Zodiac Signs : అక్టోబర్ 02 ఆదివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By Tech Desk | The Telugu News | Published on: October 1, 2022, 10:40 pm

Zodiac Signs : మేషరాశి ఫలాలు : ఈరోజు మీకు మిత్రులు, బంధువుల నుంచి శుభవార్తలు. మీకు అనుకోని మార్గాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. అర్థికంగా మంచి ఫలితాలు. విశ్రాంతి కోసం చేసే ప్రయత్నం సఫలం అవుతుంది. శ్రీ సూర్యనారాయణ ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు: విద్యార్థులకు శుభకరమైన రోజు. దూర ప్రాంతం నుంచి మంచి వార్తలు వింటారు. సమాజంలో మంచి గౌరవం పెరుగుతుంది. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆరాధన చేయండి.

మిథున రాశి ఫలాలు: ఆప్పుల కోసం ప్రయత్నిస్తారు. ఇంటా, బయటా మీపై వత్తిడి పెరుగతుంది. ఆర్థికంగా మందగమన పరిస్థితి. మహిళలకు మంచి వార్తలు అందుతాయి. ఖర్చులు పెరుగుతాయి. ఆదిత్య హృదయం పారాయణం. చేయండి.: కర్కాటక రాశి ఫలాలు: ఈరోజు అనుకోని మార్పులు సంభవిస్తాయి. వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఆదాయం వనరులు పెరుగుతాయి. విదేశీ ప్రయత్నాలు లాభిస్తాయి. విద్య, ఉద్యోగ విషయాలు అనుకూలం. శ్రీ లక్ష్మీసూక్తంతో అమ్మవారికి పూజ చేయండి.

today horoscope october 2 2022 check your zodiac signs

today horoscope october 2 2022 check your zodiac signs

సింహ రాశి ఫలాలు : ఈరోజు అనుకోని లాభాలు వస్తాయి. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. పెద్దల ద్వారా శుభవార్తలు. తల్లి బంధువుల నుంచి మంచి వార్తలు వింటారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఇష్టదేవతరాధన చేయండి.

కన్యారాశి ఫలాలు : సంతానం వల్ల ఇబ్బందులు. అనుకోని నష్టాలు వస్తాయి. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. మిత్రులతో కలసి విందులు, వినోదాలకు హజరవుతారు. బంధువుల నుంచి వత్తిడులు వస్తాయి. శ్రీ సరస్వతి ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : దీర్ఘకాలిక సమస్యల నుంచి ఈరోజు బయటపడుతారు. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఇండ్లు, పోలాల కొనుగోలకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : కుటుంబంలో కొత్త స్తబ్తతతో కూడిన వాతావరణం. విద్యార్థుల కలలు కార్యరూపం దాలుస్తాయి. విద్య, ఉపాధి విషయాలలో సానుకూలత కనిపిస్తుంది. ఈరోజు మిత్రుల సహకారంతో తీసుకుంటారు. శ్రీ సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : ధన సంబంధ విషయాలలో పురోగతి కనిపిస్తుంది. . కుటుంబంలో పెద్ద వారి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సిన రోజు. ఈరోజు అప్పులు తీరుస్తారు. ప్రయాణ సూచన. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

మకర రాశి ఫలాలు : ఈరోజు అన్నదమ్ముల నుంచి ఇబ్బందులు వస్తాయి. ప్రయాణ సూచన కనిపిస్తుంది. ఇంటా, బయటా మీపై వత్తిడి పెరుగతుంది. ఆనుకోని వివాదాలు వస్తాయి. ఇబ్బందులు పడుతారు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

కుంభరాశి ఫలాలు : ఈరోజు దూర ప్రయాణాలు చేస్తారు. మంచి పనులు చేద్దామనుకున్నా జాప్యం జరుగుతుంది. దూర బంధువుల నుంచి వత్తిడులు వస్తాయి. మహిళలకు పనివత్తిడి. ఇష్టదేవతరాధన చేయండి.

మీన రాశి ఫలాలు : విద్య, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో చక్కటి వాతావరణం. కుటుంబంలో శుభకార్య ఆలోచన చేస్తారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడుతారు. శ్రీ ఆదిత్య హృదయం పారాయణం చేయండి.

Tech Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp