TTD : తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎప్పటికప్పుడు దేవస్థానం బోర్డు సంచలన నిర్ణయాలు తీసుకోవడం తో వార్తల్లో నిలుస్తోంది. ఆ మధ్య లడ్డూ ప్రసాదం ఇతర విషయాలపై టిటిడి బోర్డు తీసుకున్న నిర్ణయాలు అభినందనీయంగా మారాయి. అదే ఉత్సాహంతో టీటీడీ బోర్డ్ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి కొత్త నిర్ణయాన్ని తీసుకొని భక్తులకు సంతోషంగా కలిగించారు. అయితే ఆ నిర్ణయం అమలు చేయడంలో టెక్నికల్ గా సమస్యలు రావడంతో ఆయన వెనకడుగు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం లో ఎటువంటి ప్రైవేట్ హోటల్లో ఉండేందుకు అవకాశం లేకుండా నిర్ణయం తీసుకున్నారు.అంటే కొండ పైన భోజనం అమ్మెందుకు ఎలాంటి హోటళ్ళు.. కనీసం టిఫిన్ సెంటర్స్ లాంటివి కూడా ఉండకూడదు
అని నిర్ణయం తీసుకున్నారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు.. భోజనం హోటల్.. టిఫిన్ సెంటర్లు ప్రతి ఒక్క దాన్ని కూడా తొలగించే ఉద్దేశ్యంతో టీటీడీ నిర్ణయం తీసుకుంది. అక్కడ ప్రధాన మంత్రి నుండి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరికి కూడా ఒకే తరహా భోజనం నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా హోటల్స్ ని తీసి వేయడం కూడా నిర్ణయం జరిగింది కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలను తీసేయడానికి మాత్రం టీటీడీకి వీలు పడడం లేదు. పెద్ద ఎత్తున ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కొండ మీద ఉన్నాయి. వాటి ద్వారా వేల మంది ఉపాధి పొందుతున్నారు. ఇలాంటి సమయంలో వారిని ఖాళీచేయిస్తే వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది.అంతే కాకుండా వారు ఆందోళన చేస్తే భక్తులకు ఇబ్బంది కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే వారికి ప్రత్యమ్నాయం ఏదైనా చూసి ఆ తరువాత ఖాళీ చేయించాలని భావించారు.
కానీ వారు ప్రత్యామ్నాయానికి ఒప్పు కోవడం లేదు. ఖచ్చితంగా మా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల ను మేమే చూసుకొంటాము అంటూ భీష్మించుకు కూర్చున్నారు. ఈ విషయం లో వారి నిర్ణయము మార్చుకోక పోవడం తో ఈ మొత్తం వ్యవహారం తల కిందులుగా మారిపోయింది. వై వి సుబ్బారెడ్డి తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది అని.. భక్తుల కోసం ఉచిత భోజనం ఏర్పాటు చేయడం అనేది మంచి నిర్ణయం కానీ పేద వాడి పొట్ట కొట్టి భక్తులకు కడుపు నింపడం అనేది కూడా మంచిది కాదు అంటూ రాజకీయ వర్గాల వారు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దాంతో టీటీడీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అతి త్వరలోనే మరో మీటింగ్ లో వైవి సుబ్బారెడ్డి ఏం చెప్తాడు అనేది చూడాలి.
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.