Vastu Tips : ఈ విగ్రహం పడక గదిలో ఉంచితే.. వైవాహిక జీవితానికి ఎంత నష్టమో తెలుసా మీకు…!!
Vastu Tips ; ప్రతి ఒక్కరు ఇల్లు కట్టేటప్పుడు వాస్తు ప్రకారం గా ఇల్లుని నిర్మిస్తూ ఉంటారు. అయితే పడగది స్థానాన్ని నిర్ణయించడంలో వాస్తు ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటుంది. పడక గదిలో మీరు తలపెట్టే దిశ మంచాన్ని ఉంచే దిశ విషయాలలో వాస్తు పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అదేవిధంగా పడక గదిలో ఏముంచాలి. ఏముంచకూడదు.? అనే విషయాలు కూడా వాస్తు శాస్త్రం తెలుపుతోంది. పడక గదిలో ఈ విగ్రహం ఉంటే అది వైవాహిక జీవితానికి మంచిది కాదు అని జ్యోతిష్యులు తెలియజేస్తున్నారు..
వాస్తు ప్రకారం దంపతులు ఉండే పడక గదిలో రాధాకృష్ణ విగ్రహాన్ని ఉంచకూడదట. నిజానికి రాధాకృష్ణులను ప్రేమకు చిహ్నంగా భావిస్తారు.. అయితే పడక గదిలో వీరి విగ్రహం ఉంచడం వలన కష్టాలు తప్పవట.. ఇంకొక వైపు ఒత్తిడి ,చిరాకు లేకుండా ప్రశాంతంగా నిద్రపోవడానికి పడకగది కొరకు వాస్తు దోహదపడుతుంది. ఒక గదిని నిర్మించేటప్పుడు వాస్తు అనేక విషయాన్ని పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. బెడ్రూంలో గోపికల బొమ్మను కూడా ఉంచవద్దని జ్యోతిష్యులు తెలియజేస్తున్నారు. రాధాకృష్ణుల విగ్రహం లేదా చిత్రాన్ని బదులుగా
మీ మాస్టర్ బెడ్ రూమ్ కు నైరుతిలో మీ భాగస్వామి అందమైన ఫోటోను ఉంచితే మంచిదని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు.. రాధాకృష్ణుల విగ్రహాన్ని పడకగదిలో ఉంచడం వలన వివా హేతర సంబంధం కూడా ఏర్పడుతుందని చెప్తున్నారు. అలాగే కొత్తగా పెళ్లయిన జంటకు ఈ గ్రహాన్ని ఎప్పుడు బహుమతిగా ఇవ్వకూడదట. రాధాకృష్ణ వివాహం చేసుకోలేదు కాబట్టి వారిద్దరు ఉన్న గిఫ్ట్ ఇవ్వకపోవడమే మంచిదని జ్యోతిష్యం నిపుణులు చెప్తున్నారు. కావున పడకగదిలో అస్సలు రాధాకృష్ణ ఫోటోలు పెట్టకపోవడం వైవాహిక జీవితానికి చాలా మంచిది.