Venus : సొంత రాశిలోకి శుక్రుడు… ఈ రాశుల వారికి ధ‌న క‌టాక్షం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Venus : సొంత రాశిలోకి శుక్రుడు… ఈ రాశుల వారికి ధ‌న క‌టాక్షం

 Authored By prabhas | The Telugu News | Updated on :21 May 2025,6:00 am

ప్రధానాంశాలు:

  •  Venus : సొంత రాశిలోకి శుక్రుడు... ఈ రాశుల వారికి ధ‌న క‌టాక్షం

Venus : జాతకంలో శుక్రుడు శుభ స్థానంలో ఉంటే ఆ జాతకానికి తిరుగుండదు. సంపదకు, శ్రేయస్సుకు, ఐశ్వర్యానికి, కీర్తికి ప్రతీక అయిన శుక్రుడు శుభస్థానంలో ఉన్న సమయంలో కఠినమైన సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతుంది. వచ్చే నెల 29వ తేదీన శుక్రుడు తన సొంత రాశి అయిన వృషభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీనివల్ల కొన్ని రాశులవారి జీవితం మొత్తం మారిపోనుంది. ఒకరకంగా వారికి అదృష్టం కలిసివస్తుందని చెప్పొచ్చు. అయితే ఏయే రాశులకు శుక్రుడు ఐశ్వర్యాన్ని ప్రసాదించనున్నాడనే విషయాన్ని తెలుసుకుందాం.

Venus సొంత రాశిలోకి శుక్రుడు ఈ రాశుల వారికి ధ‌న క‌టాక్షం

Venus : సొంత రాశిలోకి శుక్రుడు… ఈ రాశుల వారికి ధ‌న క‌టాక్షం

కన్యారాశి

ఈ రాశి వారు డబ్బుకు సంబంధించి ఎదుర్కొంటున్న సమస్యలన్నీ తీరిపోతాయి. కుటుంబ సభ్యులందరి ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు మేలు కలుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపట్ల ఆసక్తి చూపిస్తారు. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్థులకు పదోన్నతులు ల‌భిస్తాయి. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి బాగా కలిసివస్తుంది.

వృషభ రాశి

ఈ రాశి వారు చేపట్టే ప్రతి పనిలో సానుకూల ఫలితం వస్తుంది. చేసే పనుల్లో సులువుగా విజయం సాధించడంతో పాటు ఆర్థికంగా కలిసివస్తుంది. ఆర్థిక సంబంధాలన్నీ మెరుగు పడటంతో పాటు గతంలో కంటే ఇప్పుడు మంచి స్థితిలో ఉంటారు. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయడంతో పాటు శుక్రుడిని పూజించడం వల్ల పెళ్లికాని వారికి వివాహం కుదురుతుంది. కోరుకున్న కోరికలన్నీ నెరవేరతాయి. అదృష్టం తోడుండటం వల్ల అన్ని పనులు పూర్తవుతాయి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది