Ganapati Prasadam : వినాయక చవితి సందర్భంగా ఏడు రకాల ప్రసాదాలను మీకు తయారుచేసి చూపించబోతున్నాం. వినాయక చవితి రోజున నూనెతో చేసిన నైవేద్యాలను గణపతికి పెట్టకూడదు. నేతితో చేసిన పదార్థాలను గణేశుడికి నైవేద్యంగా పెట్టాలి. కొబ్బరి కుడుములు, పాలతాలికలు, సేమియా పాయసం, ఉండ్రాళ్ల పాయసం, రవ్వ కేసరి, పూర్ణం కుడుములు, ఉండ్రాళ్ళు, సేమియా పాయసం ఇలా ఏడు రకాల పదార్థాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1) రవ్వ కేసరి: ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని అందులో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసి దోరగా వేయించుకోవాలి. మరొక స్టౌ పైన గిన్నె పెట్టుకుని ఒక కప్పు కి మూడు కప్పుల వాటర్ పోసుకొని మరిగించాక ఈ వేడి వేడి నీళ్లను రవ్వలోకి పోసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో ఒకటిన్నర కప్పుల పంచదార వేసి లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. చిటికెడు ఫుడ్ కలర్ వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా నెయ్యి వేసి పక్కన పెట్టుకొని పైన డ్రై ఫ్రూట్స్ తో గార్లిక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన రవ్వ కేసరి రెడీ.
2) ఉండ్రాళ్ళు: ఒక కప్పు బియ్యం రవ్వకి పావు కప్పు శనగపప్పు తీసుకోవాలి. శనగపప్పును ఒక గిన్నెలోకి తీసుకొని కొన్ని వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకుని ఒక టీ స్పూన్ నెయ్యి వేసి ఇందులో ఒక స్పూన్ జీలకర్ర, రెండు కప్పుల వాటర్ పోసి నానబెట్టుకున్న శనగపప్పును వేసి మూతపెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత బియ్యం రవ్వను కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసి మూతపెట్టి 10, 15 నిమిషాలు ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఉండ్రాళ్ళు లాగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉండ్రాళ్ళను ఆవిరి పట్టించడానికి ఇడ్లీ కుక్కర్ లో వేసి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతే ఎంతో టేస్టీ అయిన ఉండ్రాళ్ళు రెడీ.
3) పూర్ణం కుడుములు: ముందుగా ఒక బౌల్లో అరకప్పు శనగపప్పు వేసి ఒక కప్పు వాటర్ వేసి గంట నానబెట్టుకోవాలి. తర్వాత కుక్కర్లో వేసి రెండు మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి. తర్వాత ఈ పప్పును మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో అర కప్పు బెల్లం, 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసి బెల్లాన్ని కరగనివ్వాలి. ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న శనగపప్పు వేసి బాగా కలుపుకోని పావు టీ స్పూన్ యాలకుల పొడి ఒక టీ స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకొని ప్రక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ పై పాన్ పెట్టుకుని ఒక కప్పు వాటర్ పోసి పావు టీ స్పూన్ ఉప్పు వేసి ఒక టీ స్పూన్ నెయ్యి వేసి ఉడికిన తర్వాత అరకప్పు బియ్యం వేసి బాగా కలిపి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. చల్లారాక ఒక కవర్పై అప్పలాగా చేసుకుని మధ్యలో శనగపప్పు ముద్దను పెట్టి పిండి మొత్తాన్ని కూడా పూర్ణం లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో ఈ పూర్ణాలను వేసి ఉడికించుకోవాలి.
4) ఉండ్రాళ్ళ పాయసం: పాన్ లో ఒకటిన్నర కప్పునీళ్లు పోసి చిటికెడు ఉప్పు వేసి మరిగాక ఒక కప్పు బియ్యం పిండి వేసి బాగా కలుపుకోవాలి. చల్లారాక గుండ్రంగా చుట్టుకొని ప్రక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకొని ప్రక్కన తీసుకోవాలి. తర్వాత ఇందులో అర లీటర్ వాటర్ పోసి మరిగాక చిటికెడు సాల్ట్ వేసి ముందుగా చుట్టుకున్న ఉండ్రాళ్ళను వేసి రెండు టేబుల్ స్పూన్ల వరీ రవ్వ వేసి చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో ముప్పావు కప్పు షుగర్ వేసి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చివర్లో పావు టీ స్పూన్ ఏలకుల పొడి వేసి ఎండు కొబ్బరి పొడి కూడా వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. మరొక గిన్నెలోకి తీసుకొని పైన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. అంతే ఉండ్రాళ్ళ పాయసం రెడీ.
5) కొబ్బరి కుడుములు: ప్యాన్ లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి అయ్యాక ఒక కప్పు కొబ్బరి పొడి వేసి ఐదు నిమిషాలు దోరగా వేయించుకోవాలి. తర్వాత ఇందులో అరకప్పు తురిమిన బెల్లం వేసి కరిగాక పావు టీస్పూన్ యాలకుల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు మరొక పాన్ లో ఒక కప్పు వాటర్ పోసి పావు టీ స్పూన్ ఒక టీ స్పూన్ నెయ్యి వేసి మరిగాక అరకప్పు బియ్యం పిండి వేసి బాగా కలుపుకొని రెండు నిమిషాలు ఉడికించుకోవాలి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు అప్పలాగ చేసుకుని మధ్యలో కొబ్బరి కుడుములను పెట్టి రౌండ్ గా చేసుకుని ఇడ్లీ కుక్కర్ లో వేసి ఉడికించుకోవాలి. అంతే కొబ్బరి కుడుములు రెడీ.
6) పాలతాలికలు: కడాయిలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అందులో కొన్ని జీడిపప్పులు, కొన్ని కిస్మిస్లు వేసి దోరగా వేయించుకోవాలి. వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక కప్పు వాటర్ పోసి చిటికెడు ఉప్పు వేసి మరిగాక అర కప్పు బియ్యప్పిండి వేసి బాగా కలుపుకొని రెండు నిమిషాలు ఉడికించుకోవాలి. చల్లారాక తాలికలు లాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన వన్ టీ స్పూన్ నెయ్యి వేసి వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసి వేయించుకొని అందులో రెండు కప్పుల పాలు పోసి పొంగొచ్చే వరకు ఉంచాలి. తర్వాత ఇందులో తాళికలు వేసి ఉండ్రాళ్ళు వేసి పది పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. అరకప్పు పంచదార వేసి ఐదు పది నిమిషాలు ఉడికించుకొని ఒక టేబుల్ స్పూన్ ఏలకుల పొడి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలి. చల్లారాక ఒక గిన్నెలోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన పాలతాలికలు రెడీ.
7) సేమియా పాయసం: పావు కప్పు సగ్గుబియ్యం లో కొన్ని నీళ్లు పోసి అరగంట నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకుని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందులోనే ముప్పావు కప్పు సేమియా వేసి దోరగా వేయించుకొని ప్రక్కన పెట్టుకోవాలి. అందులోనూ రెండు కప్పుల వాటర్ పోసి మరిగాక నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసి కొద్దిగా ఉడికాక సేమియా వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో ఒక కప్పు పంచదార వేసి బాగా కలుపుకొని నాలుగు కప్పుల పాలు పోసి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత అర స్పూన్ యాలకుల పొడి వేసి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన సేమియా పాయసా రెడీ.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.