Categories: DevotionalNews

Weekly Zodiac Signs : ఈ వారం మీ రాశిఫ‌లం ఎలా ఉందో చూసుకోండి.. ఆగస్టు 11 నుండి 17 వరకు…!

Weekly Zodiac Signs : ఆగస్టు 11వ తేదీ ఆదివారం నుంచి ఆగస్టు 17వ తేదీ శనివారం వరకు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది..? అలాగే ఏ రాశి వారికి అదృష్టం కలిసి రాబోతుంది..? ఏ రాశి వారికి మంచి ఫలితాలు అందబోతున్నాయి..? ఏ రాశి వారు ఏ పరిహారాలు చేస్తే మంచి ఫలితాలను పొందుతారు..? ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం…

Weekly Zodiac Signs మేష రాశి

మేష రాశి దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. గృహంలో సందడి నెలకొంటుంది. మంగళ శనివారాలలో ఖర్చులు అధికంగా ఉంటాయి. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి అవుతాయి. బంగారం వెండి సామాగ్రి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. అలాగే నష్టాలను భర్తీ చేసుకోగలుగుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

వృషభ రాశి: ఈవారం వివాహ ప్రయత్నాలు సాగిస్తారు. గృహ మార్పు కలిసి వస్తుంది. ధన లాభం ఉంటుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. చెల్లింపుల విషయాలలో జాగ్రత్త వహించాలి. గురు శుక్రవారాలలో పనులు హడావిడిగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు లాభ సాటిగా కొనసాగుతాయి. ప్రైవేట్ రంగం వారికి ఒత్తిడిలు చికాకులు తప్పవు. ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి.

మిధున రాశి: ఈ వారం మిధున రాశి వారు మనోధైర్యంతో ముందుకు సాగుతారు. ఆర్థిక సితి సామాన్య ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. శనివారం నాడు ఒత్తిడికి లొంగవద్దు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి పని భారం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి ప్రయాణాలు అనుకూలిస్తాయి. సన్నిహితుల కోసం ఈ పనులను వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. కుటుంబికులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది.

కర్కాటక రాశి : ఈవారం కర్కాటక రాశి వారికి ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. పనులను మొండిగా పూర్తి చేస్తారు. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ అవసరం. ఆత్మీయుల కలయికతో కుదుటపడతారు. ఆహ్వాన పత్రాలను అందుకుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా కొనసాగుతాయి. వ్యాపారంలో ఆటుపోట్లకు దీటుగా ఎదుర్కొంటారు. భార్య భర్తల మధ్య కలహాలు పట్టింపులు అధికమవుతాయి.

సింహరాశి : ఈవారం సింహ రాశి వారు నిర్దిష్ట ప్రణాళికలను రూపొందించుకుంటారు. వాయిదా పడిన పనులను పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో విభేదాలు తలెత్తుతాయి. వ్యాపార అభివృద్ధికి పథకాలను రూపొందిస్తారు. వేడుకలు విందులో పాల్గొంటారు. ఉపాధ్యాయుల శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది. పాత మిత్రుల కలయిక ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాల్లో విజయాలను సాధిస్తారు. ఉద్యోగాలలో మరింత ప్రగతి కనిపిస్తుంది.

కన్యారాశి : ఈవారం కన్యరాశి వారికి శుభకార్యం నిశ్చయమవుతుంది. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. పెట్టుబడులకు అనుకూలం అలాగే ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఆత్మీయులకు చక్కని సలహాలను ఇస్తారు. పదవులు బాధ్యతలను స్వీకరిస్తారు. ఆది సోమవారాలు అనేక పనులతో సతమతమవుతారు. వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమించాలి. విద్యార్థులకు దూకుడు తగదు.

తులారాశి : తుల రాశి వారికి ఈ వారం గృహం సందడిగా ఉంటుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. చక్కటి ప్రణాళికలను రూపొందించుకుంటారు. ఊహించిన ఖర్చులు ఉంటాయి. మంగళ బుధవారాలలో పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది సంతాన విషయాలు శుభవార్తలు వింటారు.

వృశ్చిక రాశి: ఈ వారం వృశ్చిక రాశి వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. వేడుకలలో పాల్గొంటారు. ఆత్మీయుల కలయిక సంతోషాన్ని ఇస్తుంది. ఒక ఆహ్వానం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఖర్చులు సంతృప్తికరం ఈ వారంలో వాహనాలను కొనుగోలు చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. గురు శుక్రవారాల్లో అనవసరపు విషయాలను దూరంగా ఉండాలి. పదవుల కోసం యత్నాలను సాగిస్తారు.

ధనస్సు రాశి: ఈవారం ధనుస్సు రాశి వారి ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. దుబారా ఖర్చులు అధికం. ఒక సమాచారం ఉపశమనాన్ని కలిగిస్తుంది. కుటుంబ విషయాలపై శ్రద్ధ వహిస్తారు. శనివారం నాడు శ్రమించిన ఫలితం ఉండదు. అనేక పనులతో సతమతమవుతారు. సన్నిహితులను కలుసుకుంటారు. వ్యాపారాలు క్రమంగా ఉప్పొందుకుంటాయి. ఉద్యోగులకు తోటి ఉద్యోగి కారణంగా పని ఒత్తిడి అధికమవుతుంది. ఆరోగ్యం మందగిస్తుంది.

Weekly Zodiac Signs : ఈవారం రాశి ఫలాలు… ఆగస్టు 11 నుండి 17 వరకు…!

మకర రాశి: ఈవారం మకర రాశి వారు కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు. ఆప్తుల కలయిక ఉత్సాహం చేస్తుంది. ఆది సోమవారాలలో బాధ్యతలను అప్పగించవద్దు. సంతానం ఉత్సాహాన్ని అదుపు చేయండి. నిరుత్సాహాన్ని విడిచి ఉద్యోగ ప్రయత్నాన్ని ప్రారంభించండి. వ్యాపార అభివృద్ధికి పథకాలను అమలు చేస్తారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణ బాధలు తొలుగుతాయి. విద్యా అవకాశాలు దక్కి విద్యార్థులకు ఓరటా కలుగుతుంది.

కుంభరాశి : ఈ వారం కుంభరాశి వారి వ్యవహారాలను స్వయంగా చూసుకోవాలి. ఆత్మీయుల రాక ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆందోళన తొలగి కుదుటపడతారు. అవకాశాలను తక్షణమే వినియోగించుకోండి. పనులను మొండిగా పూర్తి చేస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. పెట్టుబడులపై దృష్టి సాధిస్తారు. ఉద్యోగులకు పనిభారం ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిక సాగుతాయి. ఆదాయ వేయాలి మీ అంచనాలకు భిన్నంగాా ఉంటాయి.

Recent Posts

Biryani | బిర్యానీలో బొద్దింక .. అరేబియన్ మండి రెస్టారెంట్‌లో చెదు అనుభవం!

Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్‌ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…

12 hours ago

Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ఫొటోపై దాఖలైన పిల్‌ను కొట్టేసిన హైకోర్టు .. రాజకీయ ఉద్దేశాలతో కోర్టుల్ని వాడకండంటూ హెచ్చరిక

Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…

13 hours ago

UPI | ఫోన్ పే, గూగుల్ పేలో దూకుడు.. ఒకే నెలలో 20 బిలియన్లు ట్రాన్సాక్షన్లు

UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…

13 hours ago

Trisha | సినిమాల పట్ల త్రిష ప్రేమను మరోసారి చాటిన టాటూ.. సైమా వేడుకలో హైలైట్

Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…

15 hours ago

Walking | రోజుకు 10 వేల అడుగులు నడక వ‌ల‌న‌ వచ్చే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో తెలుసా?

Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…

16 hours ago

Cholesterol | ముఖంపై కనిపించే లక్షణాలు .. చెడు కొలెస్ట్రాల్ పెరుగుతోందని సంకేతాలు!

Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…

17 hours ago

I Phone 17 | గ్రాండ్‌గా లాంచ్ అయిన ఐ ఫోన్ 17.. లాంచ్, ఫీచ‌ర్స్ వివ‌రాలు ఇవే.!

I Phone 17 | టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ త‌న లేటెస్ట్ ఐఫోన్ మోడ‌ల్ ఐఫోన్ 17ను తాజాగా…

18 hours ago

Dizziness causes symptoms | ఆక‌స్మాత్తుగా త‌ల తిరుగుతుందా.. అయితే మిమ్మ‌ల్ని ఈ వ్యాధులు వెంటాడుతున్న‌ట్టే..!

Dizziness causes symptoms |  చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…

18 hours ago