Tathastu Devatas : తధాస్తు దేవతల గురించి మీకు తెలుసా… అసలు వారెవరు… ఏ సమయాల్లో తిరుగుతారు అంటే…?
ప్రధానాంశాలు:
Tathastu Devatas : తధాస్తు దేవతల గురించి మీకు తెలుసా... అసలు వారెవరు... ఏ సమయాల్లో తిరుగుతారు అంటే...?
Tathastu Devatas : మన పెద్దలు ఇప్పటికీ చెడు మాటలు మాట్లాడితే అలా మాట్లాడకు తధాస్తు దేవతలు ఉంటారు అని హెచ్చరిస్తూ ఉంటారు. అసలు ఈ దేవతలు ఎవరు, ఏమిటి..? దీని గురించి తెలుసుకుందాం వేద శాస్త్రాలలో అనుమతి అనే ఒక దేవత ఉండేది. యజ్ఞయాగాది, సత్కర్మలు ఆచరించేటప్పుడు, ఈ దేవతను నమస్కరిస్తే, వారికి కార్యసిద్ధి లభించే లాగా సహకరిస్తుందని యజ్ఞ ప్రకారణంలో పేర్కొన్నారు. ఆ అనుమతి దేవతలనే సామాన్య భాషలో తధాస్తు దేవతలు అంటారు. వీరు సత్కర్మలు జరిగే పవిత్ర ప్రదేశాల్లో నివాసం ఉంటారు. వీరు విశ్వకర్మ అంశమైన సూర్యుని కుమారులు. అశ్వరూపంలో సూర్యుడు ఛాయాదేవికి జన్మించారు.

Tathastu Devatas : తధాస్తు దేవతల గురించి మీకు తెలుసా… అసలు వారెవరు… ఏ సమయాల్లో తిరుగుతారు అంటే…?
మహాభారతంలో పాండురాజు భార్య మాత్రికి మంత్ర ప్రభావంతో నకుల, సహదేవులుగా జన్మించారు. అంతే కాదు, ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి నుంచి అభ్యసించి ఇంద్రునికి నేర్పించారు. వీరికి సోదరి ఉష, ఈమె ప్రతిరోజు వీరిని బ్రహ్మ ముహూర్తంలో మేలుకొలుపుతుంది. తరువాత వారు తమ సోదరీ ఉషను ముందు కూర్చోబెట్టుకొని వ్రతాన్ని అధిరోహించి తూర్పు నుంచి పడమరకు ప్రయాణిస్తున్నారని పురాణ వర్ణ. ఏం మాట్లాడినా తధాస్తు దేవతలు ఉంటారు జాగ్రత్త అని మనల్ని పెద్దలు హెచ్చరిస్తుంటారు. సాయంత్రం సమయంలో ఈ దేవతలు సంచరిస్తారని అంటుంటారు. రేపు అదే చెడు మాటలు వ్యక్తం చేస్తే అదే జరిగిపోతుందంట. ఆస్తు అనేది స్వవిషయంలోనే వర్తిస్తుంది. ధర్మానికి విరుద్ధంగా ఉచ్చరించకూడని మాటలను పదేపదే అంటే దేవతలు వెంటనే తధాస్తు అనేస్తారు వీటిని తధాస్తు దేవతలు అంటారు.
మంత్రం సమయంలో స్వ విషయాలను పలుమార్లు అంటే ఆ దృశ్యాన్ని చూసిన దేవతలు తధాస్తు అంటూ ఉంటారు. ఉన్న అతను చూడు డబ్బు లేదు లేదు అని పలుమార్లు అంటే నిజంగా లేకుండా పోతుంది. ఆరోగ్యంగా ఉండి అనారోగ్యంతో ఉన్నామని తరచు అంటే నిజంగానే అనారోగ్యం ప్రాప్తిస్తుంది. కాబట్టి స్థితిగతులు గురించి అసత్యాలు, అవాస్తవాలు పలకడం మంచిది కాదు. ఆరోగ్యానికి గురైనప్పుడు ఫలానా వైద్యుణ్ని హస్తవాసి బాగుందని అతని దగ్గరకు వెళ్ళండి అని సలహా ఇస్తారు. విషయాలలోనూ ఇదే వర్తిస్తుంది. ఒకరికి చెడు జరగాలని కోరుకోవడం లేదా మనకు జరుగుతుందేమోనని భయపడటం వల్ల తధాస్తు దేవతలు ప్రభావంతో అవిఫలిస్తాయి. మరికొన్ని దుష్ఫలితాలు చోటు చేసుకోవడంతో ఇక్కట్లు పెరుగుతాయి. పొట్టి మంచి కోరుకుంటే అందరికీ మంచే జరుగుతుంది.