
Monsoon : వానాకాలంలో ఆకుకూరలను తినొచ్చా... తింటే ఏమవుతుంది...!
Monsoon : ఆకు కూరలు అనేవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు మరియు శరీరానికి ఎంతో అవసరమైన పోషకాలు కూడా ఉన్నాయి. అందుకే కచ్చితంగా మనం తీసుకునే ఆహారంలో ఆకు కూరలు కచ్చితంగా ఉండాలి అని నిపుణులు అంటూ ఉంటారు. అయితే ఆకు కూరల ను వర్షాకాలంలో తీసుకోకూడదు అని చాలా మంది భావిస్తూ ఉంటారు. ఈ సీజన్ లో ఆకు కూరలు తీసుకోవడం వలన ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు. ఇంతకీ వర్షాకాలంలో ఆకుకూరలు తీసుకోవడం వలన ఏం జరుగుతుంది. నిజంగానే ఏమైనా నష్టాలు ఉన్నాయా. అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…
వానాకాలంలో ఆకు కూరలు తీసుకోవటం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి అన్న దాంట్లో పూర్తిగా నిజం లేకపోయినప్పటికీ కొంత వరకు మాత్రం నిజం ఉంది అని చెప్పొచ్చు. ముఖ్యంగా వానాకాలంలో ఆకు కూరలు బురదగా ఉంటాయి. అలాగే ఈ వానాకాలంలో గాల్లో తేమ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా వైరస్ మరియు బ్యాక్టీరియా అనేది ఈ ఆకులపై పేర్కొని పోతాయి. కావున వర్షాకాలంలో బ్యాక్టీరియా అనేది తమ సంతాన ఉత్పత్తిని పెంచుకునే ప్రదేశంగా ఆకుకూర లను ఎక్కువగా ఎంచుకుంటాయి. కావున ఆకు కూరలు ఎంతో శుభ్రం చేసుకుని తీసుకోకపోతే ఎన్నో ఇబ్బందులు తప్పవు అని అంటున్నారు నిపుణులు. అలాగే ఆకుకూరల వలన డైరెక్ట్ గా ఎలాంటి ప్రమాదం అనేది ఉండదు. కానీ వాటిపై పేరుకుపోయే వైరస్ మరియు బ్యాక్టీరియా కారణంగా ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీని వలన డయేరియా మరియు కడుపునొప్పి తో పాటు ఇతర పేగు కు సంబంధించిన సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అని అంటున్నారు పోషకాహార నిపుణులు…
Monsoon : వానాకాలంలో ఆకుకూరలను తినొచ్చా… తింటే ఏమవుతుంది…!
అలాగని ఈ ఆకు కూరలను పూర్తిగా మానేయాల్సిన అవసరం కూడా లేదు. వీటిని బాగా శుభ్రం చేసుకుని తీసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని అంటున్నారు. అయితే ఈ ఆకుకూరలు తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలని అంటున్నారు నిపుణులు. దీనికోసం ముందుగా ఆకుకూరలు అన్నింటిని కూడా వేరు చేసుకోవాలి. ఆ తర్వాత ఆకులను పొడి క్లాత్ పై వేసి బాగా ఆరబెట్టుకోవాలి. దీంతో దానిలో ఉన్న తేమ అనేది పూర్తిగా పోతుంది. ఆ తర్వాత ఆకుకూరలను వండే ముందు ఉప్పు వేసి నీటిలో కొంతసేపు కొడకబెడితే చాలా మంచిది. ఇలా చేసినట్లయితే వానాకాలంలో ఆకుకూరలను తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు.
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
This website uses cookies.