Thamalapakulu : ఇంట్లో ఉండే తమలపాకులతో… ఆర్థిక సమస్యలకు చెక్! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Thamalapakulu : ఇంట్లో ఉండే తమలపాకులతో… ఆర్థిక సమస్యలకు చెక్!

 Authored By pavan | The Telugu News | Updated on :19 February 2022,7:00 am

Thamalapakulu : మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉన్నాయా.. వాటితో పాటు మీరు చేస్తున్న వ్యాపారంలోనూ నష్టాలు వస్తున్నాయా.. ఏం చేసినా లాభాలకు బదులు నష్టాలు వస్తూ సమస్యలు ఏర్పడుతున్నాయా..! అయితే మీరు ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఇంట్లో ఉన్న కష్టాలు అన్నీ తొలగిపోయి లక్ష్మీ దేవి మీ ఇంట్లో శివతాండవం చేయాలంటే కచ్చితంగా తమలపాకులు వాడాల్సిందే. అయితే హిందూ సంప్రదాయాల ప్రకారం ఎంతో ప్రాముఖ్యత ఉన్న తమలపాకులు ఎక్కువగా మన ఇంటి పెరట్లోనే… లేదా ఇంట్లోనే కనిపిస్తూనే ఉంటాయి. అంతే కాకుండా ఇంట్లో ఎలాంటి పూజలు, వ్రతాలు చేసినా తమలపాకులను తప్పనిసరిగా వాడుతుంటాం.ఈ సంప్రదాయం ఇప్పుడిప్పుడు వచ్చిందే కాదండోయ్. క్షీర సాగర మథన సమయంలోనే దేవతలు తమలపాకులను ఉపయోగించిన శ్రీ మహా విష్ణువుని పూజించారని తెలుస్తోంది.

ఆంజనేయ స్వామికి కూడా తమలపాకులు ఎంతో ప్రీతి పాత్రం. తమలపాకులతో తయారు చేసిన మాల అంటే… ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం అంట. అయితే హనుమంతుడికి పూజ చేస్తే మాత్రం కచ్చితంగా అందులో తమలపాకులు ఉండాల్సిందే. అంతే కాదు ఆ అంజన్నకు సింధూరం పెడ్తున్నప్పుడు కూడా తమలపాకుల మాల వేస్తుంటారు చాలా మంది. ఇలా తమలపాకులతో ఆంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకుంటే ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితులు తీరుతాయంట. అలాగే వ్యాపారంలో వృద్ధి కూడా జరుగుతుందట. అలాగే మంగళ వారం లేదా శనివారం ఉదయం హనుమాన్ ఆలయానికి వెళ్లి తమలపాకులతో పూజ నిర్వహించాలి. తద్వారా అన్ని కష్టాలు తొలగిపోతాయి.

use thamalapakulu for good wealth

use thamalapakulu for good wealth

అయితే తమలపాకులు ఉపయోగించడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.   అయితే అలాంటి సత్ఫలితాలనిచ్చే… తమలపాకుల తీగను ఇంట్లో పెట్టుకున్నా.. వ్యాపారం చేసే ప్రాంతాల్లో పెట్టుకున్నా చాలా మంచి జరుగుతుదట. అలా పెట్టుకోవడం వీలు కాని వారు పెసర ఆకులు, తమలపాకులతో దండలు తయారు చేసి, దానిని తూర్పు దిక్కున కట్టాలంట. ప్రతి శనివారం లేగా మంగళ వారం ఈ దండను మార్చాలి. అలాగే ఈ పాత దండను పారే నీళ్లలో పడేయాలని.. పెద్దలు చెబుతుంటారు. ఇలా ఐదు శనివారాలు చేయడం వల్ల వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయని పండితులు చెబుతున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది