Bigg Boss 5 Telugu : ధైర్యం లేదా? మెమోరీ లేదా?.. రవికి కాజలే కరెక్ట్

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: November 23, 2021, 10:21 am

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ ఇంట్లో కాజల్, రవి ట్రాక్ ఎంతకీ అర్థం కాదు. మొదటి నుంచి కూడా ఈ ఇద్దరూ అంతు చిక్కకుండానే ఉన్నారు. అప్పుడు కలిసిపోతారు.. అప్పుడే మాటల యుద్దాలకు దిగుతారు. గొడవలు పెట్టుకుంటారు.. మళ్లీ దగ్గరైనట్టు అనిపిస్తుంది. నువ్ నా ఫ్రెండ్‌వి కాదు.. నాతో మాట్లాడుకు అని అనుకుంటారు. మళ్లీ కలుస్తారు. అయితే ఈ 12వ వారం నామినేషన్ మాత్రం రచ్చ రచ్చగా మారింది. వీకెండ్‌లో జరిగిన కొన్ని ఇష్యూలు రవికి చుట్టిముట్టేశాయి.

సిరి, షన్నులు బయటే అనుకుని వచ్చారు అని కాజల్‌తో రవి అన్నాడట. అదే అనుమానం వచ్చి.. రవి ఇలా అన్నాడు. ఇది నిజమేనా? అని ప్రశ్న వేసింది కాజల్. దీంతో సిర, షన్నులు కాజల్, రవిలపై అసహనం వ్యక్తం చేశారు. నేను అలా అనలేదు అని రవి అంటాడు. కాజల్ ఏమో నువ్వే అన్నావ్ అందుకే అలా అడిగాను అని అంటుంది. నీకు అడగాలనిపిస్తే నువ్వు అడుగు కానీ.. రవి ఇలా అన్నాడు ఇది నిజమా? అని మధ్యలో నా పేరు ఎందుకు తీసుకొస్తావ్ అని రవి అంటాడు.

Kajal And Ravi Argument In Bigg Boss 5 Telugu

Kajal And Ravi Argument In Bigg Boss 5 Telugu

Bigg Boss 5 Telugu : రవికి కాజల్ కౌంటర్లు..

ముందు నుంచి కూడా రవి ఇంతే. ఏ ఇద్దరి మధ్యో చిచ్చు పెట్టాలని చూస్తాడు. తన గురించి తప్పా మిగతా కంటెస్టెంట్ల గురించే ఎక్కువగా మాట్లాడతాడు. మాట్లాడిన విషయాలే మళ్లీ మాట్లాడలేదు అని అంటాడు. ఇక ఇదే విషయాన్ని కాజల్ అడిగేసింది. నీకు ధైర్యమైనా లేకపోయి ఉండాలి.. మెమోరీ అయినా లేకపోయి ఉండాలి.. నువ్ ధైర్యంగా చెప్పేవాడివి.. లేదంటే గుర్తు లేదని అనేవాడికి కానీ ఆ రెండు అనడం లేదంటూ కాజల్‌ గట్టిగా కౌంటర్లు వేసింది

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Bigg Boss 10 Telugu : ఇదెక్కడి ట్విస్ట్ రా బాబూ.. త్రిగుణ్‌కు షాకిచ్చిన ముకేష్.. ఓటింగ్‌లో కొత్త లెక్కలు !"

  2. "Today Horoscope : 21 నవంబర్ 2026 శ‌నివారం ఈ రోజు మీ రాశి ఫలాలు..ఆ 4 రాశులకు ధనలాభం.. ఊహించని సర్‌ప్రైజ్!"

  3. "China USA Gold : అమెరికాకు చెక్ పెట్టేలా చైనా మాస్టర్ ప్లాన్.. భారీగా బంగారం కొనుగోళ్లు.. అసలు ప్లాన్ ఏంటి..?"

  4. "Rashmika Mandanna : రష్మిక కొత్త లుక్ అదుర్స్.. ‘ఒసేయ్ రాములమ్మ’ పాట లాంచ్‌లో నేషనల్ క్రష్ సందడి!"

  5. "Redmi Turbo 6 Max : రెడ్‌మి నుంచి మరో పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్.. 185Hz డిస్‌ప్లే, భారీ బ్యాటరీ..!"

  6. "OM Movie Review : ధనుష్, మమ్ముట్టి ఓం మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌..!"

  7. "Gold Price Today : బంగారం కొనాలనుకునేవారికి బంపర్ ఛాన్స్.. 10 గ్రాములు రూ.95 వేల కంటే తక్కువే!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp