Vastu Tips : అన్ని వాస్తు దోషాలకు సరైన మొక్క ఇది.. ఈ దిశలో నాటారంటే..
Vastu Tips : సాలీడు మొక్క చాలా మంది ఇళ్లల్లో తరచుగా కనిపిస్తూ ఉంటుంది. ఇది చూడడానికి చిన్నగా చాలా అందంగా కనిపిస్తుంది. ఈ మొక్క ఎయిర్ ప్యూరిఫైయర్ లాగా పనిచేస్తుందని సైన్స్ నమ్ముతుంది. ఈ మొక్క వాస్తులో మాత్రమే కాదు జ్యోతిష్య శాస్త్రంలో కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. చాలామంది తమ ఇంటిని అందంగా మార్చుకోవడానికి వివిధ రకాల వస్తువులతో అలంకరిస్తారు. అలా ఇళ్లను అలంకరించుకోవడానికి మొక్కలను ఇంటి పరిసరాలు చుట్టూ నాటుతారు. చెట్ల మొక్కలతో ఇంటి పరిసరాలను శుభ్రం చేయడమే కాకుండా ఇంట్లోనే కుటుంబీకులు ఆనందంగా ఉంటారని వాస్తు శాస్త్రం చెబుతుంది. వాస్తు ప్రకారం ఇంట్లో వాటిని నాటడం ద్వారా ఆనందం, శ్రేయస్సు పొందే కొన్ని మొక్కలు ఉన్నాయి.
ఈ మొక్కలు నాటడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ప్రభావం పెరుగుతుంది. స్పైడర్ ప్లాంట్ మొక్క ను ఇంట్లో నాటుకుంటే వాస్తు ప్రకారం గా చాలా మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఈ మొక్క వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. అలాగే ఈ మొక్కను సరైన దిశలో పెట్టడం వలన ఇంకా మంచి జరుగుతుందని నిపుణులు అంటున్నారు. వాస్తు శాస్త్రంలో ఇంట్లో వస్తువులను ఏ దిశలో ఉంచాలో కనుగొన్నారు. అయితే ఈ సాలిడ్ మొక్కను పెంచడానికి ఇంటికి ఉత్తరం, తూర్పు, ఈశాన్యం లేదా వాయువ్య దిశలో ఉత్తమమని వాస్తు శాస్త్రంలో చెప్పారు. వాస్తు ప్రకారం ఇంటి లోపల మొక్కలు నాటడానికి ఈ దిశలో ఉత్తమమైనవి అని పేర్కొన్నారు.
ఈ మొక్క ఇంటిలోని నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని ప్రవేశింప చేస్తుంది. ఈ మొక్కను వంటగదిలో, ఇంటి గదిలో, బాల్కనీలో లేదా స్టడీ రూమ్ లో అయినా ఉంచవచ్చు. అలాగే ఈ మొక్కను ఆఫీసులో, బిజినెస్ స్థలంలో ఉంచాలనుకుంటే ఈ మొక్కను ఆఫీస్ లోని డెస్క్ పై ఉంచవచ్చు. ఈ మొక్క ఇంట్లో పెంచుకుంటే ఎప్పుడు ఎండిపోకుండా చూసుకోవాలి. ఒకవేళ ఎండిపోతే వెంటనే దానిని తొలగించి కొత్త మొక్కను నాటాలి. అంతేకాకుండా సాలీడు మొక్కను ఇంటికి దక్షిణం, పడమర దిక్కులలో ఉంచకూడదు. ఇలా ఉంచితే ఆ శుభ ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ దిశలో సాలిడ్ మొక్కను పెంచకుండా ఉండడం మంచిది.