Zodiac Signs : త్వరలో తులా రాశిలోకి ప్రవేశించనున్న బుధుడు. ఈ రాశుల వారు కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 7 October 2024, 8:00 am
  •  Zodiac Signs : త్వరలో తులా రాశిలోకి ప్రవేశించనున్న బుధుడు. ఈ రాశుల వారు కోటీశ్వరులు అవ్వడం ఖాయం...!

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల పై ప్రభావం చూపిస్తుంది. అయితే ప్రస్తుతం ఈనెల 11వ తేదీన బుధుడు తులారాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇలా బుధుడు అక్టోబర్ 11వ తేదీ నుండి 29వ తేదీ వరకు తులా రాశిలోనే సంచరిస్తాడు. అయితే బుధుడు సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి ప్రయోజనాలు ఉంటే మరి కొన్ని రాశుల వారికి నష్టాలు కూడా ఉన్నాయి. తులా రాశిలో బుధుడు సంచారం కారణంగా ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…

Zodiac Signs మిధున రాశి

తులారాశిలో బుధుడి సంచారం కారణంగా మిధున రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. వృత్తి వ్యాపారాలు చేసే వారికి మంచి లాభాలు ఉంటాయి. ఇక మీన రాశి ఉద్యోగులకు ఉన్నత అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో షేర్లు , రియల్ ఎస్టేట్ రంగాలలో ఉన్న వారికి విశేషమైన లాభాలు వస్తాయి. మొత్తం మీద మిధున రాశి వారికి ఈ సమయం అదృష్టకాలమనే అని చెప్పుకోవచ్చు.

Zodiac Signs కర్కాటక రాశి

బుధ సంచారం కారణంగా కర్కాటక రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆస్తి వివాదాలకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే నూతన గృహాలను కొనుగోలు చేస్తారు. కర్కాటక రాశి వారికి సమాజంలో హోదా పెరుగుతుంది. ఇక వృత్తి వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. ముఖ్యంగా తల్లి నుండి సహాయక సహకారాలు కర్కాటక రాశి వారికి అందుతాయి.

కన్యా రాశి :  తులారాశిలో బుధుడి సంచారం కారణంగా కన్యరాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అలాగే వీరు ఏ పని మొదలుపెట్టిన అందులో విజయాలను సాధిస్తారు. ఈ సమయంలో వీరికి ఆకస్మిక ధన లాభం ఉంటుంది. ఉద్యోగులు ఇంక్రిమెంట్లను ప్రమోషన్లను అందుకుంటారు. ఇక వృత్తి వ్యాపారాలలో మంచి లాభాలు వస్తాయి. ఈ సమయంలో కన్యా రాశి వారికి పేరు ప్రతిష్టలు పెరగడంతో పాటు శుభవార్తలను కూడా వింటారు.

తులారాశి : తులారాశిలో బుధుడు సంచారం కారణంగా వీరికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఆర్థికంగా ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. తులారాశి జాతకుల ఆస్తి వివాదాల సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే వృత్తి వ్యాపారంలో వృద్ధి కనబడుతుంది. విదేశాల నుంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈ సమయంలో వీరి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ధనుస్సు రాశి : ధనస్సు రాశి వారికి తులా రాశిలో బుధుడి సంచారం లబ్ధిని చేకూరుస్తుంది. ఆదాయం రెట్టింపు అవుతుంది. అలాగే ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఈ సమయంలో వృత్తి వ్యాపారాలలో మంచి లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి.

Zodiac Signs : త్వరలో తులా రాశిలోకి ప్రవేశించనున్న బుధుడు. ఈ రాశుల వారు కోటీశ్వరులు అవ్వడం ఖాయం...!

Zodiac Signs : త్వరలో తులా రాశిలోకి ప్రవేశించనున్న బుధుడు. ఈ రాశుల వారు కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

మకర రాశి : తులా రాశిలో బుధుడి సంచారం కారణంగా మకర రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. సమస్యలు మరియు వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. మకర రాశి జాతకులకు విదేశాల నుండి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అలాగే ఈ సమయంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యంగా మకర రాశి వారికి సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి.

Advertisement

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Tags :
Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి