TTD : టీటీడీ వెనకడుగు వేసిందా.. ఆ నిర్ణయాన్ని వెన‌క్కి తీసుకోనుందా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TTD : టీటీడీ వెనకడుగు వేసిందా.. ఆ నిర్ణయాన్ని వెన‌క్కి తీసుకోనుందా..?

 Authored By prabhas | The Telugu News | Updated on :25 February 2022,6:00 am

TTD : తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎప్పటికప్పుడు దేవస్థానం బోర్డు సంచలన నిర్ణయాలు తీసుకోవడం తో వార్తల్లో నిలుస్తోంది. ఆ మధ్య లడ్డూ ప్రసాదం ఇతర విషయాలపై టిటిడి బోర్డు తీసుకున్న నిర్ణయాలు అభినందనీయంగా మారాయి. అదే ఉత్సాహంతో టీటీడీ బోర్డ్‌ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి కొత్త నిర్ణయాన్ని తీసుకొని భక్తులకు సంతోషంగా కలిగించారు. అయితే ఆ నిర్ణయం అమలు చేయడంలో టెక్నికల్ గా సమస్యలు రావడంతో ఆయన వెనకడుగు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం లో ఎటువంటి ప్రైవేట్ హోటల్లో ఉండేందుకు అవకాశం లేకుండా నిర్ణయం తీసుకున్నారు.అంటే కొండ పైన భోజనం అమ్మెందుకు ఎలాంటి హోటళ్ళు.. కనీసం టిఫిన్ సెంటర్స్‌ లాంటివి కూడా ఉండకూడదు

అని నిర్ణయం తీసుకున్నారు. ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు.. భోజనం హోటల్.. టిఫిన్ సెంటర్లు ప్రతి ఒక్క దాన్ని కూడా తొలగించే ఉద్దేశ్యంతో టీటీడీ నిర్ణయం తీసుకుంది. అక్కడ ప్రధాన మంత్రి నుండి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరికి కూడా ఒకే తరహా భోజనం నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా హోటల్స్ ని తీసి వేయడం కూడా నిర్ణయం జరిగింది కానీ ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లలను తీసేయడానికి మాత్రం టీటీడీకి వీలు పడడం లేదు. పెద్ద ఎత్తున ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు కొండ మీద ఉన్నాయి. వాటి ద్వారా వేల మంది ఉపాధి పొందుతున్నారు. ఇలాంటి సమయంలో వారిని ఖాళీచేయిస్తే వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది.అంతే కాకుండా వారు ఆందోళన చేస్తే భక్తులకు ఇబ్బంది కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే వారికి ప్రత్యమ్నాయం ఏదైనా చూసి ఆ తరువాత ఖాళీ చేయించాలని భావించారు.

TTD board to ban private eateries in tirumala

TTD board to ban private eateries in tirumala

కానీ వారు ప్రత్యామ్నాయానికి ఒప్పు కోవడం లేదు. ఖచ్చితంగా మా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల ను మేమే చూసుకొంటాము అంటూ భీష్మించుకు కూర్చున్నారు. ఈ విషయం లో వారి నిర్ణయము మార్చుకోక పోవడం తో ఈ మొత్తం వ్యవహారం తల కిందులుగా మారిపోయింది. వై వి సుబ్బారెడ్డి తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది అని.. భక్తుల కోసం ఉచిత భోజనం ఏర్పాటు చేయడం అనేది మంచి నిర్ణయం కానీ పేద వాడి పొట్ట కొట్టి భక్తులకు కడుపు నింపడం అనేది కూడా మంచిది కాదు అంటూ రాజకీయ వర్గాల వారు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దాంతో టీటీడీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అతి త్వరలోనే మరో మీటింగ్ లో వైవి సుబ్బారెడ్డి ఏం చెప్తాడు అనేది చూడాలి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది