Dreams : కలలో తెల్లని జంతువులు కనిపిస్తే ఏం జరుగుతుంది… స్వప్న శాస్త్రం ఏం చెబుతుందంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Dreams : కలలో తెల్లని జంతువులు కనిపిస్తే ఏం జరుగుతుంది… స్వప్న శాస్త్రం ఏం చెబుతుందంటే..!

Dreams : రాత్రి నిద్ర పోయినప్పుడు రకరకాల కలలు రావడం సహజం. అయితే కలలు మనసులోని అనుభవాలు ఆలోచనలు భావోద్వేగాలకు ప్రతిబింబాలుగా భావిస్తారు. ఇక కొన్ని కలలు భయాన్ని కలిగిస్తాయి. మరికొన్ని కలలు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. ఇక స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని కలలు మన భవిష్యత్ గురించి సూచనలు ఇస్తాయని చెప్పబడింది. అయితే తెల్లవారుజామున వచ్చే కలలకు నిజమవుతాయని చాలామంది నమ్ముతారు. భారతీయ శాస్త్రంలో ఒక ప్రాచీన శాస్త్రం స్వప్న శాస్త్రంగా పిలవబడింది. ఇది […]

 Authored By ramu | The Telugu News | Updated on :9 November 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Dreams : కలలో తెల్లని జంతువులు కనిపిస్తే ఏం జరుగుతుంది... స్వప్న శాస్త్రం ఏం చెబుతుందంటే..!

Dreams : రాత్రి నిద్ర పోయినప్పుడు రకరకాల కలలు రావడం సహజం. అయితే కలలు మనసులోని అనుభవాలు ఆలోచనలు భావోద్వేగాలకు ప్రతిబింబాలుగా భావిస్తారు. ఇక కొన్ని కలలు భయాన్ని కలిగిస్తాయి. మరికొన్ని కలలు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. ఇక స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని కలలు మన భవిష్యత్ గురించి సూచనలు ఇస్తాయని చెప్పబడింది. అయితే తెల్లవారుజామున వచ్చే కలలకు నిజమవుతాయని చాలామంది నమ్ముతారు. భారతీయ శాస్త్రంలో ఒక ప్రాచీన శాస్త్రం స్వప్న శాస్త్రంగా పిలవబడింది. ఇది కలల యొక్క అర్ధాన్ని తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలోనే కొంతమందికి కలలో జంతువులు కనిపిస్తాయి. అందులో తెల్లని జంతువులు కనిపిస్తే వాటికి కొన్ని అర్థాలు ఉంటాయి. మరి కలలో తెల్లని జంతువులు కనిపించడం వెనుకున్న అర్థం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

Dreams : తెల్ల పాము

శ్వేత వర్ణ సర్పం కలలో కనిపిస్తే మీకు అదృష్టం పట్టబోతుందని అర్థం. అలాగే శివుని అనుగ్రహం మీ సొంతం అవుతుంది. ఇక కలల శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే పాము కనిపిస్తే గతంలో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. అలాగే శ్వేత సర్పం జ్ఞానం పునర్జన్మ ఆధ్యాత్మిక మార్పు మరియు అభివృద్ధిని సూచిస్తుంది.

Dreams : తెల్ల గుర్రం

కలలో తెల్ల గుర్రం కనిపించినట్లయితే అది మీ విజయానికి చిహ్నం. ఇది మీ జీవితంలో అభివృద్ధి విజయవంతమైన కెరియర్ సానుకూల మార్పులను సూచిస్తుంది.

తెల్ల కుక్క : స్వప్న శాస్త్రం ప్రకారం కలలో తెల్ల కుక్క కనిపిస్తే అది నమ్మకం స్నేహం రక్షణకు సూచిక అని అర్థం.

తెల్ల సింహం : కలలో తెల్ల సింహం కనిపించినట్లయితే త్వరలోనే మీరు కెరియర్ లో సక్సెస్ అవుతున్నారు అని అర్థం. వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. అలాగే కుటుంబ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది.

తెల్ల కుందేలు : స్వప్న శాస్త్ర ప్రకారం కలలో తెల్ల కుందేలు కనిపిస్తే అది మీ కుటుంబ శ్రేయస్సుకు మరియు నూతన ప్రారంభాలకు అదృష్టం సూచించడంతో పాటు ఆర్థికంగా లాభాలను పొందుతారని అర్థం.

Dreams కలలో తెల్లని జంతువులు కనిపిస్తే ఏం జరుగుతుంది స్వప్న శాస్త్రం ఏం చెబుతుందంటే

Dreams : కలలో తెల్లని జంతువులు కనిపిస్తే ఏం జరుగుతుంది… స్వప్న శాస్త్రం ఏం చెబుతుందంటే..!

తెల్ల ఏనుగు : ఎవరి కలలోనైనా తెల్ల ఏనుగు కనిపించినట్లయితే వారికి రాజయోగం పట్టబోతుందని అర్థం. పురాణాల ప్రకారం తెల్ల ఏనుగుని ఐరావతంగా భావిస్తారు. అంతేకాదు దేవేంద్రుడి వాహనంగా తెల్ల ఏనుగుగా పరిగణించబడుతుంది. మరి అంతటి శక్తి వంతమైన తెల్లటి ఏనుగు కలలో కనిపిస్తే బలం స్థిరత్వం శక్తి ఆర్థిక లాభాలను సూచిస్తుంది.

తెల్లని నెమలి : తెల్లని నెమలి చాలా అరుదుగా కనిపిస్తుంది. మరి ఈ నెమలి కలలో కనిపిస్తే వారికి అదృష్టం సొంతమవుతుందని అర్థం.

తెల్ల శివలింగం : స్వప్న శాస్త్రం ప్రకారం తెల్లని శివలింగం కలలో కనిపించినట్లయితే శివుని అనుగ్రహం మీపై ఉంటుందని అర్థం. అయితే శివుడు లయకారుడు విజయానికి జ్ఞానానికి అధిపతి. కాబట్టి తెల్లని శివలింగం కలలో కనిపిస్తే త్వరలో మీరు విజయం సాధించబోతున్నారని అర్థం.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది