Vidura Niti | విదుర నీతి చెప్పే మూడు అద్భుత అలవాట్లు.. జీవితాన్ని మార్చే మార్గదర్శకాలు
Vidura Niti | పురాణాల్లో మహాభారతానికి విశిష్ట స్థానం ఉంది. ఆ ఇతిహాసంలోని గొప్ప తత్త్వవేత్తలలో విదురుడు ముఖ్యుడు. ధర్మజ్ఞుడిగా, మేధావిగా ప్రసిద్ధి చెందిన విదురుడు చెప్పిన “విదుర నీతి నేటి కాలానికి కూడా ప్రాముఖ్యత కలిగిన మార్గదర్శక గ్రంథంగా చెప్పుకోవచ్చు. విదుర నీతిలో అనేక జీవిత సత్యాలు, మానవ విలువలు, ధర్మ బోధనలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా మూడు అలవాట్లు మన జీవితాన్ని ధనసంపన్నం, విజయవంతంగా తీర్చిదిద్దగలవని విదురుడు చెబుతాడు.

#image_title
ఇవి పాటించాలి..
విదురుని మాటల్లో..కష్టపడే, అంకితభావంతో పని చేసే వ్యక్తిని ఎవరూ ఆపలేరు. అతడు ఎప్పుడూ విజయానికి అతి దగ్గరగా ఉంటాడు. సోమరితనాన్ని విడిచిపెట్టి, సమయపాలనతో ముందుకెళ్లే వారు డబ్బు, గౌరవం రెండూ సంపాదించగలరు. అదృష్టం కూడా కృషిశీలుల వైపే నిలుస్తుంది.
ఏ పని అయినా పట్టుదలతో, సమయానికి పూర్తి చేయాలంటే శ్రద్ధ, పట్టుదల చాలా అవసరం. విదురుని ప్రకారం, అభ్యాసమూ, జ్ఞానార్జనమే శక్తి. కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఉత్సాహం ఉన్నవారే జీవితంలో ముందుకెళతారు. వారు కాలానికి అనుగుణంగా అభివృద్ధి చెందుతారు. నైపుణ్యాలు పెంచుకుంటారు. అలాంటి వ్యక్తి తప్పకుండా విజయాన్ని సాధిస్తాడు. విదురుడు చెబుతున్నట్టుగా, “పొదుపు తెలిసిన వాడే నిజమైన ధనవంతుడు. తగినంత ఆదాయం ఉన్నా ఖర్చులను నియంత్రించుకోలేని వారు ఎప్పుడూ ఆర్థికంగా అస్థిరంగా ఉంటారు. కానీ అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చి, కోరికలను నియంత్రించగలిగితే సంపద నిలుస్తుంది, భవిష్యత్తు బాగుంటుంది.