Tulsi Plant : మనకు మంచి రోజులు వచ్చే ముందు తులసి మొక్క ఈ 5 సంకేతాలను తెలియజేస్తుంది..!!
Tulsi Plant : తులసి మొక్క మనకు రాబోయే సంఘటన గురించి మనకు సంకేతాలను ఇస్తుంది. అదేవిధంగా తులసి మనకు కలదు శుభాలను గురించి కూడా సంకేతానందిస్తుంది. ఒకవేళ మీరు తులసిని శ్రద్ధగా ధ్యానిస్తే మనకు రాబోయే కాలంలో ఏం జరగబోయిది వివరంగా తెలిసిపోతుంది. అందుకే తులసిని భగవాన్ విష్ణువుతో సమానంగా భావిస్తారు. అందుకే ఈ తులసి లక్ష్మీ మరియు విష్ణుమూర్తి కలిసి నివాసం చేస్తున్న స్థలంలోనే ఉంటుంది.
తులసి పూజ చేసేవారు నరకానికి వెళ్ళవలసిన అవసరం ఉండదు. తులసి సేవ చేసే ప్రతి మనిషి గోలోకానికి వెళతారు. ఎక్కడైతే తులసి నివాసం ఉంటుందో అక్కడ దుష్టు శక్తులు నిలబడవు. అందుకే తులసిని ఇంటి ముందు పెంచాలి అనే నియమం ఉంది. ఎవరైతే తులసి పూజలు నిత్యం చేస్తారో వారి ఇంట్లో శోకం అనేది ఉండదు. దాంతో పాటుగా తులసిని పెంచటానికి మరో ముఖ్య కారణం ఏంటంటే రాబోయే కాలంలో ఏం జరగబోతుంది అనేది తులసి మనకు సూచిస్తుంది.
1) తులసి మొక్కకు నిత్యం నీరు పోస్తూ పూజలు చేస్తూ నిరీక్షిస్తే కనుక తప్పకుండా మనకు సంకేతాలను అందిస్తుంది. పచ్చగా నిండుగా ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ తులసి మొక్కకు నీరు అందిస్తున్న కూడా అది వాడిపోవడం లేదా ఎండిపోవడం లేదా చనిపోవడం జరిగితే అది చాలా అశుభాన్ని సూచిస్తుంది. ఏదో ఒక కారణం చేత మీ ధనాన్ని మొత్తాన్ని మీరు వెచ్చించాల్సి ఉంటుంది.
2) ఒకవేళ తులసి మొక్క యొక్క ఆకులు పచ్చగా ఉన్నప్పుడే వాటంతా అవే రాలిపోతుంటే కనుక అది ఎంత మాత్రం మంచిది కాదు.. ఎండిన లేకపోతే పండిన ఆకులు గాలికి రాలిపోతే పర్వాలేదు కానీ పచ్చగా ఉన్నటువంటి ఆకులు రాలిపోతే లక్ష్మీదేవి మీపై ఆగ్రహించినట్టే మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నట్టేస్తుం..
3) ఒకవేళ మీ ఇంటి ముందు తులసి మొక్క దానంతట అదే మొలిస్తే గనక సాక్షాత్తు లక్ష్మీదేవి మీ మీద కటాక్షించినట్టే..
4) అదే తులసి మొక్క చుట్టూ ఇతర పురుగులు లేదా సాలె పురుగులు చేరితే ధనాన్ని నష్టపోతాము అని అర్థం. తులసి మొక్కను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. చెట్టు లాగానే కళకళలాడుతూ ఉంటుంది అని అది శుభసంకేతంగా సూచిస్తారు.
5)తులసి మొక్క ఎంత గుబురుగా పచ్చగా ఉంటుందో మీ కుటుంబం కూడా అంతే సుఖంగా ఉంటుంది. దాని యొక్క సంరక్షణ చక్కగా చేయండి అప్పుడు తులసి మీకు వృత్తిని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది.