Surya Shani : 30 ఏళ్ల తర్వాత రవి, శనీశ్వరులు ఈ రాశిలో కలవనున్నారు.. ఈ 4 రాశులకి కుంభవృష్టిగా ధనం…?
ప్రధానాంశాలు:
Surya Shani : 30 ఏళ్ల తర్వాత రవి, శనీశ్వరులు ఈ రాశిలో కలవనున్నారు.. ఈ 4 రాశులకి కుంభవృష్టిగా ధనం...?
Surya Shani : మన హిందూ ధర్మ శాస్త్రంలో జ్యోతిష్య శాస్త్రమునకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ జ్యోతిష్య శాస్త్రంలో రాశులకు మరి ఎంతో ప్రాముఖ్యత ఉంది. నవగ్రహాలలో గ్రహాల కదలికలు మానవులు చేసే తప్పు, ఒప్పుల బట్టి, వారి కర్మ ఫలాలను బట్టి వారి జీవితాలు పై ప్రభావం చూపిస్తుంది. గ్రహాలకు అధిపతి సూర్యుడు. అయితే ఈ సూర్యుడు మరియు శనీశ్వరుడు తండ్రి కొడుకులు. ఈ అరుదైన కలయిక 30 ఏళ్ల తర్వాత వస్తుంది. 30 సంవత్సరాల తర్వాత శనీశ్వరుడు మీన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ తండ్రి కొడుకుల కలయిక అరుదైన కలయిక. అందువలన కొన్ని రాశులకు కుంభవృష్టిగా ధనం ఇవ్వబోతున్నాడు. వీరికి అదృష్టమే అదృష్టం. మరి ఈ సూర్యుడు, శనీశ్వరుల కలయికచేత ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం, సంపదలను తీసుకురాబోతున్న ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం. గ్రహాలన్నీ కూడా వాటి స్థానాన్ని నిర్మిత సమయములో ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి మార్పులు చెందుతూ ఉంటాయి. ఈ విధంగా కదలికలు జరగడం వల్ల గ్రహాలు కొన్ని రాశులతో సంయోగం చెందుతాయి. అయితే ఈ విధంగా ఏర్పడటం ద్వారా కొన్ని రాశుల వారికి యోగాల ప్రభావం ప్రతి ఒక్క రాశిపై పడుతుంది. ఈ విధంగా తండ్రీ కొడుకుల కలయిక చేత ఏర్పడిన ప్రభావం కొన్ని రాశులకు మాత్రం అదృష్ట యోగాన్ని ఇవ్వబోతుంది. కొన్ని రాశులకు మాత్రం దుదృష్టాన్ని కలగజేస్తుంది.

Surya Shani : 30 ఏళ్ల తర్వాత రవి, శనీశ్వరులు ఈ రాశిలో కలవనున్నారు..ఈ 4 రాశులకి కుంభవృష్టిగా ధనం…?
అయితే మరి గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు, కర్మ ఫలాలకు ప్రధాత శనీశ్వరుడు. ఈ ఇద్దరూ 30 ఏళ్ల తర్వాత మీన రాశిలో కలయిక జరుగుతుంది. ఇక్కడ సూర్యుడు కుంభ రాశిలో నుంచి బయటికి వచ్చి మీనరాశిలోకి హోలీ పండుగ రోజున శని భగవానుడునీతో వీరి ఇరువురి కలయిక జరుగుతుంది. 2025 మార్చి 14 శుక్రవారం సాయంకాలం 6:58 గం. సూర్య భగవానుడు మీనరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. శనీశ్వరుడు మార్చి 29 శనివారం రాత్రి సమయంలో 11 గం. మీన రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. అయితే మార్చి 29న సూర్యుడు మరియు శని సంగమం ఏర్పడుతుంది. ఇది ఎన్నో సంవత్సరాలకు ఒకసారి జరిగే తండ్రి కొడుకుల సంయోగం కారణం చేత ఈ నాలుగు రాశుల వారికి ఎంతో అదృష్టం కలగబోతుంది. వీరికి కుంభవృష్టిగా ధనం వచ్చి పడుతుంది. పట్టిందల్లా బంగారమే వీరికి. మరి ఆ అదృష్టవంతులైన రాశులు ఎవరో తెలుసుకుందాం…
Surya Shani వృషభ రాశి :
వృషభ రాశి వారికి సూర్యుడు మరియు శని దేవుడు 11వ స్థానంలో సంయోగం జరుగుతుంది. ఈ రెండు గ్రహాలు అత్యంత శక్తివంతమైన గ్రహాల కలయిక. అయితే,ఈ వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి కుదుటపడుతుంది. ఈ వృషభ రాశి వారికి వ్యాపారాలు మరియు పెట్టుబడులు కలిసి వస్తాయి. ఇంకా లాభాలను కూడా పొందుతారు. ఈ వృషభ రాశి వారి దాంపత్య జీవితం ఎంతో సంతోషకరంగా సాగిపోతుంది. వీరు ఈ సమయంలో జీవితమంతా కూడా సుఖసంతోషాలతో విరాజిల్లుతారు. ఉద్యోగస్తులకు శ్రమకు తగిన గుర్తింపులు కూడా లభిస్తాయి. పోటీ పరీక్షలు రాసే వారికి ఇది అనుకూలమైన సమయం. ఇంకా విదేశాలు వెళ్లాలని అనుకునే వారి కళా నెరవేరబోతుంది.
మిధున రాశి : ఈ మిధున రాశి వారికి కూడా పదో స్థానంలో సూర్యుడు మరియు శనీశ్వరుని యొక్క సంయోగం జరగబోతుంది. ఈ మిధున రాశి వారికి ఎంతో అదృష్టం కలగబోతుంది. ఉద్యోగాలు చేసే వారికి, వారి పై అధికారుల నుంచి మద్దతులను మరియు ప్రశంసలను పొందుతారు. శ్రమకు తగిన ప్రతిఫలం లభించగలదు. ఏ పని చేసినా కూడా అన్నిట్లో కూడా గుర్తింపు పొందగలరు. వీరు ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ఇంకా కుటుంబ సభ్యులతోనూ మరియు స్నేహితులతోనూ చాలా సంతోషంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు ఏ ప్రయత్నాలు చేసినా కూడా అన్ని ఫలిస్తాయి. ఇప్పటివరకు అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పటివరకు ఆగిపోయిన పనులు కూడా పూర్తి చేయగలుగుతారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలలో లాభాలను చూస్తారు.
తులారాశి : ఈ తులా రాశి వారు ఎనిమిదోవ స్థానంలో సూర్యుడు, శని దేవుని యొక్క సంయోగం జరగబోతుంది. ఈ తండ్రి మరియు తనయుల కలయికచేత ఈ రాశి వారికి అనేక ప్రయోజనాలు పొందుతారు. ఈ తులా రాశి వారికి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి, మంచి ఆరోగ్యం కలుగుతుంది. వీరికి ఆర్థిక సమస్యలన్నీ కూడా సమసిపోతాయి. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. ఈ రాశి వారు శుభవార్తలను వింటారు. వ్యాపారాలు చేసే వారికి తమ వ్యాపారాన్ని మరింత విస్తరింప చేయగలుగుతారు. ఎన్నో మార్గాలలో వీరు కుంభవృష్టిగా ధనాన్ని సంపాదించబోతున్నారు.
కుంభరాశి : ఈ కుంభ రాశి వారికి రెండవ స్థానంలో సూర్యుడు మరియు శని భగవానుడు సంయోగం ఏర్పడబోతుంది. అందువలన ఈ రాశి వారికి భారీగా ధనం వచ్చి పడుతుంది. తమ పూర్వీకుల ఆస్తిలో నుంచి కూడా అదనపు ఆదాయాలు పొందుతారు. ఇప్పటివరకు ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా పోయి, వాటి నుంచి ఉపశమనం పొందగలుగుతారు. మీరు ఏ పని చేసినా కూడా అన్నిట్లో విజయాన్ని సాధిస్తారు కుంభ రాశి వారు.