Ugadi Rashi Phala 2025 : ఉగాది తరువాత శని స్థాన మార్పు ఏ రాశి వారికి లాభం… ఎవరికి నష్టం… తెలుసుకోండి…?
ప్రధానాంశాలు:
Ugadi Rashi Phala 2025 : ఉగాది తరువాత శని స్థాన మార్పు ఏ రాశి వారికి లాభం... ఎవరికి నష్టం... తెలుసుకోండి...?
ugadi rashi phala 2025 : ఉగాది నుంచి మార్చి 29న కుంభ రాశి నుంచి మీన రాశి లోనికి శనీశ్వరుడు గమనం సాగిస్తున్నాడు. ఈ మార్పు కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తే, మరి కొన్ని రాశుల వారికి కష్టాలను తెచ్చిపెడుతుంది. శని దోష నివారణకు కొన్ని పూజలను ఆచరిస్తే మంచి ఫలితం దక్కుతుంది. ఉగాది నుంచి మార్చి 29న శనీశ్వరుడు కుంభరాశి నుంచి మీన రాశిలోకి మారడం జరుగుతుంది. అందరూ ఎంతగానో భయపడే శనీశ్వరుడు రాశి మారినప్పుడల్లా దేశవ్యాప్తంగా పూజలు, పరిహారాలతో శనిని శాంతింప చేయడం జరుగుతుంది. 2 1/2 ఏళ్ల పాటు మీన రాశిలో కొనసాగే శని ప్రభావం వివిధ రాశుల వారి జీవితాల మీద బాగా కనిపించే అవకాశం ఉంది. శని రాశి మారడం మన్నది కొన్ని రాశులకు మోదం కాగా కొన్ని రాశులకు కేదంగా ఉంటుంది. ఏ ఏ రాశులకు ఈ ఏడాది శని ఫలితాలను ఇవ్వబోతున్నాడో తెలుసుకుందాం…

Ugadi Rashi Phala 2025 : ఉగాది తరువాత శని స్థాన మార్పు ఏ రాశి వారికి లాభం… ఎవరికి నష్టం… తెలుసుకోండి…?
ugadi rashi phala 2025 మేషం
ఈ రాశి వేయ స్థానంలోకి శనీశ్వరుడు ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం అవుతుంది. దీని ఫలితంగా ప్రతి విషయం లోను గేయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువ పెడతారు. తరచూ అనారోగ్యాలకు వైద్య ఖర్చులు పెరగటానికి అవకాశం ఉంది. దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించడం. దూర ప్రాంతానికి బదిలీ కావడం వంటివి జరుగుతాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం వృద్ధి చెందకపోతే, రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందదు.
వృషభ రాశి : రాశి వారికి లాభ స్థానంలో శని ప్రవేశం వల్ల అనేక విధాలుగా అదృష్టాలు కలుగుతాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందడం. ఉద్యోగంలో పదోన్నతులు లభించడం. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరగటం వంటివి తప్పకుండా జరుగుతాయి. విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న నిరుద్యోగులు కల నెరవేరుతుంది. సొంత ఇల్లు అమరుతుంది. భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. విద్యార్థులు రికార్డు స్థాయిలో విజయాలు సాధిస్తారు.
మిధున రాశి : ఈ రాశికి దశమ స్థానంలో శని సంచారం వల్ల కొత్త ఉద్యోగాలకు ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగులకు పదోన్నతులు కలుగుతాయి. ఉద్యోగులకు విదేశాలలో ఉద్యోగం సంపాద సంపాదించాలనుకుంటారు. మరింత మంచి ఉద్యోగంలోకి మారటానికి ఉద్యోగులకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు కూడా ఏర్పడతాయి. పేరు ప్రఖ్యాతలు విస్థరిస్తాయి. పిత్రార్జితం లభించే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
కర్కాటక రాశి : ఈ రాశికి నవమ స్థానంలోని శని ప్రవేశం వల్ల అష్టమ శని దోషం తొలగిపోయి కొన్ని కష్టనష్టాలనుంచి బయటపడడం జరుగుతుంది. ఆదాయ వృత్తి తో పాటు ఆశించిన పురోగతి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఆదాయ ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. ఎప్పటినుంచో గృహ నిర్మాణ కళ నెరవేరుతుంది. వివాదాలు కోర్టు కేసులో బాగా అనుకూలంగా పరిష్కరించబడతాయి.
సింహరాశి : ఈ రాశికి శని మీన రాశి ప్రవేశంతో అష్టమ శని ప్రారంభం అవుతుంది. దీనివల్ల ప్రతి పని ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో ఊహించిన సమస్యలు తలెత్తుతాయి. రావలసిన డబ్బు ఒక పట్టాన చేతికి అందదు. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలలో నష్టాలు కలుగుతాయి. ఉద్యోగంలో శ్రమాధిక్యత ఎక్కువగా ఉంటుంది. వృత్తి,వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యమైన ప్రయత్నాల్లో శ్రమ, తిప్పట తప్పకపోవచ్చు.
కన్యారాశి : ఈ రాశి వారికి సప్తమ స్థానంలో శని సంచారం వల్ల ఇంట్లో ఈగల మోత బయట పల్లకిలో మోత అన్నట్లు ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత పదవులు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో శ్రమ పెరిగినా కూడా లాభాలను చవిచూస్తారు. రాజకీయంగా ప్రాబల్యం పెరుగుతుంది. అయితే, పెళ్లి సంబంధాలు చివరిదాకా వచ్చి వెనక్కు వెళ్లడం జరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. జీవిత భాగస్వామితో చిన్నాచితక సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉంటుంది.
తులారాశి : ఈ రాశికి ఆరవ స్థానంలో శని సంచారం ప్రారంభం అవుతున్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రభావం, ప్రాధాన్యంగా బాగా పెరుగుతుంది. అధికార యోగం పట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారాలు కూడా ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. ప్రతిభా పాట వాళ్లకు,సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కరించబడతాయి. ఉద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు వస్తాయి.
వృశ్చిక రాశి :
శని మీన రాశిలోకి మారడంతో ఈ రాశి వారు రెండున్నరలుగా భరిస్తున్న అర్ధాష్టమ శని కష్టాల నుంచి బయటపడడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. పదోన్నతులు కలుగుతాయి. ఆదాయం బాగా అభివృద్ధి చెందుతుంది. ఒక ప్రణాళిక ప్రకారం ఆర్థిక సమస్యను పరిష్కరించుకోవడం జరుగుతుంది. పని భారం, వ్యయ ప్రయాసలు, కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిడి వంటి వాటి నుంచి విముక్తి లభిస్తుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది.
ధనస్సు రాశి : ఈ రాశి వారికి చతుర్ధ స్థానంలో శని ప్రవేశం వల్ల అర్ధాష్టమి దోష ప్రారంభం అవుతుంది. దీనివల్ల సుఖ సంతోషాలకు బ్రేక్ పడుతుంది. ఆస్తిపాస్తులకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. గృహ, వాహన ప్రయత్నాలకు ఆటంకాలు ఏర్పడతాయి. తల్లి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు తగ్గుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. ఆదాయ ప్రయత్నాలు నిదానంగా ముందుకు సాగుతాయి. కర్చులు బాగా పెరుగుతాయి.
మకర రాశి : ఈ రాశి వారికి ఏలినాటి శని దోషం తొలగిపోవడం వల్ల అనేక మార్గాలలో ఆదాయం బాగా పెరుగుతుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఆకస్మిక ధనప్రాప్తికి కూడా అవకాశం ఉంటుంది. ఏ ప్రయత్నం తలపెట్టిన విజయవంతం అవుతుంది. ఉద్యోగంలో హోదాలు పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు గనిస్తారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థిక, అనారోగ్య, వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది.
కుంభరాశి : శని మీన రాశి ప్రవేశంతో ఈ రాశి వారికి మూడవ దశ ఏలినాటి శని ప్రారంభమవుతుంది. దీనివల్ల ఆర్థిక సమస్యలు కలుగుతాయి. కావలసిన డబ్బు ఒక పట్టాన చేతికి అందకపోగా, ధనాధాయం బాగా తగ్గిపోతుంది. డబ్బు తీసుకున్న డబ్బు, ఇచ్చిన ఇబ్బందులు పడతారు. కుటుంబంలో చికాకులు తలెత్తుతాయి. శుభకార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు తగ్గుతాయి. ఉద్యోగ జీవితంలో శ్రమకు ఎక్కువ, ఫలితం తక్కువ ఉంటుంది.
మీన రాశి : ఈ రాశిలో శని ప్రవేశం రెండవ దశ ఎలినాటి శని ప్రారంభమవుతుంది. కొద్దిగా వీరిని అనారోగ్య సమస్యలు పీడించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో ప్రభావం తగ్గుతుంది. వృత్తి, వ్యాపారాల్లో సమస్యలు తలెత్తుతాయి. ప్రయాణాల వల్ల నష్టాలు తప్ప లాభాలు కలిగే అవకాశాలు ఉండవు. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు ఆటంకాలు,ఎక్కువగా ఉంటాయి. విజయాలు, సాఫల్యాలు బాగా తగ్గిపోతాయి. ప్రతి పనికి బాగా శ్రమ పడాల్సి వస్తుంది. ఏ పని తలపెట్టిన వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.
ముఖ్యమైన పరిహారాలు: శనీశ్వరుడు మీన రాశిలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా 12 రాశుల వారు శనికి తైలాభిషేకం చేయించడం. శివునికి అభిషేకం చేయించడం, నీలం లేదా నలుపు రంగు కలిపిన దుస్తులు నిదరించడం. ఇంద్రనీలం ఒదిగిన ఉంగరాన్ని ధరించడం వంటివి చేయడం వల్ల శని దోషం బాగా తగ్గుతుంది. ఏ విధంగాను ధరించకపోవడం మంచిది. శనిని దూషించే పక్షంలో అతని బలం పెరిగి,కష్టనష్టాలు వృద్ధి చెందుతాయి. శనీశ్వరుని ఏదో విధంగా స్తుతించడం వల్ల ప్రతికూలతలు తగ్గి సానుకూలతలు బాగా పెరుగుతాయి.