతిపెద్ద పండుగ అంటే సంక్రాంతి పండుగనే. ఈ పండుగను చిన్నారుల నుంచి పెద్దల వరకు సంతోషంగా జరుపుకుంటారు. ఈ పండుగకి పొలాలలో పండిన పంట ఇంటికి వస్తుంది. పండుగ రోజు కొత్త బియ్యంతో పొంగలి చేసి దేవుడికి నైవేద్యంగా పెడతారు. అయితే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఈ పండుగను వారి ఆచారాల తో జరుపుకుంటారు. అదేవిధంగా కొత్త ఏడాదిలో కొన్ని శక్తివంతమైన గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే గ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడు మకర రాశిలో సంచారం చేయడం వలన మకర సంక్రాంతి అనే పేరు వచ్చింది. ఇక జనవరి 14 వ తేదీన మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడం వలన కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది. అదేవిధంగా వారి కోరికలన్నీ ఈ సమయంలో నెరవేరుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
Makar Sankranti మకర రాశి
మకర సంక్రాంతి సందర్భంగా మకర రాశి జాతకులు వ్యాపారంలో ఊహించిన లాభాలను పొందుతారు. అయితే ఈ లాభాలను పొదుపు చేసుకోవడం మంచిది. ఈ పొదుపు రేపటి భవిష్యత్తు పై ఆధారపడి ఉంటుంది. ఇక మకర రాశి జాతకుల ప్రేమ వ్యవహారాలు పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలు ఎక్కుతాయి. కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తొలగి బంధం బలపడుతుంది. ఇక ఆరోగ్యం బాగుంటుంది.
సింహరాశి : సింహరాశి జాతకులకు మకర సంక్రాంతి నుంచి అద్భుతంగా ఉండబోతుంది. వీరి కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. పెళ్లి కానీ సింహరాశి జాతకులకు వివాహం జరుగుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. వ్యాపారులకు మంచి లాభాలు రావడంతో నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు. అలాగే ప్రేమికులకు అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో రాణిస్తారు.
కర్కాటక రాశి : మకర సంక్రాంతి కారణంగా కర్కాటక రాశి జాతకుల విద్యార్థులకు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి కల ఈ సమయంలో నెరవేరుతుంది. అంతేకాకుండా ప్రేమ జీవితంలో సమస్యలన్నీ తొలగి దాంపత్య జీవితం లోకి అడుగు పెడతారు. అలాగే భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది. ఇక వ్యాపారుల విషయానికొస్తే వ్యాపారాన్ని ఇతర ప్రాంతాలకు విస్తరింపజేస్తారు. దానికి అనుకూలంగా ప్రణాళికను సిద్ధం చేసుకుంటారు.