Home » Devotional » Vastu Tips For Hibiscus Plant Know The Health Benefits
Devotional

Hibiscus Plant : సూర్యుడికి ఈ మందార పువ్వులతో ఇలా పూజ చేయడం వల‌న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి…

Authored By
Jyothi
The Telugu News | Published on: July 3, 2022, 7:00 am
Advertisement

Hibiscus Plant : ఎర్రమందారం పూలు దేవుళ్లకు ఎంతో ప్రీతికరమైనవి ఈ పువ్వులతో దేవుళ్లను పూజిస్తూ ఉంటారు ఈ మందార పూలు అంటే లక్ష్మీదేవి కి దుర్గ మాతకు ఎంతో ఇష్టం ఈ పువ్వులతో పూజ చేస్తే అమ్మవార్ల అనుగ్రహం కలుగుతుంది. ఈ మందారపు చెట్టు వాస్తు ప్రకారంగా ఇంట్లో నాటడం వల్ల గ్రహ దోషాలు, గ్రహ పీడలు తొలిగిపోతాయి అంటున్నారు వాస్తు నిపుణులు అలాగే ఈ మందార మొక్క మన ఇంట్లో ఉండడం వలన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే కుటుంబ కలహాలు కూడా తొలగిపోతాయి మంచి ప్రశాంతతను అనుకూలిస్తుంది ఈ మొక్క ఇంట్లో ఉండటం వలన అన్ని శుభఫలితాలకు దారితీస్తుంది.

Advertisement

అయితే కొందరు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలాంటివారు ఈ మందార పువ్వులతో ఇలా చేయండి. అనారోగ్యంతో బాధపడేవారు ఆరు బయట ఒక పాత్ర‌లో నీరును పోసి దానిలో ఏడు మందార పువ్వులను వేసి కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసి సూర్యుడికి అనుగుణంగా ఉంచి ఆయనకు ఆర్ద్యం సమర్పించాలి . నిటారుగా నిలబడి సూర్యుడు వైపు చూస్తూ దండం పెడుతూ ఆయనను వేడుకోవాలి ఇలా 15 రోజులు చేయడం వలన ఆయన అనుగ్రహం కలుగుతుంది ఎంతో శక్తివంతమైన సూర్యుడు నీకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. సూర్యుడు మీ జాతకంలో బలంగా తయారవుతాడు.

vastu tips for Hibiscus Plant know the Health benefits

Advertisement

ఇలా బయట చేయలేని వారు ఇంట్లోనే సూర్య భగవాని పటం తెచ్చుకొని దాని వద్ద ఇదేవిధంగా చేయవచ్చు ఇలా చేయడం ఎంతో మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఈ మందారం మొక్కను తూర్పు దిశగా నాటడం చాలా శ్రేయస్కరం ఇలా నాటడం వల్ల వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగిపోతుంది ఈ మందార పువ్వుని మన తలలో అలంకరించిన మన బాడీలో నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే హనుమంతునికి దుర్గాదేవికి లక్ష్మీదేవికి ఈ పూలతో పూజ చేయడం వలన ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. ఇలాంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్న ఈ మందార మొక్కను మనం ఇంట్లో నాటుకుందాం. ఈ పూలతో సూర్యభగవాన్ని ఆరాధిద్దాం.

Jyothi

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి