Makara Jyothi : మ‌క‌ర జ్యోతి వెనుక ఉన్న అస‌లు ర‌హ‌స్యం ఇదే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Makara Jyothi : మ‌క‌ర జ్యోతి వెనుక ఉన్న అస‌లు ర‌హ‌స్యం ఇదే..!

Makara Jyothi : శబరిమల అనే పేరు విన్న వెంటనే మనకు ముందుగా గుర్తొచ్చేది మకరజ్యోతి. అయితే మకర సంక్రాంతి రోజున మకర జ్యోతిని చూసేందుకు లక్షలాదిమంది భక్తులు అయ్యప్ప దీక్ష చేసి మకర జ్యోతిని దర్శించుకోవడానికి వస్తారు. ఈ మకర జ్యోతిని అయ్యప్ప స్వరూపమని భక్తుల ప్రగాఢ నమ్మకం. అయితే మకర జ్యోతి గురించి చాలామందికి విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి . కొందరు దీనిని విస్మయం అని అంటారు, మరికొందరు మోసం అని అంటారు. అయితే […]

 Authored By prabhas | The Telugu News | Updated on :27 December 2022,10:40 am

Makara Jyothi : శబరిమల అనే పేరు విన్న వెంటనే మనకు ముందుగా గుర్తొచ్చేది మకరజ్యోతి. అయితే మకర సంక్రాంతి రోజున మకర జ్యోతిని చూసేందుకు లక్షలాదిమంది భక్తులు అయ్యప్ప దీక్ష చేసి మకర జ్యోతిని దర్శించుకోవడానికి వస్తారు. ఈ మకర జ్యోతిని అయ్యప్ప స్వరూపమని భక్తుల ప్రగాఢ నమ్మకం. అయితే మకర జ్యోతి గురించి చాలామందికి విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి . కొందరు దీనిని విస్మయం అని అంటారు, మరికొందరు మోసం అని అంటారు. అయితే 1999 మరియు 2010లో ఈ జ్యోతి దర్శనం చేసుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు రావడంతో అక్కడ జరిగిన తొక్కేసిలాటలో చాలామంది మరణించారు.మరికొందరు గాయపడ్డారు.

ఇంకా ఇలా జరిగిన తర్వాత మకర జ్యోతి అనేది కొందరు స్వార్థం కోసం సృష్టించిన మూఢనమ్మకమని వాదించడం మొదలుపెట్టారు. దాంతో మకర జ్యోతి విషయంపై చాలా వివాదాలు జరిగి ఆ వివాదాలు కోర్టు వరకు దారి తీసాయి.దాంతో కేరళ హైకోర్టు ఈ వివాదాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి కోర్టుకు సబ్మిట్ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.దీంతో పోలీసులు ఆలయ సిబ్బంది వద్ద వివరాలను తీసుకుని సబ్మిట్ చేశారు . అయితే అందులో ఏముందంటే దేవాలయం పూర్వ దిక్కున ఉన్న కొండపై కొంతమంది గిరిజనులు ఈ పండుగను జరుపుకుంటారు. పురాణాల ఆధారంగా చూస్తే అయ్యప్ప స్వామి మహిషాన్ని చంపి ఆ గిరిజనులను కాపాడినందుకుగాను

This is the real secret behind Makara Jyoti

This is the real secret behind Makara Jyoti

ఆ కొండపైన పెద్దదైన ఒక జ్యోతిని రాత్రిపూట వెలిగిస్తారని ఇక జ్యోతిని చూసిన వెంటనే పందల వంశస్థులు అయ్యప్ప స్వామికి బంగారు ఆభరణాలు తెస్తారని చెప్పడం జరిగింది. ఇంకా ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారం అని చెప్పారు. ఈ విధంగా ఆ కార్యాన్ని దేవాలయ కమిటీ మరియు , ధర్మాధికారులు ఈ ఆచారాన్ని ఆచరిస్తూ వస్తున్నారని దేవాలయం ముఖ్య పూజారి తెలియజేశారు. దీనినే అయ్యప్ప స్వామి జ్యోతిగా మకర జ్యోతిగా పిలుస్తారని చెప్పారు. ఇక ఈ ఆచారాన్ని పందల రాజ వంశస్థులు మరియు , ట్రావెల్ కో దేవాలయం వారు మద్దతు ఇవ్వడం జరిగింది. దీంతో ఆనాటి నుండి ఈనాటి వరకు జ్యోతి దర్శనం క్రమం తప్పకుండా జరుగుతూ వస్తుంది.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది