Maha Shivratri : ఆ రోజే మహాశివరాత్రి శుభ ఘడియలు, పూజ విధానం, పూజ సమయాలు ఇవే…!!
Maha Shivratri : మహాశివరాత్రి అంటే ఫిబ్రవరి నెలలో నే వస్తుంది. ఈ మహాశివరాత్రి సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది. ఆ ఒకసారి జరుపుకునే పండుగని ఎంతో ప్రీతికరంగా జరుపుకుంటూ ఉంటారు. ఆ అపురూప ఘట్టాన్ని మహాశివరాత్రి అని చెప్తూ ఉంటారు. ఆరోజున శివుడు శక్తి కలయిక జరిగే రాత్రిగా అందరూ నమ్ముతూ ఉంటారు. ఆ తదుపరి అనంత విశ్వానికి ప్రతిరూపంగా ఉండే పరమేశ్వరుడు అనంతంలోని శక్తిగా అనుకునే పార్వతి కలయిక జరిగే రాత్రి కావున దానిని మహా శివరాత్రి అని పిలుస్తూ ఉంటారు. శివుడు ఆరోజు లింగాకారంలో ఉంటాడని శివపురాణాలు పేర్కొన్నాయి. హిందువులకు మహాశివరాత్రి ఎంతో ప్రత్యేకమైన పండుగ ఆనాడు శివుడు పార్వతి వివాహం చేసుకొని పార్వతి
పరమేశ్వరులుగా అవతరించారని పురాణాలలో రాశారు. పురుషుడు అంటే సంస్కృతంలో మనస్సు, ఆత్మ అని అర్థం స్త్రీ ని ప్రకృతిగా పిలుస్తుంటారు. శివుడు పురుషుడైతే పార్వతి ప్రకృతి స్వరూపం వీరి కలయిక ప్రకృతిలో జీవం వస్తుంది. ఈ విధంగా మహాశివరాత్రి సృష్టి కారకంగా జరుపుకుంటారు. చీకటిని అధిగమించి జ్ఞానాన్ని ఉదయంగా ఈ రాత్రి చెప్పవచ్చు. కావున మహాశివరాత్రికి అంత గొప్ప ప్రత్యేకత ఉన్నది. ఇంకా తెలియజేయాలంటే ప్రతి ఏడాది శీతాకాలంలో ముగిసిపోయే నెలలో వసంత రుసుము ప్రారంభంలో మహా శివరాత్రి వస్తుంది. అలాగే ఫిబ్రవరి లేదా మార్చిలో ఈ పండగ వస్తుంది. అలాగే ఈ సంవత్సరం 2023 మహాశివరాత్రి 18 ఫిబ్రవరి తేదీన శనివారం నాడు జరుపుకుంటారు. చతుర్దశి తేదీ ఫిబ్రవరి 18 2023 నా రాత్రి 8 గంటల రెండు నిమిషాలకు ప్రారంభమవుతుంది.
ఫిబ్రవరి 19 2023న సాయంత్రం నాలుగు గంటల 18 నిమిషములకు ముగుస్తుంది. శివరాత్రి ప్రారంభ ప్రహర పూజ సాయంత్రం 63 నిమిషాల నుండి 9 గంటల 20 నిమిషాల వరకు ఉంటుంది. ఈ మహాశివరాత్రి నాడు శివుని భక్తులందరూ రోజంతా ఉపవాసం ఉంటూ ఉంటారు. శివాలయాలను దర్శించుకుంటూ శివపార్వతులకు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ఆరాధనలు చేస్తూ ఉంటారు. ఆనాడు రాత్రి భక్తులందరూ జాగరణ చేస్తూ శివ స్మరణతో శివుడి భజన చేస్తూ అందరూ రాత్రి అంతా జాగరణతో ఆయన్ని స్మరిస్తూ ఆయన జపమే చేస్తూ ఉంటారు.. శివుడు అందుకే భక్తులు కోరిన కోర్కెలను తీరుస్తాడు.. మహాశివరాత్రి నాడు పరమశివుడు అనుకున్న కోరికలు నెరవేర్చడమే కాకుండా భక్తులకు ఆయన ఆశీర్వాదాలను అందిస్తాడు.