Dhana Trayodasi : దీపావళికి ముందే ధన త్రయోదశి…ఈ రాశి వారికి అష్టైశ్వర్యాలు ప్రకటించిన లక్ష్మీదేవి…!
ప్రధానాంశాలు:
Dhana Trayodasi : దీపావళికి ముందే ధన త్రయోదశి...ఈ రాశి వారికి అష్టైశ్వర్యాలు ప్రకటించిన లక్ష్మీదేవి...!
Dhana Trayodasi : ఈనెల 29వ తేదీ ధన త్రయోదశి వచ్చింది. అలాగే ఆ తర్వాత రోజు దీపావళి పండుగ వచ్చింది. ఈరోజు ప్రతి ఒక్కరూ వారి యొక్క కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి పండుగ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. ఇల్లంత దీపాలతో అలంకరించి బాణాసంచ కాలుస్తూూ ఆహ్లాదిస్తారు. ఇక ఇదే రోజున తరతరాలుగా సాంప్రదాయంగా లక్ష్మీదేవిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ఇక ఈ దీపావళికి ఒక రోజు ముందు ధన త్రయోదశి వచ్చింది. ఈ ధన త్రయోదశి రోజు బంగారాన్ని ఎక్కువగా విక్రయించడం లేదా కొనుగోలు చేయడం వంటివి చేస్తూ ఉంటారు. అంతేకాక ఈ సమయంలో కుబేరుని ఎక్కువగా ఆరాధించడం మంచిది. అందుకే హిందూశాస్త్రంలో దీపావళికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ధన త్రయోదశికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఈ ధన త్రయోదశి రోజు కొన్ని యోగాలు కూడా ఏర్పడనున్నాయి. దీంతో కొన్ని రాశుల వారికి అధిక లాభాలు వచ్చి పడతాయి. కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
Dhana Trayodasi మేషరాశి
ధన త్రయోదశి కారణంగా మేష రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు చేసేవారికి అధిక లాభాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరంగా గడుపుతారు. డబ్బు దినాభివృద్ధి చెందుతుంది. ఈ సమయంలో వీరి జీవిత భాగస్వామి సలహాలు సంప్రదించి తీసుకోవడం చాలా మంచిది. ఆర్థికంగా బలపడతారు.
Dhana Trayodasi మకర రాశి
ధన త్రయోదశి తో మకర రాశి వారికి దరిద్రం నశిస్తుంది. అన్ని పనుల్లో అదృష్టం కలిసి వస్తుంది. అనుకున్న పనులన్నీ సజావుగా పూర్తి చేస్తారు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగ వ్యాపార మరియు వృత్తి రంగాలలో ఉన్న వారికి కలిసి వస్తుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.
Dhana Trayodasi సింహరాశి
ఈ సమయంలో వీరికి అదృష్టం పడుతుందని చెప్పవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్దాలు తొలగి మనశాంతి లభిస్తుంది. దాంపత్య జీవితం మెరుగుపడుతుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. విద్యార్థులు ఈ సమయంలో అనుకున్నవన్నీ సాధించగలుగుతారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఇది శుభ సమయం.