Vastu Tips : ఆహారం ఈ దిశలో కూర్చుని తింటే ఏమవుతుందో తెలుసా…?
Vastu Tips : ఒక వ్యక్తికి శ్వాస తర్వాత ఆహారం చాలా ముఖ్యమైనది. దాని ద్వారానే తన మనుగడను కొనసాగిస్తాడు. ప్రతిరోజు ఆహారం తీసుకోవడం వలన మనిషికి శక్తి, బలం చేకూరుతుంది. ఏ పని చేయాలన్నా శక్తి అనేది శరీరంలో ఉండాలి. ఆ శక్తి అనేది లేకపోతే మనిషి ఏ పనిని నిర్వర్తించలేడు. కనుక ప్రతిరోజు ఆహారాన్ని తప్పకుండా తీసుకుంటాడు. అందుకు ఆహారంపై శ్రద్ధ వహిస్తాడు. మంచి పోషకాలు గల ఆహారాన్ని తీసుకుంటూ, సరైన సమయానికి తీసుకుంటూ ఉంటాడు. అలాగే చాలామంది ఆహారాన్ని తీసుకునేటప్పుడు ఎటువంటి నియమాలను పాటించరు. వాస్తు ప్రకారం ఆహారం విషయంలో కొన్ని నియమాలను పాటిస్తే కొన్ని విషయాలలో మంచి జరుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు. అందువలన ఆహారం తీసుకోవడంతో పాటు దాని దిశను కూడా గుర్తుంచుకోవడం ముఖ్యం.
సరైన దిశలో కూర్చుని ఆహారాన్ని తింటే మంచిదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే తప్పు దిశలో కూర్చుని ఆహారం తినడం వలన అప్పుల బాధలో మునిగిపోతారట. అయితే ఆహారం ఏ దిశలో కూర్చుని తింటే మంచి జరుగుతోందో వాస్తు శాస్త్రంలో వివరించబడింది. అయితే ముఖ్యంగా అప్పులు ఉన్నవారు అప్పుల బాధలు తీరాలంటే ఈ దిక్కున అస్సలు ఆహారాన్ని తీసుకోకూడదు. వాస్తు శాస్త్ర ప్రకారం మన పనులన్నీ చేయడానికి వివిధ రకాల నియమాలు ఉన్నాయి. కొన్ని దిశలలో కొన్ని పనులను చేయడం కూడా నిషేధించారు. మనం పడుకునే దిశ, దేవుడిని పూజించే దిశ, ఆహారం తీసుకునే దిశ ఇవన్నీ గ్రంథాలలో నిర్దేశించారు. అలాగే రుణ విముక్తి కోసం కూడా ఏ దిశలో ఆహారాన్ని కూర్చుని తినాలి అని గ్రంధాలలో ఉంది. అది ఏ దిక్కునో ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తు శాస్త్ర ప్రకారం దక్షిణాభిముఖంగా కూర్చుని ఆహారాన్ని ఎప్పుడు తినకూడదు. దక్షిణ దిక్కుని నపుంసకుల దిక్కు అని కొందరికి అంటుంటారు. మనిషి దక్షిణాభిముఖంగా కూర్చుని ఆహారాన్ని తినడం వలన అతనిపై అశుభ ప్రభావం పడుతుంది. ఇలా తినడం వలన ప్రతికూల శక్తి శరీరం పై పడి అప్పుల ఊబిలో కూరుకుపోతాడు. అయితే పురాణ గ్రంథాలలో ఆహారాన్ని అన్నపూర్ణ అని అంటారు. అందుకే వాస్తు ప్రకారం గా తూర్పు ముఖంగా కూర్చుని ఆహారం తీసుకోవాలి. ఎందుకంటే తూర్పున దేవతలు నివసిస్తారని నమ్ముతారు. దేవతలు దిక్కుగా ఉండడం వలన తూర్పున ముఖంగా భోజనం చేయడం వలన రుణ సమస్యలు అనేవి తొలగిపోతాయి. అంతేకాకుండా పడమర ముఖంగా, ఉత్తరాభిముఖంగా ఆహారం తీసుకుంటే చాలా శుభప్రదంగా పరిగణిస్తారు.