Zodiac Signs : 178 ఏళ్ల తర్వాత అరుదైన సూర్యగ్రహణం.. ఈ ఐదు రాశుల వారికి ఊహించని అదృష్టం..!
Zodiac Signs : ఈ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 20న సంభవించింది. ఇప్పుడు ఈ సంవత్సరంలో రెండవది మరియు చివరిది అక్టోబర్ 14న ఆకాశంలో అలంకరించేందుకు సిద్ధంగా ఉంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ సూర్యగ్రహణం 178 సంవత్సరాల తర్వాత వచ్చే అరుదైన, అనుకూలమైన సూర్యగ్రహణం. శనివారం నాడు వచ్చినా అమావాస్య కారణంగా శని అమావాస్య అంటారు. ఆరోజు సూర్యగ్రహణం ఏర్పడనుంది. అంతేకాదు ఆరోజు పితృ అమావాస్య కూడా. ఈరోజు పితృదేవతలకు చేసే కర్మలు, పూజలు, ప్రార్థనలు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. దీంతో ఈ గ్రహణం అసాధారణమైనదిగా మారుతుంది. గ్రహణం సమయంలో సూర్యుడు అధిపతి అయిన బుధుడు కన్యా రాశిలో ఉంటారు. దీనిని బుధాధిత్యయోగంగా భావిస్తారు. ఈ యోగం అసాధారణమైనది.
ఇలా చివరిసారిగా 1945లో చోటుచేసుకుంది. దాదాపుగా 178 సంవత్సరాల విరామం తర్వాత సంభవించే ఓ ప్రత్యేక కలయికలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే వేద శాస్త్రంలో బుధుడు తెలివితేటలకు కమ్యూనికేషన్స్ తో సంబంధం కలిగి ఉంటాడు. గ్రహాల అధినేత సూర్యుడు శక్తి, నాయకత్వం, కాంతిని కలిగి ఉంటాడు. ఈ రెండు గ్రహాల కలయికతో గురు ఆదిత్య యోగం ఏర్పడనుంది ఈ యోగం వలన ఐదు రాశుల వారికి జీవితంలో అదృష్టం కలిసి వచ్చి పట్టిందల్లా బంగారమే అవుతుందిష మిధున రాశిలో జన్మించిన వారికి ఈ సూర్యగ్రహణం అదృష్టాన్ని తీసుకొస్తుంది. జీవితంలో మంచి అవకాశాలను అందుకుంటారు. ఆర్థిక లాభాలు పొందుతారు సుఖ సంతోషాలతో జీవిస్తారు.
సింహరాశి వ్యక్తులు అక్టోబర్ 14న ఏర్పడనున్న సూర్యగ్రహణంతో మంచి ప్రయోజనాలను పొందుతారు. వ్యాపారంలో కలిసి వస్తుంది. ఆర్థికంగా మంచి పెరుగుదల ఉంటుంది. శత్రువుల పై విజయాన్ని సాధిస్తారు. కుటుంబంతో ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. సామాజిక గుర్తింపు లభిస్తుంది. అలాగే వృశ్చిక రాశి వారికి కూడా ఈ సూర్యగ్రహణం వలన మంచి జరగబోతుంది. కుటుంబ సహకారంతో ఆర్థిక లాభాలను పొందుతారు. ఆదాయంలో పెరుగుదల ఉంది మహిళలకు అదృష్టం కలిసి వస్తోంది . కన్య రాశి వారికి కూడా ఈ సూర్యగ్రహణం వలన అదృష్టం కలిసి రాబోతుంది చేసే పనులు విజయాలు లభిస్తాయి ఆర్థిక శుభవార్తలు వింటారు అలాగే మీన రాశి వారికి కూడా ఈ సూర్యగ్రహణం అన్ని విధాలా కలిసి వస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.