Categories: DevotionalNews

Mahaabhaaratam : మహాభారతంలో 3 కథలు చాలా ఆసక్తికరమైనవి… దీని గురించి మీకు తెలుసా…?

Mahaabhaaratam : మహాభారతం Mahaabhaaratam అంటే మనకు గుర్తొచ్చేది శ్రీకృష్ణుని లీలలు. మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్పే మంచి మాటలే మహాభారతం. మహాభారతంలో ఎన్నో వేల శ్లోకాలు, పర్వాతో కూడి ఉంటాయి. అయితే, చాలామందికి మహాభారతంలో ఉన్న కథలు ఏంటో తెలుసు, కానీ కొన్ని కథల గురించి మాత్రం ఇప్పటికి తెలియదు. మూడు కథల గురించి ఎక్కడా కూడా చెప్పబడలేదు. ఆంటీ మీకు తెలియని కథ గురించి తెలుసుకుందాం…

Mahaabhaaratam : మహాభారతంలో 3 కథలు చాలా ఆసక్తికరమైనవి… దీని గురించి మీకు తెలుసా…?

Mahaabhaaratam  మహాభారతంలోని మూడు ఆసక్తికరమైన కథలు

నమ్మకం : ఒకసారి కర్ణుడు,దుర్యోధని భార్య భానుమతి, ఆమె మందిరంలో పాచికలు ఆడుతూ ఉంటారు. ఎంతోసేపటి నుంచి ఆట కొనసాగుతూనే ఉంటుంది. ఇక ఆట ముగిసే సమయానికి, చివరి దశకు వచ్చినప్పుడు. భానుమతి ఆ పాచికల ఆట కచ్చితంగా ఓడిపోయే స్థితికి వస్తుంది. ఏ సమయంలో ఆ మందిరంలోకి భానుమతి భర్త దుర్యోధనుడు వస్తాడు. ఆమె భర్త రాకను ఆమె గమనిస్తుంది. కంటే ఆమె ద్వారానికి ఎదురుగా కూర్చొని ఉంటుంది. కర్ణుడి వీపు ద్వారం వైపుకు ఉంటుంది. అయితే, భర్త రాగానే భానుమతి మర్యాదగా పైకి లేవడానికి ప్రయత్నిస్తుంది. దీంతో అది గమనించిన కర్ణుడు,ఆమె ఓడిపోతుంది అని తెలిసి, పారిపోయేందుకు యత్నిస్తుందని అర్థం చేసుకుంటాడు. వెంటనే ఆమె ముఖంపై ఉన్న వస్త్రాన్ని పట్టుకొని ఆపేస్తాడు. దీంతో ఆ వస్త్రానికి అలంకారమై ఉన్న ముత్యాలు తాడు లోంచి తెగి కింద పడతాయి. ఇలా హఠాత్ పరిణామానికి భానుమతి షాక్ అయిపోతుంది. ఆమె ముఖాన్ని క్షుణ్ణంగా గమనించిన కర్ణుడు వెనక్కి తిరిగి చూడగా దుర్యోధనుడు కనిపిస్తాడు. దీంతో వారిద్దరూ ఏం చేయాలో తెలియక ముఖాలు కిందకు దించుకుంటారు. అయితే, దుర్యోధనుడు మాత్రం తాపీగా వచ్చి,ముత్యాలు ఏరాలా, లేదంటే ఏరి దండ గుచ్చాలా, అని అడుగుతాడు.

తప్పని లెక్క : ఇక మహాభారతంలో ఉన్న మనసుకు తెలియని మరొకత ఏమిటంటే, కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు జరుగుతుంది. అందుకుగాను యుద్ధం కోసం పాండవులు కౌరవులు పలు రాజులు మద్దతునిస్తారు. కానీ ఉడిపి అనే రాజ్యానికి చెందిన రాజు మాత్రం ఎవరికీ మద్దతు ఇవ్వడు తటస్థంగా ఉంటాడు. యుద్ధం జరుగుతున్న ప్రాంతం అతని రాజ్యానికి దగ్గరే కావడంతో, పాండవులు, కౌరవులు, సేవకులు, రోజు ఆహారం వండి పెట్టేందుకు ఆ రాజు అంగీకరిస్తాడు. ఈ క్రమంలో అతను తన సైనికుల ద్వారా ఇరుపక్షాల సేనలకు రోజు ఆహారం పంపేవాడు. అయితే,రోజు ఆహారం మిగిలేది కాదు.సరిగ్గా,అందరికి సరిపోయేది. రోజు యుద్ధంలో మరణించే సైనికుల సంఖ్య తగ్గినప్పటికీ,ఆహారం మాత్రం ఏ రోజు కా రోజు అందరికీ సరిపోయేనంత వచ్చేది. ఇందుకు కారణం, ఎవరికీ తెలిసేది కాదు. సరిగ్గా అందరికీ సరిపోయేది. ఆ రాజు ఇంత ఖచ్చితంగా ఆహారాన్ని సరిపోయేలా ఎలా పంపుతున్నాడు అనేది చాలామందికి తెలియదు. అసలు ఇందుకు కారణమేమిటంటే… ఉడుపి రాజరాజు రోజు రాత్రి శ్రీకృష్ణుని గుడారానికి వెళ్లేవాడు.ఆ సమయంలో కృష్ణుడు ఉడకబెట్టిన వేరుశనగలు తినేవాడు.అయితే, వాటికి ఉడుపి రాజు పొట్టు తీసి కృష్ణునికి గింజలు ఇచ్చేవాడు. ఈ క్రమంలో కృష్ణుడు వేరుశనగల కాయలు తిని వెళ్లిపోగానే, ఆ రాజు కృష్ణుడు ఎన్ని గింజలు తిన్నాడో వాటి పొట్టును లెక్కపెట్టేవాడు. ఉదాహరణకు 10వేరుశనగ కాయలు తింటే, మరుసటి రోజు 10,000 మంది చనిపోతారు, అని తెలుసుకొని పదివేల మందికి తక్కువగా వండేవాడు. దీంతో ఏ రోజు వండిన ఆహారం, ఆ రోజు అందరికీ సరిపోయేది.

లోక కళ్యాణం : మహాభారతంలో ఉన్న మరొక ఆసక్తికరమైన కథ ఏమిటంటే… భీష్ముడి తండ్రి శంతనుడు మొదట గంగాదేవిని వివాహం చేసుకుంటాడు. అయితే గంగా వివాహానికి ముందు శంతనుడికి ఓ షరతును విధిస్తుంది. తనను ఎట్టి పరిస్థితుల్లో, ఏ విషయంలో ప్రశ్నలు అడగకూడదని అంటాడు. అందుకు శాంతనుడు ఒప్పుకుంటాడు.తరువాత, వారి వివాహం జరుగుతుంది.ఈ క్రమంలో ఆమెకు 7 మంది కుమారులు జన్మిస్తారు. అయితే, కుమారుడు పుట్టినప్పుడల్లా గంగా, తమకుమారుని తీసుకొని వెళ్లి నీటిలోకి విసిరేసి వస్తుంది. అయితే, శతనుడు అది చూసి కూడా ప్రశ్నించ లేక పోతాడు. ఎందుకంటే ముందే గంగ షరతు విధించింది కదా. అలా ఆమె 7 మందిని నదిలో విసిరేశాక ఎనిమిదవ కుమారున్ని కూడా అలాగే విసరడానికి వెళుతుంది. దీంతో శంతనుడు ఏదైతే,అది అవుతుందని భావించి, ఎందుకిలా పుట్టిన వారిని పుట్టినట్లుగా విసిరి పడేస్తున్నావు అని గంగను అడుగుతాడు. ఇందుకు ఆమె స్పందిస్తూ నువ్వు మాట తప్పవు రాజా, నన్ను ప్రశ్నలు అడగవద్దని చెప్పా కదా.. అయినా,నువ్వు అడిగావు కనుక.నీ వద్ద,ఇక నేను ఉండను, వెళ్ళిపోతా. అయితే,నేను ఎందుకు ఇలా సంతానాన్ని నీటిలోకి వేశాను అందుకు కారణం మాత్రం చెబుతా. 8 మంది శిశువులకు వశిష్ట మహర్షి శాపం పెట్టాడు. మనుషుల్లాగా పుట్టమని,అందుకని వారు అడిగితే వారికి తల్లిగా వచ్చా. వారికి జన్మనిచ్చా,అందులో భాగంగానే.. వారిని నదిలో వేశ. ఇక వారికి శాప విముక్తి కలిగింది. ఇందుకు నీకు చాలా పుణ్యం దక్కింది. అయితే, 8 కుమారున్ని మాత్రం నేను నదిలో వేయను. నా దగ్గరే పెంచుతా,యుక్త వయసుకు వచ్చాక నీకు అప్పగిస్తా. అని గంగా అంతర్దనామవుతుంది. తరువాత ఆ కుమారుడికి యుక్త వయసు రాగానే శంతనడు అప్పగిస్తుంది. అతనే భీష్ముడు.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

2 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

2 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

2 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

2 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

2 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

3 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

3 weeks ago