Bigg Boss Telugu 7 : అది లెక్క.. మాటలు మాట్లాడటం కాదు. చేతల్లో చేసి చూపిస్తా అని అనడం కాదు.. చేసి చూపించాడు ప్రశాంత్. అతడి సత్తాను ముందు చూసింది శివాజీనే. అందుకే శివాజీ ఫస్ట్ నుంచి ప్రశాంత్ కు మద్దతు ఇస్తూనే వస్తున్నాడు. తాజాగా తన లెటర్ ను కూడా త్యాగం చేసి ఫస్ట్ కెప్టెన్ కంటెండర్ నుంచి తప్పుకున్నాడు శివాజీ. ప్రశాంత్ కు చాన్స్ ఇచ్చాడు. ప్రశాంత్ కోసం త్యాగం చేసినా ప్రశాంత్ ఆ చాన్స్ ను అస్సలు మిస్ చేసుకోలేదు. టాస్క్ లో తన సత్తా చాటాడు. మొదటి కెప్టెన్ అయి స్టార్ మా బ్యాచ్ కు షాకిచ్చాడు. ముఖ్యంగా అమర్ దీప్ అయితే.. ప్రశాంత్ మొదటి కెప్టెన్ అవ్వడాన్ని అస్సలు తట్టుకోలేకపోయాడు. అమర్ దీప్, సందీప్, శోభా శెట్టి, ప్రియాంక జైన్ అయితే అస్సలు తట్టుకోలేకపోయారు. వాళ్లకు ఏం చేయాలో అర్థం కాలేదు.
టీషర్ట్స్ మీద కలర్స్ కొట్టుకోవాలని.. బర్జర్ మోగే లోపు ఎవరి టీషర్ట్ మీద తక్కువ రంగులు ఉంటాయో వాళ్లే ఈ టాస్క్ లో విన్ అయినట్టు అని ప్రియాంకను సంచాలక్ గా నియమిస్తాడు బిగ్ బాస్. ఫస్ట్ రౌండ్ లోనే తేజ అవుట్ అయితాడు. ఆ తర్వాత రెండో రౌండ్ లో మాస్టర్ బయటికి వెళ్లిపోతాడు. ఇక మూడో రౌండ్ లో ప్రశాంత్, గౌతమ్ ఇద్దరూ చాలా టఫ్ ఫైట్ ఇస్తారు. ఇద్దరూ ఏమాత్రం తగ్గరు. ప్రశాంత్ అయితే చిరుతలా దూకుతాడు. చిరుతలా గౌతమ్ మీద దూకి ఎక్కడికక్కడ కట్టడి చేస్తాడు. బర్జర్ మోగే వరకు తనలో ఉన్న కసిని ప్రతి ఒక్క ప్రేక్షకుడు చూస్తాడు. ఆ కసితోనే శివాజీ మాట నిలబెడతాడు ప్రశాంత్. చివరకు మొదటి కెప్టెన్ అని చరిత్ర సృష్టిస్తాడు.
ప్రశాంత్ ఆట ఆడటం చూస్తుంటే ఖచ్చితంగా టాప్ 5 లో ఉంటాడు అనిపిస్తోంది. శివాజీ మద్దతుతో ప్రశాంత్ చాలా బాగా ఆడుతున్నాడు. ప్రేక్షకుల మనసు కూడా గెలుచుకుంటున్నాడు. ప్రస్తుతం హౌస్ లో ఉన్న పరిస్థితి చూస్తుంటే టాప్ 5 లో శివాజీ, యావర్, ప్రశాంత్, గౌతమ్ ఖచ్చితంగా ఉంటారనిపిస్తోంది. ఇక.. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో క్లారిటీ రావడం లేదు. చాలామంది అమర్ దీప్ అంటున్నారు. మరికొందరు తేజ, ప్రియాంకలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు అంటున్నారు. చూద్దాం మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో?
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.