Vastu Tips For Main Door : మీ ఇంటికి నరదిష్టి, ప్రతికూల శక్తులు తొలగించేందుకు…ప్రధాన ద్వారం ముందు వీటిని వేలాడదీయండి…?
ప్రధానాంశాలు:
Vastu Tips For Main Door : మీ ఇంటికి నరదిష్టి, ప్రతికూల శక్తులు తొలగించేందుకు...ప్రధాన ద్వారం ముందు వీటిని వేలాడదీయండి...?
Vastu Tips For Main Door : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి కొన్ని వస్తువులను ఉంచితే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. ఇంట్లో ఆనందం శాంతి సానుకూలతలు ఉండాలనుకునేవారు ఇంట్లో మంచి వాతావరణం ఉండాలనుకుంటే వాస్తు శాస్త్రంలో ఫేంగ్ షుయ్ లో కూడా కొన్ని నివారణలు సూచించబడ్డాయి. ఏంటి ప్రధాన గుమ్మం వద్ద ఇవి పెట్టినట్లయితే ఇంట్లో ప్రతికూల శక్తులు దూరం చేయవచ్చు..అలాగే ఇంట్లో ఆనందాన్ని,శ్రేయస్సును, సంపదను వృద్ధి చేయాలంటే ఇది చేయండి. భారతీయ వాస్తు శాస్త్రాలలో పురాణ గ్రంథాలలో ఇంటి ప్రధాన ద్వారానికే ప్రత్యేక ప్రాముఖ్యతను తెలియజేయడం జరిగింది. ఇంట్లోకి ప్రధాన గుమ్మం నుంచి వచ్చే శక్తి ప్రవేశం,శుభ, అశుభాషక్తుల ప్రభావం ఇవన్నీ,ఇంటి ప్రధాన గుమ్మం నుంచే ప్రారంభమై ఇంట్లోకి ప్రవేశిస్తాయి. అయితే వాస్తు శాస్త్రం ప్రధాన ద్వారం దగ్గర ఈ వస్తువులను ఉంచినట్లయితే మీ ఇంట్లోకి సానుకూల శక్తులు ప్రవేశించి ప్రతికూల శక్తులు బయటికి వెళ్లిపోతాయి. అలాగే ప్రతికూల శక్తులను ఇంట్లోనికి ప్రవేశించనియ్యదు. మీ ప్రధాన ద్వారం పై వీటిని వేలాడదీస్తే,మీ ఇంట్లో ఆనందం,శాంతి, శ్రేయస్సులు,సిరిసంపదలు కాపాడే ఐదు అద్భుత విషయాలు గురించి తెలుసుకుందాం…

Vastu Tips For Main Door : మీ ఇంటికి నరదిష్టి, ప్రతికూల శక్తులు తొలగించేందుకు…ప్రధాన ద్వారం ముందు వీటిని వేలాడదీయండి…?
ఇంటి ప్రధాన ద్వారానికి మొదట మామిడి తోరణాలు కట్టడం శ్రేయస్కరం. ప్రధాన ద్వారానికి తోరణం కట్టడం హిందూ సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన భాగం. మామిడి ఆకులు,అశోక ఆకులు, బంతి పువ్వులతో తయారుచేసిన తోరణం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ఆకులు పువ్వులను ఇంట్లోనే ప్రధాన గుమ్మానికి వేలాడదీస్తే,ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది. ఇంట్లోనికి సానుకూల శక్తిని ఆకర్షిస్తాయి. ఇంట్లో పండుగ ఉల్లాస వాతావరణం కూడా సృష్టిస్తుంది.ఈ వస్తువులు పర్యావరణాన్ని శుద్ధి చేస్తాయి. అతిథులను స్వాగతించుటకు దీనిని నమ్ముతారు.
Vastu Tips For Main Door గుర్రపు నాడ లేదా U ఆకారం
ముఖ్యంగా గుర్రపు నాడ వాస్తు, ఫేంగ్ షుయ్ రెండిటిలోనూ నల్ల గుర్రపు నాడ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడింది. ప్రధాన ద్వారానికి పైన U ఆకారంలో వేలాడదీయడం ద్వారా,ఇంటికి చెడు దృష్టి,ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించవు.అంతేకాక, సంపద,శ్రేయస్సును ఆకర్షిస్తాయి. దీని నుంచి పూర్తి ప్రయోజనాలను పొందగలిగే గుర్రపు నాడను సరైన దిశలో సరైన పద్ధతిలో ఇంటికి అమర్చాలి.
స్వస్తిక్ : ఇంటికి స్వస్థకు చిహ్నం హిందూమతంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. స్వస్తిక్ చిహ్నం పవిత్రమైనది. ఇది ఎంతో శుభప్రదమైన చిహ్నం. ఈ ప్రధాన ద్వారానికి ఇరువైపులా లేదా తలుపుల పైన స్వస్తిక్ ని ఉంచితే ఇంట్లోకి సానుకూల శక్తులు ప్రవేశిస్తాయి. ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. ఇంకా శ్రేయస్సు, అదృష్టం,శాంతి చిహ్నం, స్వస్తిక్ ప్రతికూల శక్తులను తరిమివేసి ఇంట్లోకి శాంతిని ఆనందాన్ని తెచ్చిపెడుతుంది. కుంకుమ లేదా గంధంతో ఇంటి తలుపుల పైన స్వస్తిక్ గుర్తు వేయడం చేత చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
విండ్ చైమ్ లోహం : విండ్ చైములోహం లేదా వెదురుతో తయారుచేసిన విండ్ చైమ్ మధురమైన శబ్దం ఇంటికి వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. వాతావరణంని శుద్ధి చేస్తుంది. సానుకూల శక్తిని ప్రవేశింప చేస్తుంది. ప్రధాన తలుపు దగ్గర వెండి చైమ్ ను ఉంచితే ప్రతికూల శక్తి ఇంటిలోకి ప్రవేశించదు. శక్తుల ప్రభావం తగ్గించి టీంక్లింగ్ శబ్దం, ఇంట్లో సానుకూల ప్రకంపనలను సృష్టిస్తుంది. మనసును ప్రశాంతంగానూ, హాయిగా ఉంచుతుంది. విండ్ చైమ్ ను ఎంచుకునేటప్పుడు దాని తయారు చేసిన వస్తువులు, వచ్చే ధ్వని పై శ్రద్ధ చూపటం ముఖ్యం.
శుభప్రదమైన యంత్రం లేదా గణేశ విగ్రహం, లక్ష్మీదేవి యంత్రాన్ని ప్రధాన ద్వారం ముందట ఉంచడం చాలా శుభప్రదం. గణేశుడు విజ్ఞానను హరింప చేసేవాడు. గణేశుడు ఇంట్లోకి వచ్చే అన్ని అడ్డంకులను తొలగిస్తాడు. లక్ష్మీదేవి, సంపద, శ్రేయస్సు, దేవత ఆమె ఉనికి ఇంట్లో ఆనందం శ్రేయస్సు ఇంకా శాంతిని తెస్తుంది. విగ్రహం లేదా యంత్రాన్ని శుభ్రంగా ఉంచే క్రమం తప్పకుండా పూజించాలని గుర్తుంచుకోండి. ఇంటి ప్రధాన ద్వారా వద్ద ఈ వస్తువులను వేలాడదీస్తే,ఇంట్లో సానుకూల శక్తులు ప్రవేశించవు. ప్రతికూల శక్తులు దూరంగా ఉంచబడతాయి. మీఇంటికి భద్రతను అందించటమే కాదు, నరదృష్టి నుంచి కాపాడబడుతుంది.