Margashira Masam : మార్గశిర మాసం ప్రారంభమైంది.. ఈ మాసంలో విశిష్ట పండగలు ఏమిటంటే…!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Published on: December 3, 2024, 6:00 am
  •  Margashira Masam : మార్గశిర మాసం ప్రారంభమైంది.. ఈ మాసంలో విశిష్ట పండగలు ఏమిటంటే...!

Margashira Masam : కార్తీక మాసం ముగిసి మార్గశిర మాసంలోకి అడుగు పెట్టాం. ఇక నేటి నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. అయితే పౌర్ణమి రోజున మృగశిర నక్షత్రంలో చంద్రుడు ఉదయించినందు వలన ఈ నెలకు మార్గశిర మాసం అనే పేరు వచ్చింది. హిందూ సంప్రదాయాలలో ఈనెల ఎంతో పవిత్రమైనది. అంతేకాకుండా మోక్ష గ్రంథమైన భగవద్గీతను అవతరించింది ఈ మాసంలోనే. అలాగే హిందువులు తిరుప్పువై చదువుతూ పరమ భక్తితో ధనుర్మాస వ్రతాన్ని ఈ మాసంలో మొదలుపెడతారు. ఇక విష్ణు ప్రీతిక చేసే ఈ మాసంలో కొన్ని పుణ్య కార్యాలు శుభ ఫలితాలను ఇస్తుందని దీనిని మోక్షద ఏకాదశి అంటారు. ఇది ఏకాదశి ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. ప్రతి ఏడాది మార్గశిర మాసంలో శుక్లపక్ష ఏకాదశి మోక్షత ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ నెలలో భక్తితో ఉపవాసం జాగారం వంటివి ఆచరిస్తారు.

మార్గశిరం దక్షిణాయనం చివరి భాగం.. మార్గశిర మాసం తరువాత పుష్య మాసం నుంచి ఉత్తరామాయణం మొదలవుతుంది. ఇక ఈ ఉత్తరామాయణం అంటే దేవతలకు పగటి కాలం. కాబట్టి పండితులు ఈ మార్గశిర మాసంలోని పగలుకు ముందు వచ్చే బ్రహ్మీ ముహూర్తం వంటిది అని చెబుతారు. ఈ మాసంలో బ్రహ్మ ముహూర్తానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అదేవిధంగా మార్గశిర మాసానికి అంతే ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా బ్రహ్మీ ముహూర్తంలో చేసే పూజలకు ఎంతో విశిష్టత ఉంటుంది. అలాగే ఈ మాసం లక్ష్మీనారాయణ స్వరూపం. మార్గశిర మాసంలో విష్ణువుని పూజిస్తారు. ఇకగురు శనివారాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది.

Margashira Masam : మార్గశిర మాసం ప్రారంభమైంది.. ఈ మాసంలో విశిష్ట పండగలు ఏమిటంటే...!

Margashira Masam : మార్గశిర మాసం ప్రారంభమైంది.. ఈ మాసంలో విశిష్ట పండగలు ఏమిటంటే…!

Margashira Masam మార్గశిర మాసంలో పవిత్ర పండగలు…

– మార్గశిర శుద్ధ షష్టి సుబ్రహ్మణ్య స్వామి జన్మదినం ఉంటుంది. ఇక ఈరోజు నా సంతానం కోరుకునే వారు కార్తికేయడిని పూజిస్తారు. అయితే ఆ రోజు పలు దేశాలలో సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో పూజలు ఉత్సవాలు వంటి కార్యక్రమాలు నిర్వహించడం వలన సంతానం కలుగుతుందని విశ్వాసం.

– మార్గ శీర శుద్ధ అష్టమి కాలభైరవుని జన్మదినం. ఈ రోజున శివుడి అవతారమైన కాలభైరవుడు జన్మించి కాశీలో మరణించిన భక్తుల పాపపుణ్యాలను స్వయంగా లెక్క చూస్తాడట. ఇక ఈ రోజున నల్ల కుక్కను కాలభైరస్వరూపం గా భావించి నల్ల కుక్కను పూజించి గారల దండను కుక్క మెడలో వేస్తారు.

– మార్గశిర శుద్ధ ఏకాదశి కురుక్షేత్రంలో శ్రీ భగవద్గీతను లోకానికి ఈ రోజున అందిస్తారు. దీనినే వైకుంఠ ఏకాదశి మోక్ష ఏకాదశి అని అంటారు.

– మార్గశిర శుద్ధ ద్వాదశి మృత్యుత్వాదశ అని కూడా అంటారు. అయితే ఈ రోజున శ్రీమహావిష్ణువు తొలి అవతారమైన మృత్యు అవతారాన్ని పూజిస్తారు.

– మార్గశిర శుద్ధ పూర్ణ శ్రీ దత్త జయంతి దీనిని నకర పూర్ణిమ కోరల పౌర్ణమి అని పిలుస్తారు. ఈ రోజున అగ్నిపురాణం దానం చేయడం మరియు దత్త చరిత్ర పారాయణం చేయడం మంచిది.

– మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. అంతేకాకుండా ఆ రోజున ముత్తైదువులకు భోజనం పెట్టి పసుపు కుంకుమ పువ్వులను తాంబూలంగా ఇవ్వడం వలన వారి ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది.

– ఈ నెలలో విష్ణు ఇష్టమైన ధనుర్మాసం కూడా వస్తుంది. ఈ నెలలో శ్రీమహావిష్ణువు కేశవ అనే నామంతో పూజలను అందుకుంటాడు. The month of Margashira Masam has begun

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp