Vastu tips aare chettu remove naradhisti in our home
Vastu Tips : చాలామంది ఇంట్లో వాస్తు దోషాలను తొలగించుకోవడానికి, నర దిష్టి తగలకుండా ఉండటానికి వివిధ రకాల చెట్లను పెంచుతారు. అలాగే కొంతమంది కొన్ని చెట్ల బెరడులను కూడా ఇంటి గుమ్మానికి తగిలిస్తుంటారు. ఇలా చేస్తే నరదిష్టి వాస్తు, దోషాలు తొలగిపోతాయని నమ్మకం. అలాంటి చెట్లలో ఒకటే ఈ ఆరె చెట్టు. ఈ చెట్లు ఎక్కువగా రోడ్లకు ఇరువైపులా, అడవుల దగ్గర పెరుగుతాయి. ఈ ఆరె చెట్టు ఆకులు, బెరడు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఆయుర్వేద శాస్త్ర ప్రకారం ఈ ఆరె చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ చెట్టుతో ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలను తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా, ఈ ఆరెచెట్టుకు జ్యోతిష్య శాస్త్రంలో కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ చెట్టును గ్రామాలలో చాలామంది ఇళ్లల్లో పెంచుకుంటారు. ఈ చెట్టుతో ఇంట్లోని కొన్ని సమస్యలను తగ్గించుకోవచ్చు అని వారి నమ్మకం.
ఈ ఆరె చెట్టు వలన మన ఇంటికి కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం… ఈ ఆరె చెట్టు కర్రను ఇంటి ప్రధాన ద్వారానికి కట్టడం వలన ఇంట్లోకి ఎటువంటి చెడు శక్తులు రావని నమ్మకం. ఇంట్లో ఏదైనా నెగటివ్ ఎనర్జీ కనుక ఉంటే ఈ ఆరె కర్రను పెట్టడం వలన దుష్ట శక్తులు నశించిపోతాయి. ఇంట్లోకి ఎటువంటి చెడు శక్తులు రాకుండా ఈ ఆరె చెట్టు కర్ర సహాయపడుతుంది. మన పూర్వీకులు ఇంట్లో పుట్టిన పిల్లలు ఉంటే వారికి నరదిష్టి తగలకుండా ఉండటానికి ఈ ఆరె కర్రను ఇంట్లో పెట్టుకునేవారు. దీనివలన పిల్లలు ఎటువంటి అసౌకర్యానికి గురికారని పెద్దల నమ్మకం. అలాగే పూర్వం ఈ చెట్టు వేర్లను మెడలో తాయత్తుగా ధరించేవారు. ఇలా ధరించడం వలన దిష్టి తగలకుండా ఉంటుందని, అలాగే ఇంట్లోని కుటుంబీకులు ఆరోగ్యంగా ఉంటారని నమ్మేవారు.
Vastu tips aare chettu remove naradhisti in our home
అలాగే గ్రహ దోషం ఉంటే ఆరె కర్రతో తాయత్తు కట్టుకోవడం వలన గ్రహదోషాలు తొలగిపోతాయంట. అలాగే వారికి గ్రహబలం చేకూరుతుంది. అంతేకాకుండా, ఈ ఆరె కర్రను ఇంట్లోకి తెచ్చి పూజించడం వలన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి ఇంట్లోని వారు సుఖసంతోషాలతో జీవిస్తారు. అలాగే ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆరె చెట్టును పూజించే వారి ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు అని కొందరి నమ్మకం. ఈ ఆరె చెట్టు లో మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ చెట్టు గింజలు కీళ్ళ నొప్పులను నివారించడానికి బాగా సహాయపడుతాయి. కీళ్ల నొప్పులు ఉన్నవారు ఈ చెట్టు గింజలను వేడినీళ్లతో నూరి ఉదయం, సాయంత్రం ఆయింట్మెంట్ లాగా రాయటం వలన కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అలాగే కడుపు నొప్పితో బాధపడేవారు ఆరె చెట్టు ఆకులను మరీ మెత్తగా కాకుండా మామూలుగా నూరి కొద్దిగా ఆముదం వేసి బాగా కలిపి ఒక క్లాత్ లో కట్టి పొట్టపై కాపడం వలన కడుపునొప్పి తగ్గుతుంది.
అలాగే తలనొప్పి ఉన్నవారు నుదిటికి ఈ పేస్టు రాయటం వలన నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. క్షయ వ్యాధితో బాధపడేవారు 20 గ్రాముల ఆరె చెట్టు బెరడును ఒక గ్లాసు నీటిలో వేసి పావు వంతు మిగిలే వరకు మరిగించి వడ కట్టాక వచ్చిన కషాయాన్ని రోజు త్రాగడం వలన క్షయవ్యాధి క్రమంగా తగ్గుతుంది. అంతేకాకుండా, నీళ్ల విరేచనాలు కూడా తగ్గుతాయి. చెట్టు బెరడును పేస్టులాగా నూరి దెబ్బ తగిలిన చోట రాస్తే గాయాలు త్వరగా మానుతాయి. అలాగే దంతసమస్యలు ఉన్నవారు ఈ పేస్ట్ తో పళ్ళను రుద్దుకోవడం వలన దంత సమస్యలు తొలగిపోతాయి. ఆరె చెట్టు పూలతో కషాయం చేసుకొని త్రాగటం వలన జలుబు తగ్గుతుంది. ఈ ఆరె చెట్టు వేరుతో కషాయం త్రాగటం వలన జీర్ణ సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. ఈ విధంగా ఆరె చెట్టు వలన ఆరోగ్యపరంగాను, వాస్తు ప్రకారం గాను ఇన్ని లాభాలు ఉన్నాయి.
Vivo | స్మార్ట్ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.