
Today is Polala Amavasya Those who have sons must do
Polala Amavasya : సెప్టెంబర్ 14న పోలాల అమావాస్య కొడుకులు ఉన్నవారు రాత్రి 9:30 లోపు ఈ పరిహారం చేసి తీరాల్సిందే.. మరి సెప్టెంబర్ 14 పొలాల అమావాస్య రోజు చేసుకోవాల్సిన పరిహారం ఏంటి అనే విశేషాలు ఇప్పుడు మనం చూద్దాం.. ఈ పొలాల అమావాస్య వ్రతం కి ఎంతో విశిష్టత ఉంది. ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం చాలామంది ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. వివాహం అయిపోయి చాలా కాలమైనా సంతానం కలగని స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి. వారికి పండంటి బిడ్డలు పుడతారు. సౌభాగ్యం కోసం పిల్లల యోగక్షేమాల కోసం తమ కుటుంబం కోసం శ్రావణ అమావాస్యనాడు ఈ పోలాల అమావాస్య వ్రతాన్ని తప్పకుండా చేసుకోవాలి. ఇక సూర్యోదయానికి ముందే నిద్రలేచిన తర్వాత దగ్గర్లో ఏదైనా నీటి ప్రవాహం ఉంటే అక్కడికి వెళ్లి స్నానం చేసి రావాలి. లేదు అంటే ఆ ప్రవహించే నీటిని తీసుకొచ్చి ఇంట్లో స్నానం చేయాలి. మా ఊరికి దగ్గరలో ఎటువంటి నీటి ప్రవాహాలు లేవు అనుకున్నప్పుడు మీరు మీ ఇంట్లో ఉన్న బకెట్ నీళ్లలోనే కొంచెం పసుపు అక్షితలు వేసుకుని గంగేచ, యమునేచ అనేటువంటి స్తోత్రాన్ని చదువుకుంటూ స్నానం చేయాలి.
అప్పుడు అన్ని నదుల్లో స్నానం చేసినటువంటి పుణ్యఫలం అనేది దక్కుతుంది. అలా స్నానాన్ని ఆచరించిన తర్వాత పూజకు ఏర్పాట్లు చేసుకోవాలి. లక్ష్మీదేవిని భక్తితో ఆరాధించాలి. భారతీయులకి కొడుకుల మీద ఎక్కువ అవినాభావ సంబంధం ఉంటుంది. కొడుకు అనేవాడు మనతోనే ఉంటాడని కొంత ఎక్కువ ప్రేమను పంచుతూ ఉంటారు. కొడుకును ఎంతో ప్రేమగా చూసుకుంటారు. వృద్ధాప్యంలో ప్రేమను చూపిస్తూ వారిని ఆదరిస్తారని తల్లిదండ్రులు భావిస్తూ ఉంటారు. అయితే ఇంతటి అపురూపమైన కొడుకుల్ని ఎటువంటి నరదృష్టి తగలకుండా చూసుకోవాలి. అంటే ఈ పొలాల అమావాస్య రోజు రాత్రి 9:30 లోపు ఈ పరిహారం అనేది చేసుకోవాల్సి ఉంటుంది. పోలాల అమావాస్య రోజు అంటే సెప్టెంబర్ 14వ రోజు రాత్రి 9:30 లోపు ప్రతి తల్లి అంటే కొడుకులు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా ఈ పరిహారాన్ని చేయాలి. దీని వల్ల మీ పిల్లల మీద మీ కుటుంబం మీద ఉన్నటువంటి దుష్టశక్తులన్నీ కూడా పోతాయి.
Today is Polala Amavasya Those who have sons must do
వారి భవిష్యత్తు ఉత్సవంగా ఉంటుంది. వీరి మీద ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఈ అమావాస్యతో కొట్టుకుపోతుంది. భవిష్యత్తులో మంచి అభివృద్ధిలోకి వచ్చేటువంటి మార్గాలు తేల్చుకుంటాయి. మరి ఈ పొలాల అమావాస్య రోజు పాటించాల్సిన పరిహారం ఏంటి అంటే.. రాత్రి భోజనం అయిపోయిన తర్వాత మీ కొడుకుల్ని సింహద్వారం దగ్గర ఉంచి ఎర్రని నీళ్ళతో గాని లేదంటే గుమ్మడికాయతో కానీ దుష్ట తియ్యాల్సి ఉంటుంది. ఇలా ఒకటి తర్వాత ఒకటి దిష్టి తీయాలి. అంటే ముందుగా ఎర్రని నీళ్లతో దిష్టి తీయాలి. ఆ తర్వాత గుమ్మడికాయతో దిష్టి తీయాలి. ఆ తర్వాత ఎండు మిరపకాయలతో దిష్టి తీయాలి. ఆ తర్వాత నిమ్మకాయలతోటి దిష్టి తీయాలి.
నాలుగు రకాలుగా దిష్టి తీయాల్సి ఉంటుంది. కాబట్టి రాత్రి భోజనం తర్వాత ఈ నియమాలను పాటించండి కొడుకులు చెప్పిన మాట వినట్లేదు చక్కగా చదువుకోవట్లేదు లేదా ఏ మాటక ఆ మాట ఎదురు చెబుతున్నారు. అనుకునే వారు కూడా ఈ పరిహారాలను పాటించవచ్చు. వారి మీద ఉన్నటువంటి చెడు ప్రయోగాలు చెడు దుష్టశక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి. వారికి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ కుటుంబానికి కానీ మీ కొడుకులు కానీ ఏమైనా దోషాలు ఉంటే ఈ పరిహారాలతోనే అవన్నీ తొలగిపోతాయి…
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.