Thamalapakulu : మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉన్నాయా.. వాటితో పాటు మీరు చేస్తున్న వ్యాపారంలోనూ నష్టాలు వస్తున్నాయా.. ఏం చేసినా లాభాలకు బదులు నష్టాలు వస్తూ సమస్యలు ఏర్పడుతున్నాయా..! అయితే మీరు ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఇంట్లో ఉన్న కష్టాలు అన్నీ తొలగిపోయి లక్ష్మీ దేవి మీ ఇంట్లో శివతాండవం చేయాలంటే కచ్చితంగా తమలపాకులు వాడాల్సిందే. అయితే హిందూ సంప్రదాయాల ప్రకారం ఎంతో ప్రాముఖ్యత ఉన్న తమలపాకులు ఎక్కువగా మన ఇంటి పెరట్లోనే… లేదా ఇంట్లోనే కనిపిస్తూనే ఉంటాయి. అంతే కాకుండా ఇంట్లో ఎలాంటి పూజలు, వ్రతాలు చేసినా తమలపాకులను తప్పనిసరిగా వాడుతుంటాం.ఈ సంప్రదాయం ఇప్పుడిప్పుడు వచ్చిందే కాదండోయ్. క్షీర సాగర మథన సమయంలోనే దేవతలు తమలపాకులను ఉపయోగించిన శ్రీ మహా విష్ణువుని పూజించారని తెలుస్తోంది.
ఆంజనేయ స్వామికి కూడా తమలపాకులు ఎంతో ప్రీతి పాత్రం. తమలపాకులతో తయారు చేసిన మాల అంటే… ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం అంట. అయితే హనుమంతుడికి పూజ చేస్తే మాత్రం కచ్చితంగా అందులో తమలపాకులు ఉండాల్సిందే. అంతే కాదు ఆ అంజన్నకు సింధూరం పెడ్తున్నప్పుడు కూడా తమలపాకుల మాల వేస్తుంటారు చాలా మంది. ఇలా తమలపాకులతో ఆంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకుంటే ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితులు తీరుతాయంట. అలాగే వ్యాపారంలో వృద్ధి కూడా జరుగుతుందట. అలాగే మంగళ వారం లేదా శనివారం ఉదయం హనుమాన్ ఆలయానికి వెళ్లి తమలపాకులతో పూజ నిర్వహించాలి. తద్వారా అన్ని కష్టాలు తొలగిపోతాయి.
అయితే తమలపాకులు ఉపయోగించడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే అలాంటి సత్ఫలితాలనిచ్చే… తమలపాకుల తీగను ఇంట్లో పెట్టుకున్నా.. వ్యాపారం చేసే ప్రాంతాల్లో పెట్టుకున్నా చాలా మంచి జరుగుతుదట. అలా పెట్టుకోవడం వీలు కాని వారు పెసర ఆకులు, తమలపాకులతో దండలు తయారు చేసి, దానిని తూర్పు దిక్కున కట్టాలంట. ప్రతి శనివారం లేగా మంగళ వారం ఈ దండను మార్చాలి. అలాగే ఈ పాత దండను పారే నీళ్లలో పడేయాలని.. పెద్దలు చెబుతుంటారు. ఇలా ఐదు శనివారాలు చేయడం వల్ల వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయని పండితులు చెబుతున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.