Home » Devotional » Today Horoscope October 4 2022 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : అక్టోబర్ 04 మంగళవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By
Tech Desk
The Telugu News | Updated on: October 3, 2022 9:36 pm
Advertisement

Zodiac Signs : మేష రాశి ఫలాలు :అనుకోని లాభాలు వస్తాయి. ఆదాయం పరగుతుంది. అప్పులు కోసం చేసే ప్రయత్నాలు పలిస్తాయి. మీకు సంతోషకరమైన రోజు. మహిళలకు మంచి వార్తలు అందుతాయి. ప్రయాణ సూచన. అమ్మవారి ఆరాదన చేయండి. వృషభ రాశి ఫలాలు: అనందంతో ఈరోజు గడుస్తుంది. అదాయం సాధారణంగా ఉంటుంది. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. అన్నదమ్ముల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారం చేసే వ్యక్తులకు అనుకూలంగా ఉంటుంది. ఈ కొత్త పనులు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. మహిళలకు శుభం. శ్రీ కాళీకాదేవీ ఆరాధన చేయండి.

Advertisement

మిథున రాశి ఫలాలు: కొంచెం ఇబ్బంది రావచ్చు. అనుకోని ఆటంకాలతో చికాకులు. అప్పుల కోసం ప్రయత్నాలు చేస్తారు. ఆదాయం సాధారణంగా ఉంటుంది. పనిలో జాప్యం. వివాదాలకు ఆస్కారం. జాగ్రత్తగా, ఓపికగా వుండాలి. సాయంత్రం నుంచి కొంత శుభపరిణామాలు జరగవచ్చు. శ్రీ దుర్గామాతా ఆరాదన చేయండి. కర్కాటక రాశి ఫలాలు: ఆదాయం బాగుంటుంది. పనులలో వేగం పెరుగుతుంది. అన్నింటా మీకు సానుకూలమైన రోజు. మంచి పనులు ప్రారంభిస్తారు. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. విద్యా, ఉపాధి విషయాలలో అనకూలత. ఇంటా, బయటా మీ ప్రభావం పెరుగుతుంది. మహిళలకు వస్త్రలాభాలు. అమ్మవారి ఆరాధన చేయండి.

today horoscope october 4 2022 check your zodiac signs

Advertisement

సింహరాశి ఫలాలు: కొద్దిగా అనుకూలత, కొద్దిగా ప్రతికూలత కలిగిన రోజు. ఇంటా, బయటా మీకు శ్రమ బాగా పెరగుతుంది. అన్నింటా మీకు చికాకలు వచ్చినా ఓర్పుతో ముందుకుపోతారు. ఆదాయం మాత్రం పెరగుతుంది. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. చక్కటి శుభవార్తలు వింటారు. నవదుర్గా ఆరాధన చేయండి.

కన్యా రాశి ఫలాలు: చక్కటి శుభదినం ఈరోజు. ఆదాయం పెరగుతుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలు చేసే వారికి ఈ రోజు బాగానే ఉంటుంది. ఇంటా, బయటా మంచి పేరు సంపాదించుకోగలుగుతారు. మహిళలకు ధనలాభాలు. శ్రీ లక్ష్మీ దేవి ఆరాధన చేయండి.

Advertisement

తులా రాశి ఫలాలు:అన్నింటా మీకు అనుకూలత కనిపిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఆశాజనకమైన వార్తలు వింటారు. విదేశీ విషయాలలో పురోగతి కనిపిస్తుంది. అనుకోని లాభాలు గడిస్తారు.ప్రయాణ సూచన. క్షేత్ర పర్యటన. ఇష్టదేవతారాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు: అన్నింటా కొద్దిగా ఇబ్బందులు కానీ ధైర్యంతో మీరు వాటిని అధిగమిస్తారు. కొత్త ప్రాజెక్టులకు అనుకూలమైన రోజు. ఆస్తి సంబంధ విషయాలలో అనుకూలత కనిపిస్తుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. శ్రీ మహాదుర్గా ఆరాధన చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు: ఈరోజు చక్కటి శుభఫలితాలు వస్తాయి. మనస్సు నిలకడగా ఉండదు. కానీ పనులు మాత్రం త్వరితగతిన పూర్తిచేస్తారు. చాలా బిజీగా ఉంటుంది. ఇతర విషయాలపై ఎక్కువ ఆలోచనలు చేయకండి. మంచి జరుగుతుంది. గోసేవ, పేదలకు దానధర్మాలు చేయండి.

మకర రాశి ఫలాలు: అన్నింటా మీకు పర్వాలేదు అన్న విధంగా ఉంటుంది. కొద్దిగా శ్రమ పడినా మీకు అనుకున్న పనులు నెరవేరుతాయి. ఆదాయం పెరుగుతుంది. చక్కటి రోజు. విద్యార్థులకు శుభవార్తలు. వ్యాపారాలలో లాభాలు. ఆరోగ్యం బాగుంటుంది. మహిళలకు ధనలాభాలు. అమ్మవారి ఆరాధన చేయండి.

Advertisement

కుంభ రాశి ఫలాలు: కొద్దిగా ఇబ్బందులు పడుతారు. ఆదాయం తగ్గుతుంది. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఆఫీస్‌లో పై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో సంతోషం. ఇష్టదేవతరాధన చేయండి.

మీనరాశి ఫలాలు: పర్వాలేదు. మీకు ఈరోజు చక్కటి వార్తలు అందుతాయి. మీ ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు మీకు మధ్య అంతరం ఏర్పడే సూచన. వ్యాపారాలలో లాభదాయకమైన రోజు. సమాజ సేవ, సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అమ్మవారి దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.

Tech Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి