Vidura Niti : ఒక వ్యక్తిలో ఈ 8 గుణాలు ఉంటే చాలు… అందరిచే గౌరవించబడతాడంటున్న విదుర…
Vidura Niti : హిందూ ధర్మంలో రామాయణ, మహాభారతాల గురించి అందరికీ తెలిసినవే. ఈ ఇతిహాసాలు నేటి మానవుల జీవితానికి సంబంధించి మంచి, చెడుల గురించి తెలుపుతాయి. పాండురాజు ధృతరాష్ట్రులకు సవతి తమ్ముడు విదురుడు. ఈయన మహానీతిమంతుడు. విదురుడు కురువంశ పితామహుడైన భీష్ముడు దగ్గర విద్యను అభ్యసించాడు. విదురుడు ధృతరాష్ట్రుడి కొలువులో మంత్రి. కౌరవులు పాండవులకు చేసిన అన్యాయాలకు విదురుడు ప్రత్యక్ష సాక్షి. అన్యాయం సహించని నైజం విధురుడిది. ప్రపంచంలోనే గొప్ప నీతివేత్తలలో మహాత్మ విదుర పేరు ప్రసిద్ధిగాంచింది. గొప్ప ఆలోచనపరుడు అయిన విదురుడు చెప్పిన నియమాలు నేటి కాలంలో ప్రజలు అనుసరిస్తే కష్టాల నుండి బయటపడవచ్చు. మహాత్మా విదుర మనిషిలో కనిపించే ఎనిమిది గుణాల గురించి చెప్పారు. ఈ గుణాలను పాటిస్తే ప్రపంచంలో అందరిచే గౌరవించబడతాడని చెప్పారు. అయితే ఆ ఎనిమిది గుణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1) ఒక మనిషికి స్వభావం అతనికి సమాజంలో భిన్నమైన గుర్తింపునిస్తుంది. ఒక మనిషి స్వభావం కారణంగానే అతను ఉత్తీర్ణత సాధించిన విఫలమవుతాడు. సరళంగా, సహజంగా ఉంటే ప్రజలు మిమ్మల్ని ఇష్టపడతారు. అలాగే అందరూ గౌరవిస్తారు. 2) ఒక మనిషి తన ఇంద్రియాలు లేదా మనసుని నియంత్రించుకునే సామర్థ్యం కలిగి ఉండాలి. అలాంటి వ్యక్తి ఎల్లప్పుడూ చేసే పనిలో విజయాన్ని సొంతం చేసుకుంటాడు. సమాజంలో ప్రతి ఒక్కరు అతడిని గౌరవ మర్యాదలతో ఆదరిస్తారు. 3) అలాగే మనిషికి ఇతరులకు సహాయం చేసే స్వభావం ఉండాలి. అలాంటి వ్యక్తులను ప్రజలు ఎల్లప్పుడూ గౌరవిస్తారు. అలాగే కష్ట సమయాలలో ప్రజలు ఎల్లవేళలా అలాంటి వ్యక్తులకు అండగా నిలబడతారు. 4) మన హిందూ ధర్మంలో దాతృత్వం అనేది సద్గుణంగా పరిగణించబడుతుంది. దానం చేసే వ్యక్తి ఎప్పటికీ కీర్తించబడతాడు. అతడు సమాజంలో గొప్ప వ్యక్తిగా గౌరవిస్తారు.
5) మనిషికి తెలివితేటలు ఉండడం పెద్ద విషయం కాదు. అయితే ఆ తెలివితేటలకు మంచి పనులకు ఉపయోగించడం చాలా ముఖ్యం. తన తెలివితేటలను సరైన మార్గంలో ఉపయోగించే వ్యక్తి జీవితంలో ప్రతి విషయాలలో విజయాన్ని అందుకుంటాడు. అలాగే గౌరవాన్ని పొందుతాడు. 6) ఒక మనిషి తన జ్ఞానాన్ని పెంపొందించుకుంటే అతనికి ప్రతి చోట తగిన గుర్తింపు లభిస్తుంది. అతని జ్ఞానంతో తెలిసినవారు తెలియని వారితో కూడా గౌరవించబడతాడు. అంతేకాదు అటువంటి మనిషి నుండి జ్ఞానాన్ని పొందాలని తపనలో ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. 7) ఒక శక్తివంతమైన వ్యక్తి తన సొంత బలంతో కీర్తిని పొందుతాడు. ప్రపంచంలో ప్రజాదారణ పొందేందుకు ధైర్యంగా ఉండడం కూడా అవసరం. 8) ప్రపంచంలోని ప్రతి ఒక్కరు పరిస్థితి అంచనా వేస్తూ ఆలోచనత్మకంగా అడుగులు వేయాల్సి ఉంటుంది. అటువంటి వారు తప్పనిసరిగా సమాజంలో మంచి గుర్తింపును సంపాదించుకుంటారు.