After Death : మరణించిన మన తాత, ముత్తాతలు ఎక్కడ ఉన్నారో మీకు తెలుసా..? పితృదేవతల గురించి నమ్మలేని నిజాలు…!
ప్రధానాంశాలు:
After Death : మరణించిన మన తాత, ముత్తాతలు ఎక్కడ ఉన్నారో మీకు తెలుసా..? పితృదేవతల గురించి నమ్మలేని నిజాలు...!
After Death : పితృదేవతలంటే మరణించిన మన పితురులు కాదు. మనందరి రాకపోకలను వారి గతులను సమర్ధవంతంగా నిర్వహించే దేవత వ్యవస్థను పితృదేవతావ్యవస్థ అని అంటారు. వసువులు రుద్రులు ఆదిత్యులు అనబడే వారిని పితృదేవతలను పిలుస్తారు. ఈ పితృ గణాలు ఒక్కో మండలంలో ఉంటూ చనిపోయిన వారి శ్రార్థ కర్మలను స్వీకరిస్తూ ఉంటారు. వసూలు తండ్రికి రుద్రులు తాతకు ఆదిత్యులు ముత్తాతకు ప్రాతినిధ్యమయిస్తారు. చనిపోయిన తర్వాత వారి పుత్రుడు అంతే కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించి పిండ ప్రధానం చేసిన వారికి మాత్రమే ఈ ఉత్తమ గతులు కలుగుతాయి. అలా జరగని వారు పూర్తవ లోకాలకు వెళ్లకుండా ప్రయత్నాత్మలై అధోలోకాలకు వెళ్లి అనాధ ప్రయత్నం లాగా సర్గతులు పొందకుండా తిరుగుతూ ఉంటారు.
జీవుడు ఆయుర్ధాయంగా గాని ఆ జీవిని తీసుకువెళ్లడానికి వచ్చిన యమ బటులు సూక్ష్మ రూపంలో ఉండే ఆత్మను శరీరం నుండి వేరు చేసి అతని శ్రార్థ కర్మలు ముగిసి ప్రతిరూపంలో తన వంశీకులు సమర్పించిన పిండాలను స్వీకరించే వరకు 12 రోజులపాటు చనిపోయిన ప్రదేశంలోనే ఉంచుతారు. శాస్త్రంగా శ్రాద్ధ కర్మలు నిర్వహించిన తర్వాత ఆ జీవిని యమభట్లు తీసుకుని వెళ్తారు. విశిష్యతే అని మన వేదంలో చెప్పబడింది. దైవ కార్యాల కంటే పితృ కార్యాలు చాలా ముఖ్యమైనవి. తమ తమ వారిని స్మరించుకుంటూ మనోమయ రూపంలో శ్రాద్ధ స్థలం చేరుకుంటారట. వారు బ్రాహ్మణులతో కూడా వాయు రూపంలో భోజనం స్వీకరిస్తారు. ప్రతి మహాలయ అమావాస్యనాడు మన పితురులు తమ సంతతి ద్వారం దగ్గరే నిలబడతారట. ఆరోజు వారికి శ్రాద్ధ కర్మ నిర్వర్తించకపోతే దేవునికి బదులుగా శపించి వెళ్ళిపోతారని శాస్త్రం చెప్తుంది. అలా కాకుండా మన పితరులు వెయిటింగ్ లేకుండా వారి సంకల్పబలం వల్ల వెంటనే మరుజన్మ ఎత్తేసారు అనుకోండి.
అలా వారు మరల జన్మించినా కూడా మనం నిర్వహించే శ్రాద్ధ కర్మలు వారికి చేరుకుంటాయట. వాటిని వారు స్వీకరిస్తారట. వారు ఏ రూపంలో పుట్టినా సరే మనం పెట్టింది వారికి ఏది ఆహారము ఆ రూపం లో అందుతుందట. మన పితరులు మరలా మనిషిగా జన్మిస్తే వారికి అన్న రూపంలోనూ పశుపక్షాదులుగా జన్మిస్తే గ్రాసం రూపంలోనూ రాక్షసులుగా జన్మిస్తే రక్తాన్న రూపంలోనూ వారికి మనం పెట్టేవి చేరతాయట.కొంతమంది ఆర్థిక భారం వల్ల బ్రాహ్మణుని పిలిచి అస్తమాను శ్రాద్ధ కర్మలు నిర్వహించలేరు. అలాంటివారు మన పితృదేవతలను మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ గోవుకు గ్రాసం పెట్టవచ్చు. అది కూడా వీలు లేని వారు ఒక నిర్జన ప్రదేశంలో నిల్చని అపరాన్న సమయంలో రెండు చేతులు ఆకాశం వైపు పైకి ఎత్తి పితృదేవతలకు నమస్కరించవచ్చు. ఇలా చేసినా కూడా వారు మన స్థితిని గమనించి ఉన్న దానితోనే తృప్తి చెంది మనకు మంచి ఫలితాన్ని కలిగిస్తారట..