After Death : మరణించిన తర్వాత ఆత్మ 12 రోజులపాటు తన ఇంట్లో ఏం చేస్తుందో తెలుసా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

After Death : మరణించిన తర్వాత ఆత్మ 12 రోజులపాటు తన ఇంట్లో ఏం చేస్తుందో తెలుసా..?

 Authored By tech | The Telugu News | Updated on :18 March 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  After Death : మరణించిన తర్వాత ఆత్మ 12 రోజులపాటు తన ఇంట్లో ఏం చేస్తుందో తెలుసా..?

After Death : ఈ భూమి మీదకు వచ్చిన ప్రతి ప్రాణి తన ఆయుష్షు ప్రమాణం పూర్తవగానే మరణించక తప్పదు.. అలానే ఆ దేహం నుండి వేరుపడిన ఆత్మ తన కర్మ ఫలాన్ని అనుసరించి మరో శరీరంలోనికి ప్రవేశించి తిరిగి జన్మించగా మానదు. నిరంతరంగా సాగే ప్రక్రియ అంటే దీని ప్రకారం చూస్తే మరణం తర్వాత శరీరం దహనమైన కూడా ఆత్మ ఇంకా మనుగడలోనే ఉంటుందన్నమాట. మరణం తరువాత ఆత్మ ప్రయాణం మరణించిన తర్వాత ఆత్మను సంతృప్తి పరచడానికి చేయాల్సిన కర్మల గురించి అష్టాదశ పురాణాల్లో ఒకటైన గరుడ పురాణంలో విపులంగా వివరించబడి ఉంది. ఒకరోజు విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడు దగ్గరికి వెళ్లి స్వామి ఈ భూమిపై పుట్టిన ప్రతి జీవుడు తన ఆయుర్దాయం. పూర్తయ్యాక ఏదో ఒక రోజున మరణిస్తాడు. కదా మరి ఆ జీవుడు బ్రతికున్నంత వరకు అతనిని అంటిపెట్టుకొని ఉండే ఆత్మ దేహం పడిపోగానే తనకు ఆ దేహంతో ఏమి సంబంధం లేనట్టు తనమాన వెళ్ళిపోయి వేరే దేహంలో ప్రవేశిస్తుందా ఆ ఆత్మకు తాను ఇప్పటివరకు ఉన్న శరీరం పైన తన కుటుంబ సభ్యుల పైన మమకారం ఉండదా అని అడుగుతాడు. గరుత్మంతుడు ప్రశ్నలు అన్నింటినీ సావధానంగా విన్న విష్ణుమూర్తి చిరునవ్వు నవ్వి ఓ గరుడ నీకు జీవుడు మరణించిన తర్వాత ఆత్మ ప్రయాణం గురించి వివరంగా చెబుతాను.

విను అంటూ చెప్పడం మొదలుపెడతాడు. గత జన్మలో చేసిన కర్మలు ఆధారంగా అతడు ఎటువంటి కుటుంబంలో పుట్టాలి. ఎటువంటి జీవితం అనుభవించాలి ఎలా మరణించాలని అతడు ఏ విధంగా మరణించాలని నిర్ణయించబడి ఉంటుంది. లేక ఆత్మహత్య చేసుకోవడం వలన అతనికి మృత్యువ సంభవించగానే ఆ జీవునికి కేటాయించబడిన యమదూతలు ఉండే ఆత్మను శరీరం నుండి వేరు చేస్తారు. ఇలా చేసే సమయంలో తన వద్దకు వచ్చిన అమ్మబడులను చూసి ఎంతో భయపడిన ఆత్మ ఈ పాంచ భౌతిక శరీరం మీద ఆశ చావక తాను ఈ దేహం విడిచి రాను రాలేదని ఇంకా మమకారం తీరలేదని తనను ఎక్కడికి తీసుకెళ్లలేదని వేడుకుంటూ ఉంటుంది. అక్కడ జరిగే తంతునంత ఆ ఆత్మకు చూపిస్తారు. ఆ సమయంలో ఆ ఆత్మకు ఈ జన్మలో నీవు ఎటువంటి కర్మలు చేశావు. నీకు దగ్గర వారు ఎవరు దూషించే వారెవరు నీ గురించి నీ కుటుంబ సభ్యులు ఏమనుకుంటున్నారు. తదితర విషయాలను యమదూతలు కళ్ళకు కట్టినట్లు వివరిస్తారు. ఎన్ని పాపపు కర్మలు చేశానా అంటూ అనేక రకాలుగా దుఃఖిస్తూ ఉంటుంది. ఈ సమయంలో తన కోసం తన కుటుంబ సభ్యులు ఏడవడం చూసి తట్టుకోలేకపోయినా ఆ ఆత్మ తన వారందరి చుట్టూ తిరుగుతూ పెద్దగా అరుస్తూ శబ్దాలు చేస్తూ ఉంటుంది. తన వారందరూ కడసారి చూపుచూసిన తర్వాత ఆ పార్దివ దేహాన్ని కుటుంబ సభ్యులు బంధువులు దాన సంస్కారాలు నిర్వహించడానికి స్మశానానికి తీసుకువెళ్తారు.

తట్టుకోలేని ఆత్మ అయ్యో ఇప్పటివరకు నా శరీరాన్ని ఎంతో ప్రేమగా చూసుకున్నానే చిన్న గాయం కూడా తట్టుకోలేని శరీరం ఇప్పుడు ఇలా కట్టెల్లో కాలిపోతుంది. అంటూ రోదిస్తూ ఉంటుంది. దహన సంస్కారాలు ముగియగానే 12 రోజులపాటు ఉంచుతారు. ఈ సమయంలో మరణించిన వారి కుటుంబ సభ్యులు 12 రోజులపాటు పిండ దానం చేస్తూ ఉంటారు. అప్పుడు మరణించిన ఆత్మీయొక్క అంగముల పునర్నిర్మానం జరుగుతుంది. అయితే ఎవరైతే చనిపోయిన వ్యక్తికి ఎలాంటి కర్మలు నిర్వహించారు.171 వ రోజుకి యముని సోదరుడు అయిన విచిత్ర రాజు పరిపాలించే విచిత్ర భవనం అనే నగరానికి చేరుకుంటుంది. ఈ నగరానికి ఆనుకునే వైతరణి నది ఉంటుంది. నరకంలోకి ప్రవేశించాలంటే ముందు ఈ వైతరణి నదిని దాటాల్సి ఉంటుంది. ఇక్కడ ఆత్మకు తాను ఈ జన్మలో చేసిన పాపాలను అనుభవించడానికి వీలుగా ఒక యాతన శరీరాన్ని ఇస్తారు. కానీ భస్మం కాదు. ఈ యాతన శరీరంలో జీవిని ప్రవేశపెట్టిన యమకింకరులు దక్షిణ ద్వారము గుండా ఎమప్పుడికి చేరుస్తారు. జీవి మరణించినప్పటి నుండి ఇక్కడికి చేరుకోవడానికి సరిగ్గా 361 రోజులు పడుతుంది. మరణించిన తర్వాత 361 వ రోజు నుండి మూడు రోజులపాటు సంవత్సరీకాన్ని నిర్వహిస్తారు. విముక్తి లభిస్తుందని విష్ణుమూర్తి గరుత్మంతునితో ఆత్మ ప్రయాణం గురించి వివరంగా చెప్తాడు..

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది