Home » Devotional » These Three Things Should Never Be Taken From Birth
Devotional

పుట్టింటి నుండి ఈ మూడు వస్తువులు అస్సలు తెచ్చుకోకూడదు…!

Authored By
aruna
The Telugu News | Published on: October 7, 2023, 11:00 am
Advertisement

ఆడపిల్ల పుట్టింటికి వెళ్ళింది అంటే చాలు.. ఏదో ఒక వస్తువుని తల్లి దగ్గర నుంచి తెచ్చుకుంటూ ఉంటుంది. ఎంతో ప్రేమగా తల్లిదండ్రులు కూడా కూతురికి కావాల్సిన వస్తువులు సమకూరుస్తూ ఉంటారు. అయితే పుట్టింటి నుంచి ఏం తెచ్చుకున్న తెచ్చుకోకపోయినా కొన్ని ముఖ్యమైన వస్తువులు మాత్రం అసలు తెచ్చుకోకూడదు.. మీకు మీ అత్తారింటికి నష్టం వాటిల్లుతుందని మీకు తెలుసా? పుట్టింటి నుంచి తీసుకువెళ్లకూడని ఆ వస్తువులు ఏమిటో తెలుసుకుందాం.. సహజంగా అందరు ఆడవారు పుట్టింటి నుంచి బంగారం, వెండి ఇంటిని అలంకరించుకునే సామాను కిరాణా సరుకులు ఆశ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా కామదేకం ఎక్కువగా ఉంటుంది. పుట్టింటి నుంచి తీసుకువెళ్లే ఆ వస్తువుల మీద అది చిన్నదైనా పెద్దదైన ఆడవారికి ఎంతో అభిమానం ప్రేమ ఉంటాయి. మా అమ్మ ఇది నా కోసమే పంపించింది. నేను వెళ్లేసరికి నా కోసం దీన్ని దాచి ఉంచింది అని ఎంతో ప్రేమగా హుందాగా చెప్పుకుంటూ ఉంటారు.

Advertisement

అయితే పుట్టింటి నుంచి అత్తవారింటికి కొన్ని వస్తువులు పంపించేటప్పుడు తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు తప్పులు చేస్తూ ఉంటారు. చాలామంది కి వీటి వల్ల చాలా నష్టాలు అశుభాలు జరుగుతాయి. అయితే పెళ్లి అయిన తర్వాత ఆడపిల్లలు అత్తవారింటికి తీసుకు వెళ్ళకూడని వస్తువులు ఏమిటో చూద్దాం. చాలామంది అమ్మవారు ఇంట్లో పూజ సామాగ్రి కొత్తగా అందంగా ఖరీదైనంగా కనిపిస్తే వాటిని వారి వెంట తీసుకువెళ్లిపోవాలి అనుకుంటారు. అయితే పూజా సామాగ్రి ఎంత అందంగా ఎంత ఖరీదైనదిగా ఉన్నా ఒకసారి పూజ గదిలో ఉపయోగించిన పూజా సామాగ్రి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకు వెళ్ళకూడదు. ఒకవేళ కొత్తది కొనిపెట్టి ఇప్పటివరకు ఉపయోగించకపోతే మాత్రమే ఆడపిల్లలు ఆ పూజ సామాగ్రిని తీసుకు వెళ్ళవచ్చు. ఇక అలాగే ఉప్పును లక్ష్మీదేవికి స్వరూపంగా భావిస్తారు. అందువల్ల ఉప్పుని పుట్టింటి నుంచి అత్తవారింటికి ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకు వెళ్ళకూడదు. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి.

These three things should never be taken from birth

Advertisement

చింతపండు, కుంకుడుకాయ, కొబ్బరికాయ వంటకు ఉపయోగించే నూనెలు ఇటువంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ పుట్టింటి నుంచి అత్తగారింటికి తీసుకు వెళ్ళకూడదు. ఒకవేళ ఇవి మీ పుట్టిఇంట్లో పండుతున్నాయి అంటే వాటిని ఎంతో కొంత డబ్బు ఇచ్చి వాటిని కొనుక్కొని అత్తింటికి తీసుకువెళ్లాలి. ఎందుకంటే కుంకుడుకాయ అలాగే చింతపండు ఆశుభాకానికి ఉపయోగిస్తారు. కాబట్టి వీటిని పరిస్థితులు తీసుకెళ్లకూడదు. ఇక ఇంట్లో ఉపయోగించిన కత్తులు, కత్తెర్లు కూరగాయలు పుట్టింటి నుంచి అత్తవారింటికి తీసుకు వెళ్ళకూడదు.

ముఖ్యంగా కూరల్లో కాకరకాయ, మెంతికూర, మెంతులు ఇటువంటివి అస్సలు పుట్టింటి నుంచి అత్తవారింటికి తీసుకు వెళ్ళకూడదు. పుట్టింటి నుంచి చీపుర్లు, చాటలు ఇల్లు శుభ్రపరిచే వస్తువులు ఏవి కూడా అత్తింటికి తీసుకు వెళ్ళకూడదు. కాబట్టి వీటిని అత్తగారి ఇంటి నుంచి అమ్మవారి ఇంటికి తీసుకు వెళ్ళకూడదు. కాబట్టి తల్లిదండ్రులు ఆడపిల్లకి ఏ వస్తువులు ఇస్తే సంతోషంగా ఉంటారో.. ఏ వస్తువులు ఇవ్వాలో ఏ వస్తువులు ఇవ్వకూడదో తెలుసుకొని ఆ ప్రకారం నడుచుకోవాలి. తద్వారా అందరూ సంతోషంగా శుభంగా ఉంటారు..

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి