Home » Devotional » This Zodiac Signs Getting Kubera Yoga In September
Devotional

Zodiac Signs : బుధుడు అనుగ్రహంతో ఈ రాశుల వారికి పట్టనున్న కుబేర యోగం…!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: August 28, 2024, 11:00 am
Advertisement

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహానికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అయితే ఈ బుధ గ్రహాన్ని కమ్యూనికేషన్ కు మరియు తెలివితేటలకు స్నేహానికి కారకుడిగా జ్యోతిష్య నిపుణులు చెబుతుంటారు. అయితే వచ్చే సెప్టెంబర్ మాసంలో బుధుడు సూర్యుడి రాశి అయినటువంటి సింహరాశిలోకి అడుగుపెట్టనున్నాడు. సెప్టెంబర్ 4వ తేదీ నుండి బుధుడు సింహరాశిలో సంచారం చేయనున్నాడు. దీనితోపాటు శుక్రుడు మరియు కుజుడు గ్రహాలలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. దీంతో రాశి చక్రంలోని కొన్ని రకాల రాశుల వారిపై దీని ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు. అయితే జాతకంలో బుధుడు శుభస్థానంలో ఉన్నట్లయితే శుభ ఫలితాలు , అశుభ స్థానంలో ఉన్నట్లయితే అశుభ ఫలితాలు వస్తాయి. ఇక సెప్టెంబర్ లో బుధుడు మార్పుల కారణంగా మూడు రాశుల వారికి అదృష్టం పట్టనుంది. మరి ఆ రాశులు ఏంటి.?వారికి ఎలాంటి అదృష్ట ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

Zodiac Signs మేష రాశి…

బుధ గ్రహం సంచారం కారణంగా మేష రాశి వారి జీవితాలలో శుభ ఫలితాలు కలుగనున్నాయి. ఆదాయపరంగా అభివృద్ధి చెందుతారు. తల్లిదండ్రుల నుండి రావాల్సిన సంపద వస్తుంది. సంతానం పట్ల శుభవార్తలు వింటారు. వాస్తు యోగం , వాహనయోగం వంటిది కలుగుతాయి. ఇక ఈ సమయం అనేది నిజంగా మేష రాశి వారికి చాలా అదృష్ట సమయంగా పరిగణించవచ్చు.

మిధున రాశి…

Advertisement

బుధ గ్రహ సంచారం కారణంగా మిధున రాశి వారి జాతకాలలో అదృష్ట ఫలితాలు చోటు చేసుకోనున్నాయి. ఈ సమయంలో వీరికి అందరి నుంచి మంచి మద్దతు లభిస్తుంది. ఆదాయం దినాభివృద్ధి చెందుతుంది. ఉద్యోగం మరియు వ్యాపార రంగాల్లో ఉన్నవారు పురోగతి సాధిస్తారు. అనుకన్న పనులన్నీ పూర్తి చేయగలుగుతారు.

Zodiac Signs : బుధుడు అనుగ్రహంతో ఈ రాశుల వారికి పట్టనున్న కుబేర యోగం…!

Advertisement

సింహరాశి..

బుధ గ్రహ సంచారం వలన సింహ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఉద్యోగ మరియు వ్యాపార రంగాలలో ఉన్నవారు గణనీయమైన పురోగతిని సాధిస్తారు. అధికారుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. సరికొత్త ఆదాయ వనరులు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయం సింహ రాశి వారికి ఎంతో శుభ సమయమని చెప్పవచ్చు. ఇక ఈ సమయంలో మీరు ఎలాంటి పనులు తలపెట్టిన వెంటనే పూర్తవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి