Lucky Plants : ఈ చెట్టు ఎవరింట్లో ఉంటుందో వాళ్లు అదృష్టవంతులు .. సాక్షాత్తు శ్రీరాముడే చెప్పాడు ..!!
Lucky Plants : గోరింటాకు చెట్టు ఇంట్లో ఉంటే అన్ని శుభాలే జరుగుతాయి అని మన పూర్వీకుల నమ్మకం. అంతే కాదు గోరింటాకు ఎర్రగా పండితే నరదిష్టి నరగోష దోషాలు తొలగిపోతాయి. అలాగే ఇంటికి ప్రధాన రక్షణగా కూడా ఉంటుంది. అందుకే ఇంటిముందు గోరింటాకు చెట్టును తప్పనిసరిగా పెంచుకోవాలి. ఎవరి ఇంటి ముందు అయితే గోరింటాకు చెట్టు ఉంటుందో వారి ఇంట్లో అష్టైశ్వర్యాలు ఉంటాయి. గోరింటాకు అంటే గౌరీ ఇంట లక్ష్మీ అని అర్థం. అసలు ఈ పేరు ఎందుకు వచ్చింది అంటే గౌరీ దేవి తన చెలికత్తెలతో ఉద్యానవనంలో ఆడుకుంటున్న సమయంలో రజస్వల అవుతుంది. ఆ రక్తపు చుక్క నేలను తాకగానే ఒక చెట్టు పుడుతుంది. దీంతో చెలికత్తెలు పర్వత రాజుకు తెలియజేస్తారు.
సతీసమేతంగా పర్వత రాజు ఉద్యానవనానికి వచ్చి చూడగా వాళ్లతో చెట్టు ఇలా అంటుంది. నేను సాక్షాత్తు గౌరీ అంశతో పుట్టాను. నా జన్మ వల్ల ఈ లోకానికి ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది అని అడుగుతుంది. అప్పుడు గౌరీ దేవి చిన్నతనం తో ఆ చెట్టు ఆకులను కోస్తుంది. దీంతో చేతులు ఎర్రగా అవుతాయి. అప్పుడు పర్వత రాజు అయ్యో నా బిడ్డ చేతులు కందిపోయాయి అని బాధపడతాడు. దీంతో పార్వతి నాకు ఎటువంటి బాధ కలగలేదు తండ్రి పైగా చాలా అలంకారంగా కూడా ఉంది అంటుంది. దీంతో పర్వత రాజు ఆ చెట్టుతో ఓ పవిత్ర వృక్షము నువ్వు సౌభాగ్యానికి చిహ్నం. చేతులకు చక్కని అందాన్ని ఇచ్చే వృక్షం. నీవల్ల ఈ లోకానికి మేలు కలుగుతుంది అని అంటారు.
ఇదే గోరింటాకు గురించి శ్రీరాముడు కూడా చెబుతాడు. సీతాదేవి అశోకవనంలో రావణ చెరలో ఉన్నప్పుడు సీతాదేవి ఆవరణంలో గోరింటాకు చెట్టు వద్ద తన బాధను చెప్పుకునేదట. అలా చెప్పుకుంటూ రాముడు తన దగ్గరకు వచ్చేవరకు గోరింటాకు చెట్టుతోనే తన బాధను చెప్పుకునేది. ఆ తర్వాత శ్రీరాముడు రావణ సంహారం చేసి అయోధ్యకు వచ్చిన తర్వాత ఈ విషయాన్ని సీతమ్మవారు చెప్పారట. దీంతో రాముడు ఎంతో సంతోషించి గోరింటాకు చెట్టుకు ఒక వరాన్ని కూడా ఇచ్చాడు. ఎవరైతే గోరింటాకును ఇంట్లో నాటి నీరు పోసి పెంచుతారో అలాంటి వారి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయని వరం ఇచ్చారట. గోరింటాకు పెట్టుకున్న పెళ్లి కానీ ఆడవారికి మంచి భర్త కలుగుతాడని, స్త్రీలు గోరింటాకు పెట్టుకుంటే జీవితం ఆనందంగా ఉంటుందని శ్రీరాముడు ఆ చెట్టుకు వరాన్ని ఇచ్చాడు.