Vidura Neethi : ఇటువంటి గుణాలున్న మనిషి ఎన్ని అవకాశాలు వచ్చిన… జీవితంలో పైకి ఎదగడు అంటున్న విదుర..!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: October 9, 2022, 7:00 am

Vidura Neethi : వ్యక్తి జీవితంలో అన్ని విజయాలను సాధించి పైకి ఎదగాలంటే విదుర చెప్పిన కొన్ని నీతి వ్యాఖ్యలను పాటిస్తే తప్పకుండా జీవితంలో అన్నీ విజయాలను పొందుతారు. మహాత్మ విదుర ప్రపంచంలోనే గొప్ప నీతివేత్తలలో ఒకడిగా ప్రసిద్ధి చెందాడు. విదుర చాలా గొప్ప ఆలోచనపరుడు. ఆయన చెప్పిన నీతి వ్యాఖ్యలు ప్రజలు పాటిస్తే ఖచ్చితంగా కష్టాల నుంచి బయటపడి పురోగతి వైపు నడుస్తారు. విదుర నీతి విధానంగా ఎటువంటి మనుషులు జీవితంలో విజయాలను అందుకోలేరు చూద్దాం…

మనది కానీ ధనం : ఇతరులు కష్టపడి సంపాదించుకున్న దాని గురించి ఎప్పుడూ ఆశపడకూడదు.. ఎల్లప్పుడూ కష్టపడి సంపాదించిన ధనంతోనే జీవితాన్ని సాగించాలి. అలా చేస్తుంటే అటువంటి వ్యక్తి పట్ల గౌరవం, మర్యాదలు పెరుగుతాయి. అలాగే కీర్తి ప్రతిష్టలు కూడా పొందుతారు. వ్యక్తి మనసు ఎల్లప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఇతరులకు ఉందని.. తమకు లేదని… అసూయ చెడుకి శత్రువు ఇతరుల ధనాన్ని చూసి ఎప్పుడు ఈర్ష్య పడకూడదు. కుటుంబ వాతావరణంలోనే కాదు తమకు తానే చెడు చేసుకుంటాడు. ఈర్ష్య ఎక్కువగా ఉన్న మనుషులు పొరపాట్లు చేస్తూ ఉంటారు. అదే వారిని తర్వాత నేరస్తులుగా మార్చి అవకాశం ఉంటుంది.

Vidura Neethi About on peoples

Vidura Neethi About on peoples

తమకు లేదంటూ ఇతరుల ధనాన్ని చూసి అస్సలు ఈర్ష పడకూడదు. అసూయ వ్యక్తిని నాశనం చేస్తుంది. అది అతని జీవితంలోని ఆనందం, మనశ్శాంతి లేకుండా చేస్తాయి. ఈర్ష పడే మనిషి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండలేడు కావున మనిషి అసూయకు దూరంగా ఉండడం మంచిది. వ్యక్తి ఎల్లప్పుడూ ఇతరుల సంపదపై అస్సలు ఆశ పెట్టుకోవద్దు. అత్యాశకు గురికాకూడదు. ఇతరుల సంపదపై కన్నేసి ఉంచి వ్యక్తులు ఎప్పుడు మానసిక క్షోభకు దోహదపడతారు. ఇది మనిషి గౌరవాన్ని మనశ్శాంతిని కోల్పోయేలా చేస్తుంది. అలాగే పరుల సొమ్ము పాముతో సమానం ఎదుటివారి సంపదపై దురాశ ఎల్లప్పుడు వ్యక్తి నాశనానికి దోహదపడుతుంది.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

  2. "Vijay Deverakonda Sukumar : విజయ్‌కు సుకుమార్ సినిమా పడితే కెరీర్ టర్నింగ్ పాయింటేనా? ఆరేళ్లుగా ఎదురుచూపులు!"

  3. "AP Local Body Elections : ఏపీలో కూటమి మాస్టర్ ప్లాన్.. బీసీలకు అదనపు టికెట్లు, మహిళలకు పెద్దపీట!"

  4. "Navratri Fasting Rules : నవరాత్రుల ఉపవాసం చేస్తున్నారా? పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!"

  5. "Medha Heroine : టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వ‌నున్న స్టార్ హీరో కుమార్తె .. ఫస్ట్‌ లుక్ అదుర్స్‌..!"

  6. "Pawan Kalyan : స్థానిక ఎన్నికల్లో కూటమి ఐక్యతపై పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్.. పొత్తులో తేడా వస్తే అంతే సంగతులా..?"

  7. "Old 5 Rupee Note : పాత రూ.5 నోటుకు రూ.17 లక్షలు.. మూడు రోజుల్లో రైతుకు ఏం జ‌రిగిందంటే..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp